కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

యుద్ధ స్మారక స్థూపం వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించిన జాతీయ క్రీడా అవార్డు గ్రహీతలు

Posted On: 29 NOV 2022 4:35PM by PIB Hyderabad

ముఖ్య అంశాలు:

 • బాక్సర్ నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్ క్రీడాకారులు లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్, స్టీపుల్‌ఛేజర్ అవినాష్ సాబ్లే, చెస్ ప్లేయర్ ఆర్ ప్రజ్ఞానానంద తదితరులు  యుద్ధ స్మారక స్థూపం  ని సందర్శించారు.

• 2022 సంవత్సరానికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, 25 అర్జున అవార్డులు మరియు ఏడు ద్రోణాచార్య అవార్డులతో సహా 40కి పైగా క్రీడా అవార్డులు ప్రధానం 

2022 సంవత్సరం  జాతీయ క్రీడా అవార్డులకు ఎంపిక అయిన క్రీడాకారులు, కోచ్‌లు ఈరోజు ఢిల్లీ లోని  జాతీయ యుద్ధ స్మారకాన్ని  సందర్శించి మరణించిన భారత సైనికులకు నివాళులు అర్పించారు. అవార్డుల ప్రదానోత్సవానికి  ఒక రోజు ముందు అనేక మంది అమర వీరులకు నివాళులు అర్పించారు.  బాక్సర్ నిఖత్ జరీన్, , బ్యాడ్మింటన్ క్రీడాకారులు లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్, స్టీపుల్‌ఛేజర్ అవినాష్ సాబ్లే , చెస్ ప్లేయర్ ఆర్ ప్రజ్ఞానంద వంటి ప్రముఖ అథ్లెట్లు యుద్ధ స్మారక స్థూపం  ని సందర్శించారు.

అవార్డు గ్రహీతలు వీర్త చక్ర (శౌర్య వృత్తం) పర్యటనకు వెళ్లారు. అక్కడ వారు స్వాతంత్ర్యం తర్వాత దేశం ఎదుర్కొన్న వివిధ చారిత్రక యుద్ధాలను వర్ణించే 6 కాంస్య కుడ్య చిత్రాలను తిలకించారు. 
2022 సంవత్సరానికి  మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, 25 అర్జున అవార్డులు మరియు ఏడు ద్రోణాచార్య అవార్డులతో సహా 40 కి పైగా క్రీడా అవార్డులు ప్రదానం చేయనున్నారు. 

***



(Release ID: 1879874) Visitor Counter : 151


Read this release in: English , Urdu , Hindi