ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ని-క్షయ మిత్ర మరియు టి.బి. ముక్త్ భారత్ ప్రచారానికి జాతీయ రాయబారి గా - పద్మశ్రీ, ఖేల్ రత్న, అర్జున అవార్డు గ్రహీత డా. (హెచ్.సి) దీపా మాలిక్
ఐ.ఐ.టి.ఎఫ్. 2022లో హెల్త్ పెవిలియన్ని సందర్శించి, టి.బి. బాధితులతో సంభాషించారు, టి.బి. రోగులకు మద్దతుగా ని-క్షయ మిత్రలుగా మారాలని అందరినీ కోరారు
Posted On:
26 NOV 2022 2:45PM by PIB Hyderabad
పద్మశ్రీ, ఖేల్ రత్న, అర్జున అవార్డు గ్రహీత, భారతదేశపు మొదటి మహిళా పారాలింపిక్ పతక విజేత, భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షురాలు డాక్టర్ (హెచ్.సి) దీపా మాలిక్ టి.బి. ముక్త్ భారత్ ప్రచారానికి జాతీయ రాయబారి మరియు ని-క్షయ మిత్ర కావడం ద్వారా తన మద్దతును ప్రకటించారు.
డాక్టర్ (హెచ్.సి) దీపా మాలిక్ 2018 మార్చి లో గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన టి.బి. ముక్త్ భారత్ ప్రచారానికి తన నిబద్ధతను వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన లోని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పెవిలియన్ లో నిర్వహించిన టి.బి. అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు.
గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించిన ని-క్షయ మిత్ర ప్రచారానికి తన మద్దతును మరింతగా అందించింది. ఈ ప్రచారంలో భాగంగా, టి.బి. బాధిత రోగులకు పోషకాహారం, అదనపు రోగనిర్ధారణ, వృత్తిపరమైన మద్దతు వంటి మూడు స్థాయిలలో సహాయం అందించడానికి కృషి జరుగుతోంది. ఆమె స్వయంగా ఐదుగురు టి.బి. రోగులను ని-క్షయ మిత్ర గా దత్తత తీసుకున్నారు. ఈ పధకంలో తమ పేరు కూడా నమోదు చేసుకోవాలని, ప్రజలను కూడా ప్రోత్సహించారు. ప్రతి ఒక్కరూ తమ సామర్ధ్యం మేరకు - కళంకాన్ని తొలగించడం, అవగాహన కల్పించడం, సహాయం అందించడం వంటి సేవల్లో పాల్గొంటే, భారతదేశం చాలా త్వరగా టి.బి. ని జయిస్తుంది.
టి.బి. ముక్త్ భారత్ ప్రచారానికి తన మద్దతు గురించి డాక్టర్ (హెచ్.సి) దీపా మాలిక్ మాట్లాడుతూ, “టి.బి. ముక్త్ భారత్ జన్-ఆందోళన్ లో జాతీయ రాయబారిగా చేరినందుకు నేను సంతోషిస్తున్నాను. బలహీనపరిచే ఈ వ్యాధి గురించి మరింత అవసరమైన అవగాహనను పెంపొందించడానికి ఏర్పాటైన బృందాలతో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాను, 2025 సంవత్సరానికి, భారతదేశాన్ని టి.బి. రహిత దేశంగా లక్ష్యాన్ని చేరుకోవడానికి, టి.బి.ని సులభంగా నివారించవచ్చు, నయం చేయవచ్చు! " అని పేర్కొన్నారు.
తాను టి.బి. ని జయించిన విధానం గురించి వివరిస్తూ, చికిత్స శారీరకంగా ఉన్నప్పటికీ, కోలుకోవడానికి మొదటి దశ మానసిక శ్రేయస్సు తో ప్రారంభమౌతుంది కాబట్టి, సానుకూల మనస్తత్వాన్ని కొనసాగిస్తూ, దాని చుట్టూ ఉన్న కళంకాన్ని అధిగమించడం పై దృష్టి సారించాలని, ఆమె నొక్కి చెప్పారు. పూర్తిగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చని కూడా ఆమె నొక్కి చెప్పారు. ఆరోగ్యాన్ని సంపూర్ణంగా గ్రహించడం చాలా కీలకం. ఇందుకోసం, భౌతిక అంశానికి మించి మానసిక శ్రేయస్సు పై ఎక్కువ దృష్టి పెట్టాలి. "ఆరోగ్యమే మహా భాగ్యం" అనే విషయాన్ని ఆమె ప్రముఖంగా పేర్కొన్నారు. 2025 నాటికి భారతదేశం టి.బి. నుండి విముక్తి పొందేలా చేయడానికి ప్రజలందరూ, జన్ ఆందోళన్ ఉద్యమంలో పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
"వయస్సు, జాతి, లింగం లేదా శక్తి కారణంగా వారి సామర్థ్యాన్ని నెరవేర్చడంలో ఎవరూ వెనుకబడి ఉండకూడదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇందులో టి.బి. వంటి వ్యాధితో బాధపడుతున్న వారు కూడా ఉంటారు. వారు ఎప్పుడూ ఒంటరిగా భావించకూడదు. వారికి మద్దతు ఇవ్వడానికి మనం చేయగలిగినదంతా చేయడం పౌరులుగా మన కర్తవ్యం. మనం వారిని మిత్రునిగా సంప్రదించాలి. మనం మద్దతు ఇస్తున్న సంగతి వారికి గుర్తు చేయాలి. అందుకే నేను ని-క్షయ మిత్ర గా ని-క్షయ మిత్ర చొరవకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాను." అని డాక్టర్ (హెచ్.సి) దీపా మాలిక్ పేర్కొన్నారు.
*****
(Release ID: 1879344)
Visitor Counter : 145