సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇఫ్ఫి 53లో అకాడమీ పురస్కారం పోటీ చిత్రం 'బర్త్‌డే బాయ్' ప్రదర్శన
‘మా సినిమా ఒక జీవిత వేడుక’- అర్టురో మాంటెనెగ్రో, బర్త్‌డే బాయ్ సినిమా దర్శకుడు
కొవ్వొత్తులు, కేక్, కాంతులు, స్నేహితులు... పుట్టిన రోజున ఇవి కాక ఏం ఉంటాయి?, జిమ్మీ తన స్నేహితులతో కలిసి బీచ్ హౌస్‌లో తన 45వ పుట్టినరోజును జరుపుకున్నాడు. కేక్ కట్ చేసిన తర్వాత ఆత్మహత్యకు ప్లాన్ చేస్తున్నానని అతను చెప్పడంతో ఉత్సాహ వాతావరణం అంతా తలకిందులవుతుంది.
![](https://ci6.googleusercontent.com/proxy/qMNVpIXRuhrgqPy9LsgaXEZunDtKPYLU5Am6pDaCNwAZgzPu62J3YEKeI3CJ-VfEzCiNQ7UtDFxShCqNrcPRnTsYjbpepJaYVH4qsCKFHFy7NUUMhfeC=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/BB-1T83Z.jpg)
ఆర్టురో మోంటెనెగ్రో దర్శకత్వం వహించిన పనామా దేశ థ్రిల్లర్ చిత్రం ది బర్త్‌డే బాయ్ (కంప్లీనెరో) (2022). గోవాలో జరుగుతున్న 53వ 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' సందర్భంగా నిర్వహించిన ‘టేబుల్ టాక్స్’లో తన సినిమా గురించి ఆర్టురో మాంటెనెగ్రో మాట్లాడారు. ప్రపంచంలో ఆత్మహత్యల శాతం గురించి ప్రస్తావించారు. “స్నేహం గురించి చెప్పే సినిమా బర్త్‌డే బాయ్. వర్తమానం మాత్రమే మనకు ఉంది, భవిష్యత్తు గురించి చింతించవద్దు ”అని ఆర్టురో ప్రేక్షకులకు చెప్పారు.
![](https://ci4.googleusercontent.com/proxy/b0uad-ys9KTL-3ebjEEy2c_oIqo_iJsGof9Y3sg9clwTz84pfsdYHVc1p1e3wMNx-fdqEeC7lQTtSzXfDpUgOFw8pInC7jjjE8GtUgy38XqIUapPzCSa=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/BB-2WBWF.jpg)
కథ రచయిత, నిర్మాత ఆండ్రీ జె బారియంటోస్ కూడా టేబుల్ టాక్స్‌లో పాల్గొన్నారు. “ఈ కథ గురించిన ఆలోచన మహమ్మారి కాలంలో వచ్చింది. మరణం గురించి ఇందులో ఎక్కువగా చెప్పాం" అని వెల్లడించారు. ఈ చిత్ర కథానాయకుడికి అమియోట్రోఫిక్ లాటరల్ స్ల్కెరోసిస్ (ఏఎల్‌ఎస్) వ్యాధి ఉంటుంది. "ఏఎల్‌ఎస్ గురించి గతంలో చెప్పని విషయాలను ఈ చిత్రంలో చూపించాం" అని దర్శకుడు తెలిపారు. ఈ వ్యాధి గురించి మాట్లాడుతూ, “తన భావాలను బయటకు వెల్లడించలేకపోవడం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, నిరుత్సాహపరుస్తుంది” అన్నారు.
![](https://ci5.googleusercontent.com/proxy/Aipg8YCi6EK7xZaclDg141NIbd6kiTiBstynY6OR_0pFUTlvGpPct_LOqBnt1Vj6mRTo2gW290DMlCaaa_bo-V31205U9mn4nZyK2an2nnxy7e5ET4wS=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/BB-3L6HT.jpg)
ఈ సినిమా ఈ ఏడాది అకాడమీ పురస్కారం పోటీదారుగా నిలిచింది. “దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా అందమైన విషయం. జాతీయ జెండాను మోస్తున్నట్లు అనిపిస్తుంది" అని ఆర్టురో మోంటెనెగ్రో వ్యాఖ్యానించారు. “బర్త్‌డే బాయ్ ఒక జీవిత వేడుక. ఇది వ్యక్తిగత భావాలకు సంబంధించింది. పుట్టుక, మరణం వంటి వాటి గురించి మాట్లాడుతుంది. ఇది జీవితచక్రాన్ని వివరిస్తుంది” అని దర్శకుడు తెలిపారు.
* * *
(Release ID: 1879025)
Visitor Counter : 156