సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
53వ ఐఎఫ్ఎఫ్ఐ సినిమా ఆఫ్ వరల్డ్ విభాగంలో బంగ్లాదేశ్ సినిమా 'ఏ హౌస్ విత్ నో నేమ్' ప్రదర్శన ఈ రోజుల్లో కథే సినిమాలో నిజమైన హీరో: నటి నుస్రత్ ఫరియా
కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రేక్షకుల దృక్పధంలో మార్పు వచ్చిందని దీనిని దృష్టిలో వుంచుకొని సినిమాలు తీయాల్సి ఉంటుందని ప్రముఖ ప్రముఖ బెంగాలీ నటి నుస్రత్ ఫరియా అన్నారు. నుస్రత్ ఫరియా ముఖ్య పాత్రలో నటించిన బెంగాలీ సినిమా 'ఏ హౌస్ విత్ నో నేమ్' ను 53వ ఐఎఫ్ఎఫ్ఐ సినిమా ఆఫ్ వరల్డ్ విభాగంలో ఈరోజు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పీఐబీ ఏర్పాటు చేసిన 'సైడ్ టాక్స్' కార్యక్రమంలో 'ఏ హౌస్ విత్ నో నేమ్' చిత్ర బృందం, నటీనటులు పాల్గొన్నారు. దీనిలో మాట్లాడిన నటి నుస్రత్ ఫరియా “ చిత్ర నిర్మాణ సమయంలో ప్రేక్షకులను గుర్తుంచుకోవాలి.ఇదివరకు మహిళ ప్రధాన పాత్ర పోషించిన చిత్రాన్ని ఎక్కువ ధర చెల్లించి టిక్కెట్టు కొనడానికి ఇష్టపడేవారు కాదు. అయితే, మహమ్మారి తర్వాత ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. వారి ఆలోచన మారింది. సినిమా కథకు ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారు" అని అన్నారు.
'ఏ హౌస్ విత్ నో నేమ్' చిత్ర వివరాలు, దీనిలో నటించడానికి అంగీకరించడానికి వెనుక ఉన్న కారణాలను నుస్రత్ ఫరియా వివరించారు. “నేను గత 7 సంవత్సరాలుగా పాటలు మరియు నృత్యాలు మరియు రొమాన్స్‌తో కూడిన కమర్షియల్ సినిమాలు చేశాను. నా షెడ్యూల్ నన్ను కుటుంబానికి దూరంగా ఉంచింది. మహమ్మారి సమయంలో, చాలా సంవత్సరాల తర్వాత, నేను నా కుటుంబం తో 60 రోజులు గడిపాను. ఆ సమయంలో అబు (షాహెద్ ఎమోన్, నిర్మాత) నాకు సినిమా వివరాలు అందించారు. అది నాకు మా అమ్మతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసింది. సినిమాలో నటించడానికి నేను వెంటనే అంగీకరించాను" అని నుస్రత్ ఫరియా తెలిపారు. 'ఏ హౌస్ విత్ నో నేమ్' సినిమా చిత్ర నిర్మాణం రెండు కోవిడ్ దశల మధ్య జరిగింది.
”ఎ హౌస్ విత్ నో నేమ్ ”లో చిత్రంలో ఫరియా తల్లిగా బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ నటి అఫ్సానా మిమీ నటించారు. ఈ పాత్ర తనకు సవాలుగా అనిపించింది అని అఫ్సానా మిమీ అన్నారు. 18 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చి ఈ సినిమాలో ప్రధాన పోషించిన అఫ్సానా మిమీ “ఈ సినిమాలో నా పాత్ర సంఘర్షణతో కూడి ఉంది. ఒక వైపు గర్భస్రావాలు చేసే తల్లి మరోవైపు ఆమె తన కూతురితో సమయం గడపాలని కోరుకుంటుంది." అని అఫ్సానా మిమీ వివరించారు. బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ నటితో కలిసి పని చేయడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదని ఫరియా తెలిపింది.
”ఎ హౌస్ విత్ నో నేమ్ ”చిత్రంలో ఫారియా తన స్వగ్రామానికి తిరిగి వచ్చి కుటుంబం గత రహస్యాలు తెలుసుకున్న పాత్రలో ఫరియా నటించింది చిత్ర జీవితం, నిజ జీవితాలకు మధ్య ఉన్న తేడా గురించి మాట్లాడిన ఫరియా “నేను పని చేయడం ప్రారంభించినప్పుడు మా కుటుంబం నుంచి పెద్దగా లభించలేదు. ఇక్కడికి సొంతంగా రావాల్సి వచ్చింది. పురుషాధిక్య పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. పరిశ్రమలో అభిరుచి మాత్రమే నిలబెడుతుంది. వారి అనుభవాలు భిన్నంగా ఉండవచ్చు. చిత్రంలో నా పాత్ర కూడా అదే మార్గంలో నడుస్తుంది. ఆమె స్వశక్తితో పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. నేను కూడా అంతేపరిశ్రమలో నా 7 సంవత్సరాలు గడిపాను." అని తెలిపారు.
'సంక్లిష్టమైన మరియు అందమైన తల్లీ కూతుళ్ల కథ' గా ”ఎ హౌస్ విత్ నో నేమ్ ” ను నిర్మాత అబూ షాహెద్ ఎమోన్ అభివర్ణించారు. పరిశ్రమలో వస్తున్న మార్పులపై కూడా చర్చ జరిగింది. దీనిపై మాట్లాడిన అఫ్సానా మిమీ "ఇప్పుడు యువ ప్రతిభకు మరియు కొత్త ఆలోచనలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంత అవకాశం లభిస్తుందని ముందు నేను నేను ఊహించలేను." అని అన్నారు. బంగ్లాదేశ్ చలనచిత్ర పరిశ్రమలో మహిళల ప్రాధాన్యత గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మిమీ మహిళల పాత్రలు ఎల్లప్పుడూ ఉన్నాయి, అయితే మహిళా దర్శకుల సంఖ్య తక్కువగా ఉందని తెలిపారు.
***
(Release ID: 1879024)
Visitor Counter : 180