వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రెసిషన్ ఫార్మింగ్ డెవలప్‌మెంట్ సెంటర్ (పిఎఫ్‌డిసి), ఆర్‌కెవివై- ఆర్ఎఎఫ్‌టిఎఎఆర్ ఆగ్రిస్టార్టప్ అగ్రి బిజినెస్ ఇన్ క్యుబేటర్ (ఆర్-ఎబిఐ), ఇంటిగ్రేటెడ్ బీకీపింగ్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఐబిడిసి)ను సందర్శించిన కేంద్ర వ్యవసాయ & రైతాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలాష్ లిఖి
Posted On:
23 NOV 2022 3:32PM by PIB Hyderabad
సూక్ష్మ వ్యవసాయ & ఉద్యానవన కృషి జాతీయ కమిటీ (ఎన్‌సిపిఎహెచ్) కింద సృష్టించిన సూక్ష్మ వ్యవసాయ అభివృద్ధి కేంద్రం వద్ద రైతులతో జాతీయ కమిటీ ఖచ్చితమైన & ఉద్యానకృషి & రైతాంగ సంక్షేమం (వ్యవసాయ & రైతాంగ సంక్షేమ విభాగం) అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి సంభాషించారు. తమిళనాడు విశ్వవిద్యాలయం (టిఎన్ఎయు), కోయంబత్తూర్ లోని ఇంటిగ్రేటెడ్ బీకీపింగ్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఐబిడిసి), వ్యవసాయ స్టార్టప్ అయిన వ్యవసాయ వాణిజ్య (అగ్రిబిజినెస్) ఇన్‌క్యుబేటర్ (ఆర్-ఎబిఐ), ఆర్‌కెవివై - ఆర్ఎఎఫ్‌టిఎఎఆర్‌ను కూడా ఆయన సందర్శించారు.
ప్రాంతీయంగా భిన్నమైన సాంకేతికతలను సూక్ష్మ నీటిపారుదల వంటి సూక్ష్మ వ్యవసాయ పద్ధతులను, అత్యాధునిక వ్యవసాయం (వర్టికల్ ఫార్మింగ్ - నిలువుగా వరుసల్లో పంట వేసే పద్ధతి, మట్టిలేకుండా మొక్కలను పెంచే పద్ధతైన మైడ్రోపోనిక్స్, తేమలో మొక్కలను పెంచే పద్ధతైన ఎయిరోపోనిక్స్, రక్షణ సాగు, ప్లాస్టిక్‌ను ఉపయోగించి చేసే ప్లాస్టికల్చర్) వంటివాటిని అభివృద్ధి పరిచి, విస్తరింపచేయడం ద్వారా యూనిట్‌కు ఉత్పత్తిని, ఉత్పాదకతను గరిష్టం చేయడం ద్వారా రైతులు, చిట్టచివరి వినియోగదారుల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే లక్ష్యంతో దేశంలోని అన్ని వ్యవసాయ వాతావరణ మండలాల్లో 22 ప్రెసిషన్ ఫార్మింగ్ డెవలప్‌మెంట్ సెంటర్లు (పిఎఫ్‌డిసిలు - సూక్ష్మ వ్యవసాయ అభివృద్ధి కేంద్రాలు)ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ 22 పిఎఫ్‌డిసిలు కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లడాఖ్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఝార్‌ఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, అస్సాంలో గల రాష్ట్ర/ కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు (ఎస్ఎయులు), ఐసిఎఆర్ సంస్థలు , ఐఐటిలలో ఉన్నాయి.
డాక్టర్ లిఖి కోయంబత్తూర్‌లోని టిఎన్ఎయులో గల ప్రెసిషన్ ఫార్మింగ్ డెవలప్‌మెంట్ సెంటర్ (పిఎఫ్‌డిసి)ని సందర్శించారు. కీలక రంగాలైన బిందు సేద్యం, ప్లాస్టిక్ మల్చింగ్ (నీటిని కాపడుతూ కలుపును నిరోధించేందుకు ప్లాస్టిక్ వినియోగం), చెరువుల లైనింగ్, గ్రీన్‌హౌజ్, క్లాడింగ్ మెటీరియల్ (ఆచ్ఛాదనగా గడ్డి, గోధుమ ఫైబర్లను వినియోగించి చేసే మెటీరియల్), పిచకారీ సేద్యం (స్ప్రింక్లర్ ఇర్రిగషన్) వంటి ముఖ్యమైన రంగాలలో పరిశోధనలు చేయడం పిఎఫ్‌డిసి కోయంబత్తూర్ ప్రధాన విజయాలు. వాటితో పాటుగా, బిందు సేద్యం,ఫెర్టిగేషన్ (పంటకు, నేలకు మేలు చేసే పదార్ధాలను నీటి సరఫరాలో కలపడం),ప్లాస్టిక్ మల్చింగ్, పాలీహౌజ్ (వృక్షసంరక్షణశాల), డ్రిప్ ఆటోమేషన్ (స్వయంచాలక యంత్రవిధానంతో బిందుసేద్యం), జిఐఎస్, మట్టిలేని మార్గాల ద్వారా సాగు వంటి వివిధ సాంకేతికతలపై కూడా పరిశోధనలను నిర్వహించారు. వేరుశనగ, పసుపు, టమేటో, మిర్చి, బొప్పాయ, పూల పంటలు, దోసకాయ, కొబ్బరి, పత్తి, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్, కందులు, ఆముదం, కాప్సికమ్, కేబేజీ, వంకాయ, కాకరకాయ, బెండకాయ, అరటి, తోటకూర వంటి పంటలపై కూడా ఈ సాంకేతికతలను ఉపయోగించి పరిశోధనలను నిర్వహించారు.
డాక్టర్ లేఖి టిఎన్ఎయులో గల ఆర్‌కెవివై-ఆర్ఎఎఫ్‌టిఎఎఆర్ ఆగ్రిబిజినెస్ ఇన్‌క్యుబేటర్ (ఆర్-ఎబిఐ)ను సందర్శించారు. ఈ ఇన్‌క్యుబేషన్ కేంద్రం వ్యవసాయ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుంది. డిఎ&ఎఫ్‌డబ్ల్యు (వ్యవసాయ& రైతాంగ సంక్షేమ విభాగం) దేశవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఐదుగురు నాలెడ్జ్ పార్ట్నర్లనే (కెపి) కాక, 24 ఆర్‌కెవివై-ఆర్ఎఎఫ్‌టిఎఎఆర్ ఆగ్రిబిజినెస్ ఇన్‌క్యుబేటర్లను (ఆర్-ఎబిఐలను) నియమించింది. ఇందులో కోయంబత్తూరులోని టిఎన్ఎయులో గల టెక్నాలజీ బిజినెస్ ఇన్‌క్యుబేటర్ (టిబిఐ) ఒకటి.
ఈ ఐదుగురు నాలెడ్జ్ పార్ట్నర్లను అమలులో తోడ్పడేందుకు, పథకాన్ని నిరాటంకంగా, సమర్ధవంతంగా అమలు చేయడంలో సలహాలను ఇచ్చేందుకు, తొలిసారి ప్రయత్నం చేస్తున్న ఆర్-ఎబిఐలకు సహాయ సహకారాలు, వ్యవసాయ - స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు ఉత్తమ ఆచరణ పద్ధతులను ప్రదర్శించేందుకు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అమలు చేయడం, తదితరాల కోసం నియమించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐదు నాలెడ్జ్ పార్ట్నర్లు - ఎ) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (ఎంఎఎన్ఎజిఇ), హైదరాబాద్, (బి) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (ఎన్ఐఎఎం), జైపూర్, (సి) ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఎఆర్ఐ), పూసా, న్యూఢిల్లీ, (డి) యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్, ధార్వాడ్, కర్ణాటక, (ఇ) అస్సాం అగ్రికల్చర్ యూనివర్సిటీ, జోర్హాట్, అస్సాం.
నేటి వరకూ, 1055 అగ్రి స్టార్టప్‌లు ఆర్ధిక సంవత్సరం 2019-22 నుంచి 2022-23 కాలంలో భిన్న నాలెడ్జ్ పార్ట్నర్లు, డిఎ&ఎఫ్‌డబ్ల్యుకి చెందిన ఆగ్రి బిజినెస్ ఇన్‌క్యుబేటర్లు ఎంపిక చేసి, రూ. 10932. 24 లక్షలను ఆర్ధిక సహాయం మంజూరు చేయాల్సిందిగా సూచించాయి. ఇటీవలే పిఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళనంలో ఆగ్రి-స్టార్టప్ సదస్సును గౌరవ ప్రధానమంత్రి న్యూఢిల్లీ, పూసాలోని ఎఐఆర్ఐలో ప్రారంభించారు. ఇందులో 300 ఆగ్రిస్టార్టప్‌లు తమ ఆవిష్కరణలను ప్రదర్శించాయి.
కోయంబత్తూరులోని టిబిఐ, టిఎన్ఎయు కింద అగ్రిప్రెన్యూర్‌షిప్ ఓరియంటేషన్ ప్రోగ్రాం (ఎఒపి - వ్యవసాయ వ్యవస్థపకత పునశ్చరణ కార్యక్రమం)న్ని & స్టార్టప్ ఇన్ క్యుబేషన్ ప్రోగ్రాం(ఎస్ఎఐపి) మూడు బ్యాచ్‌లను విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో 300 స్టార్టప్‌లకు శిక్షణనివ్వగా, 41 స్టార్టప్‌లకు రూ. 3.87 కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందించారు.
అంతిమంగా, ఆయన 2017-18లో టిఎన్ఎయులో స్థాపించిన న్ఇంటిగ్రేటెడ్ బీకీపింగ్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడిబిసి- సమగ్ర తేనెటీగల పెంపక అభివృద్ధి కేంద్రం)ను సందర్శించారు. ఐబిడిసి కింద సృష్టించిన సైకర్యాలతో టిఎన్ఎయు రైతులకు శిక్షణను నిర్వహిస్తోంది. గత నాలుగేళ్ళలో దాదాపు 3000 రైతులకు శిక్షణనిచ్చారు. పిసిఆర్‌తో , సెంటర్‌ఫ్యూజ్, జెల్ డాక్యుమెంటేషన్, ఇతర పరికరాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల నడుస్తోంది. దానితో పాటుగా తేనె శుద్ధి యూనిట్ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇక్కడ వారు తమ తేనెతో పాటు రైతుల నుంచి వచ్చిన తేనెను కూడా శుద్ధి చేస్తారు. టిఎన్ఎయు క్యాంపస్‌లోను, తేనెటీగల గూళ్ళల్లోనూ భారతీయ తేనెటీగకు (అపిస్ కెరానా ఇండికా) సంబంధించిన 150 తేనెతుట్టెలు , అపిస్ మెలిఫెరావి 20 తుట్టెలు, కొండిలేని తేనెటీగలకు సంబంధించి 40 తేనెతుట్టెలు ఉన్నాయి. సమగ్ర తేనెటీగలపెంపక అభివృద్ధి కేంద్రం (ఐబిడిసి)ని ఏర్పాటు చేసేందుకు 2017-18లో కోయంబత్తూర్‌లోని తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ (టిఎన్ఎయు)కు రూ. 138.28 లక్షలను మంజూరు చేశారు.
రైతులు, తేనెటీగల పెంపకందార్లు, ఆగ్రి- ఎంటర్‌ప్రెన్యూర్లు, విద్యార్ధులతో మాట్లాడుతూ, చిన్న, సన్నకారు రైతులలో వ్యవసాయ సాంకేతికతలు, తత్సంబంధిత ఆవిష్కరణలను గరిష్టంగా వ్యాప్తి చేసేందుకు అందరు భాగస్వాములూ విస్త్రతమైన ఎక్స్‌టెన్షన్ కృష్టిని చేయాల్సి ఉందని డాక్టర్ లిఖి ఉద్ఘాటించారు.
***
(Release ID: 1878299)
Visitor Counter : 138