రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

న‌వంబ‌ర్ 23 - 25 వ‌ర‌కు ఇండోప‌సిఫిక్ రీజిన‌ల్ డైలాగ్ 2022 (ఐపిఆర్‌డి)

Posted On: 22 NOV 2022 4:47PM by PIB Hyderabad

భార‌తీయ నావికాద‌ళ‌పు అగ్రస్థాయి అంత‌ర్జాతీయ స‌ద‌స్సు అయిన ఐపిఆర్‌డి, వ్యూహాత్మ‌క స్థాయిలో నావికాద‌ళ‌పు కార్య‌క‌లాపాల ప్ర‌ధాన అభివ్య‌క్తి కూడా. ఈ కార్య‌క్ర‌మం ప్ర‌తి ఎడిష‌న్‌ను నావికాద‌ళ‌పు విజ్ఞాన భాగ‌స్వామి  అయిన నేష‌న‌ల్ మారిటైం ఫౌండేష‌న్ (ఎన్ఎంఎఫ్‌) ప్ర‌ధాన నిర్వాహ‌క సంస్థ‌. ప్రాంతీయ స‌ముద్ర సంబంధ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌ల‌ను, ఆలోచ‌న‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ఐపిఆర్‌డి ప్ర‌య‌త్నిస్తుంది.ట్రాక్ 1.5 కార్య‌క్ర‌మం కావ‌డంతో  ప్ర‌భుత్వ విధానం (ప‌బ్లిక్ పాల‌సీ)పై చ‌ర్చ‌ల‌ను ప్రోత్స‌హించే ల‌క్ష్యంతోనే కాకుండా ప్ర‌భుత్వ‌, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, ఏజెన్సీల మ‌ధ్య స‌మ‌తుల్య ప్రాతినిధ్యం కోసం ఐపిఆర్‌డి ప్ర‌య‌త్నిస్తుంది. ఐపిఆర్‌డి తొలి రెండు ఎడిష‌న్లు వ‌రుస‌గా 2018, 2019లో న్యూఢిల్లీలో నిర్వ‌హించారు. కాగా, ఐపిఆర్‌డి 2020ని కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ర‌ద్దు చేశారు. మూడ‌వ ఐపిఆర్‌డి ఎడిష‌న్‌ను 2021లో ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించారు. విజ‌య‌వంత‌మైన ప్ర‌తి  ఐపిఆర్‌డి ఎడిష‌న్ ల‌క్ష్యం ఇండో- ప‌సిఫిక్ ప్రాంతంలో త‌లెత్తే అవ‌కాశాల‌ను, స‌వాళ్ళు రెండింటినీ స‌మీక్షించ‌డం. ఈ వార్షిక సంవాదం ద్వారా ఇండో-ప‌సిఫిక్ ప్రాంతంలోని స‌ముద్ర రంగాన్ని ప్ర‌భావితం చేస్తున్న భౌగోళిక రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు సంబంధించిన సునిశిత చ‌ర్చ‌ల‌కు భార‌తీయ నావికాద‌ళం, ఎన్ఎంఎఫ్‌, వేదిక‌ను అందించ‌డాన్ని కొన‌సాగిస్తోంది. 
ఐపిఆర్‌డి నాలుగ‌వ ఎడిష‌న్‌ను 23 నుంచి 25 న‌వంబ‌ర్ 2022 నిర్వ‌హించ‌నున్నారు. గౌర‌వ ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ 04 న‌వంబ‌ర్  2019న‌ బ్యాంగ్‌కాక్ లో జ‌రిగిన 14వ తూర్పు ఆసియా శిఖ‌రాగ్ర స‌మావేశంలో వ్య‌క్తీక‌రించిన భావ‌న‌ ఆప‌రేష‌న‌లైజింగ్ ఇండో- పిసిఫిక్ ఓష‌న్స్ ఇనిషియేటివ్ (ఐపిఒఐ - హింద‌రూ, ప‌సిఫిక్ స‌ముద్రాల చొర‌వ‌ను అమ‌లు చేయ‌డం)   ఐపిఆర్‌డి -2022 ఇతివృత్తం. ఒక‌దానితో ఒక‌టి అనుసంధాన‌మైన ఏడు స్తంబాల‌పై దృష్టితో ప్రాంతీయ స‌హ‌కారం కోసం క‌లుపుకుపోయే స‌మ‌గ్ర నిర్మాణం ఐపిఒఐ. అవి - స‌ముద్ర భ‌ద్ర‌త‌, స‌ముద్ర జీవావ‌ర‌ణం, స‌ముద్ర వ‌న‌రులు, విప‌త్తు సంభావ్య‌త/ గండం - త‌గ్గింపు, నిర్వ‌హ‌ణ‌, వాణిజ్య సంధాయ‌క‌త‌, స‌మ‌ద్ర ర‌వాణా, సామ‌ర్ధ్య నిర్మాణం, వ‌న‌రుల భాగ‌స్వామ్యం, శాస్త్ర సాంకేతిక‌త‌, విద్యాప‌ర‌మైన స‌హ‌కారం. 
ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌ స‌ముద్ర భ‌ద్ర‌తా ఏజెన్సీగా ఉన్న భార‌తీయ నావికాద‌ళం ఐపిఒఐకి చెందిన ఈ ఏడు స్తంభాల‌ను వాస్త‌వీక‌రించ‌డంలో త‌న శ‌క్తిసామ‌ర్ధ్యాల‌తో లోతుగా నిమ‌గ్న‌మైఉంది. 
ఇండోప‌సిఫిక్ రీజిన‌ల్ డైలాగ్ (ఐపిఆర్‌డి-2022)కు చెందిన 2022 ఎడిష‌న్ ఐపిఒఐ, దాని కార్యాచ‌ర‌ణపై స‌ముచితంగా దృష్టిని కేంద్రీక‌రించ‌డ‌మే కాక‌, ప్ర‌త్యేకించి స‌ముద్రతీర‌ భ‌ద్ర‌త అంశాల‌పై కాకుండా, నిర్ధిష్టంగా దృష్టి కేంద్రీక‌రిస్తోంది.  ఐపిఆర్‌డి-2022ను 23 నుంచి 25 న‌వంబ‌ర్ 2022 వ‌ర‌కు మూడు రోజుల పాటు ఆరు వృత్తిప‌ర‌మైన సెష‌న్ల‌తో న్యూఢిల్లీలో భౌతిక ఫార్మాట్‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా, అంత‌ర్జాతీయంగా కీర్తిగ‌డించిన వ‌క్త‌లు, ప్ర‌ముఖ ప్యానెలిస్టులు, ఐపిఒఐలో భావించిన స‌ముద్ర‌తీర స‌హకారానికి సంబంధించిన అంశాల‌ను అభిల‌ష‌నీయంగా, స‌మ‌గ్రంగా అమ‌లు చేయ‌డానికి అవ‌కాశాల‌ను అన్వేషిస్తారు. ఇందుకు అద‌నంగా, ప్రారంభ సెష‌న్‌, మార్గ‌ద‌ర్శ‌న్ సెష‌న్‌లు ఉండ‌నున్నాయి. వీటిని ఉద్దేశించిర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌,  ప‌ర్యావ‌ర‌ణ మంత్రి శ్రీ భూపేంద్ర యాద‌వ్‌, ర‌క్ష‌ణ శాఖ స‌హాయ మంత్రి శ్రీ అజ‌య్ భ‌ట్ ప్ర‌సంగించ‌నున్నారు.
ఐపిఆర్‌డి -2022 ఇతివృత్తాల వారీగా ఏర్పాటు చేసిన సెష‌న్లు - 1. ఇండోప‌సిఫిక్ ప్రాతంలో సమ‌గ్ర స‌ముద్ర తీర భ‌ద్ర‌త అల్ల‌కం ః బ‌హుపాక్షిక ఎంపిక‌లు (Weaving the Fabric of Holistic Maritime Security in the Indo-Pacific: Multilateral Options), 2. ఇండోప‌సిఫిక్ ప‌శ్చిమ‌, తూర్పు స‌ముద్ర‌తీరం వ్యాప్తంగా స‌మ‌గ్ర భ‌ద్ర‌తా వంతెన‌ల నిర్మాణం ()Constructing Holistic-Security Bridges across the Western and Eastern Maritime Expanse of the Indo-Pacific) 3. స‌ముద్ర‌త తీర అనుసంధాన‌త‌ను నిర్మించ‌డంః రేవులు, వాణిజ్యం, ర‌వాణా (Building maritime Connectivity: Ports, Trade, and Transport;) 4. భౌతిక‌, సామాజిక శాస్త్రాల ఉప‌యోగించి సామ‌ర్ధ్య నిర్మాణం, స‌మ‌ర్ధ‌త‌ను పెంచ‌డం (Capacity-building and Capability Enhancement Leveraging the Physical and Social Sciences;) 5. ప్రాంతీయ నీలి ఆర్ధిక వ్య‌వ‌స్థ కోసం ఆచ‌ర‌ణాత్మ‌క విధానాలు ( Practical approaches to a Regional Blue Economy) 6.  అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప రాష్ట్రాల‌కు, దుర్బ‌ల‌మైన తీర‌ప్రాంత రాష్ట్రాల‌కు విప‌త్తుల గండం- త‌గ్గింపు నిర్వ‌హ‌ణ;  ప‌రిష్కారాలు (Disaster Risk-reduction and Management; Solutions for Small Island Developing States (SIDS) and Vulnerable Littoral States)

 

***


(Release ID: 1878093) Visitor Counter : 171


Read this release in: English , Urdu , Hindi