సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav
iffi banner

చిత్ర పరిశ్రమలో నూతన సాంకేతిక పరిజ్క్షానాన్ని ప్రదర్శించేందుకు ఎఫ్టిఐఐ చే ఫిల్మ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్

గోవాలో 2022 నవంబర్ 20 నుం 28 వరకు నిర్వహిస్తున్న భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) 2022
ఈ సంవత్సరం చిత్ర పరిశ్రమ అభిమానులకు కొత్త , ఆసక్తి దాయక అనుభూతిని కల్పించనుంది. ఈ చలనచిత్రోత్సవం సందర్భంగా
చిత్ర కళ, సినిమా టెక్నాలజీ, ఫిల్మ్ ఆర్ట్కు సంబంధించి వివిధ అంశాలు, సినిమా, సృజనాత్మకత వంటి అంశాలపై
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక ప్రదర్శనను నిర్వహించనుంది. ఇఫి 2022లో భాగంగా దీనిని
నిర్వహిస్తున్నారు.

––ఫిల్మ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఇఫి , గోవా 2022
––ఫిల్మ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ చలనచిత్ర పరిశ్రమ , చలనచిత్ర కళ, సినిమా వివిధ విభాగాలకు చెందిన ఆధునిక సాంకేతికను ప్రదర్శిస్తుంది.
––ఈ ఎగ్జిబిషన్ పనాజీలో డిబి రోడ్లోని ఫుట్ బాల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు . ఇది కళా అకాడమీ పక్కన ఉంది. ఈ ఎగ్జిబిషన్ నవంబర్ 21 నుంచి 27 వరకు ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది.
––ఈ ఎగ్జిబిషన్ లో 20 స్టాల్స్ను  వివిధ సైజులలో  , మొత్తం 7000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశార.
––సినిమా పరికరాల తయారీదారులైన సోనీ, కానన్, రెడ, లీకా, అల్టాస్, డిజెడ్ఒ, అపుట్చూర్ లైట్స్, హన్స సినీ ఎక్విప్మెంట్ తదితర సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.

‌‌‌‌53 వ ఇఫి ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తోంది. ఫిల్మ్ రంగంలోని వారు ఈ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తున్నారు.చిత్రకళ కు  సంబంధించిన వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను ఒకచోట చేర్చి ప్రదర్శనకు పెడుతున్నారు. ఇది సందర్శకులకు గొప్ప అనుభూతిని కలిగించనుంది.  ఈ ఎగ్జిబిషన్ను పనాజీలో కళా అకాడమీ పక్కన డిబిరోడ్ లో గల ఫుట్బాల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు. 2022 నవంబర్ 21 నుంచి 27 వరకు ఉదయం 11 గంటలనుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ తెరిచి ఉంటుంది.

సినిమా పరికరాల తయారీ రంగానికి సంబంధింఇన సోనీ, కనాన్, రెడ్, లీకా, అల్టాస్, డిజెడ్ ఒ, అపుట్చురాలైట్స్, హన్సా సినీ ఎక్విప్మెంట్ తదితర సంస్థలు ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నాయి. ఈ ఎగ్జిబిషన్ సమకాలీన సినిమా ప్రొడక్షన్లో పరిశ్రమ నిపుణులు వాడే వివిధ రకాల అత్యాధునిక పరికరాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తారు. ఈ ఎగ్జబిషన్లో ఇలాంటి 20 టెక్ కంపెనీలు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.కెమెరాలు, లెన్సులు, లైట్లు, గ్రిప్స్, కలర్ గ్రేడింగ్ సాఫ్ట్వేర్, యానిమేషన్, విఎఫ్ఎక్స్, ఎఆర్, విఆర్, ఆడియో మానిటర్లు, అకాస్టిక్స్, రియల్ టైమ్డబ్బింగ్, టాక్బాక్లు, సినిమాలను భద్రపరచడం, పాతవాటిని తిరిగి పునరుద్ధరించడం వంటి వాటికి సంబంధించిన
సాంకేతిక పరిజ్ఞానాలు ఇక్కడ ప్రదర్శిస్తారు.7000 చదరపు మీటర్లలో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ స్టాల్స్ తో పాటు ఎగ్జిబిషన్ ప్రాంగణంలో సినీ సాంకేతిక పరిజ్ఞానంపై చర్చలు, వివిధ సెషన్ల నిర్వహణకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

***

iffi reel

(Release ID: 1877812) Visitor Counter : 200