సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇఫ్ఫి-53కి హాజరైన వారందరికీ ఈ వేడుక ఒక చిరస్మరణీయ అనుభవంగా గుర్తుంటుందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ విశ్వాసం వ్యక్తం చేశారు
"ఈ సంవత్సరం భారతీయ, అంతర్జాతీయ విభాగాల్లో రికార్డు సంఖ్యలో చిత్రాలు వచ్చాయి, ఈ వేడుకకు పెరుగుతున్న ప్రపంచ ప్రజాదరణకు ఇది ఉదాహరణ"
గోవాలో రేపు (నవంబర్ 20, 2022) ఇఫ్ఫి (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) 53వ వేడుకలు ప్రారంభం కానున్న సందర్భంగా అతిథులు, ప్రతినిధులకు కేంద్ర సమాచార & ప్రసారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ హృదయపూర్వక స్వాగతం పలికారు.
సినిమాల నాణ్యత, సంఖ్యలో ఇఫ్ఫి ఏటా అభివృద్ధి చెందుతోందని, ఇది చాలా ఆనందంగా ఉందని మంత్రి చెప్పారు. "ఈ సంవత్సరం భారతీయ, అంతర్జాతీయ విభాగాల్లో రికార్డు సంఖ్యలో చిత్రాల నమోదు జరిగింది. ఈ వేడుకకు పెరుగుతున్న ప్రపంచ ప్రజాదరణకు ఇది ఉదాహరణ" అన్నారు.
ప్రస్తుత, ఔత్సాహిక చిత్ర ప్రేమికుల కోసం దేశం, ఇతివృత్తాలు, సామాజిక విభాగాల వారీగా చలనచిత్రాల అద్భుత ప్యాకేజీని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. "నిపుణుల అనుభవాలు, కార్యశాలలతో ఒక విజ్ఞాన వేదికను కూడా ఈ ఉత్సవం అందిస్తుంది".
ఇఫ్ఫి-53కు హాజరైన వారందరికీ ఈ వేడుక ఒక చిరస్మరణీయ అనుభవంగా గుర్తుంటుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
![](https://ci3.googleusercontent.com/proxy/jJB979OU_Z8IdSYhH7XTvOQd7ORvTB1STeXJm5iX-MRhTriPuT1Jhnrs77Pkkfvv-5zaLIqCGXdBvttFH-fH9x_3Tt2arPx_cPBl0BinLvLgw2QLe6LonIF_hA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/MinisterRYMC.jpg)
* * *
(Release ID: 1877402)
Visitor Counter : 173