ఆయుష్
5వ ప్రకృతి వైద్య దినోత్సవాన్ని భవిష్యత్తు ఆధారిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థగా దేశవ్యాప్తంగా జరుపుకున్నారు
"ప్రకృతి భగవంతుని రూపం, దానిలో ఉన్న శక్తి, సామర్థ్యం మరియు సంపదను మనం అర్థం చేసుకోవాలి" - శ్రీ సర్బానంద సోనోవాల్
Posted On:
18 NOV 2022 6:50PM by PIB Hyderabad
“ప్రకృతి భగవంతుని స్వరూపం, దానిలో ఉన్న శక్తి, సామర్థ్యం మరియు సంపదను మనం అర్థం చేసుకోవాలి కానీ కొన్నిసార్లు మనం ఈ విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వము. ప్రకృతిని మనం జాగ్రత్తగా చూసుకుంటే, అది మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది" అని 5వ నేచురోపతి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఆయుష్ మంత్రిత్వ శాఖ మద్దతుతో ఇంటర్నేషనల్ నేచురోపతి ఆర్గనైజేషన్ (ఐఎన్‌ఓ), సూర్య ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ చెప్పారు. సభకు ముందు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా వీడియో సందేశాన్ని కూడా ప్లే చేశారు.
పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురోపతిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రకృతి వైద్య దినోత్సవాన్ని నేచురోపతి: యాన్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనే థీమ్‌తో జరుపుకున్నారు. తద్వారా దేశవ్యాప్తంగా ప్రకృతివైద్యంతో రోగి ఆధారిత చికిత్స విధానం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేశారు.
పూణేలోని ఎన్‌ఐఎన్‌లో ఏర్పాటు చేసిన ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయుష్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీమతి కవితా గార్గ్, సీసీఆర్‌వైఎన్ డైరెక్టర్ డాక్టర్ రాఘవేంద్రరావు, ఎన్ఐఎన్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ కె. సత్య లక్ష్మి, పోస్ట్ డైరెక్టర్ శ్రీ రామచంద్ర గజ్‌భయ పాల్గొన్నారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీమతి కవితా గార్గ్ మాట్లాడుతూ "ప్రస్తుత కాలంలో ప్రకృతి వైద్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. దైనందిన జీవితంలో ప్రకృతివైద్యం సూత్రాలను పాటించాలని ఆమె సలహా ఇచ్చారు. అలాగే నేచురోపతి స్టార్టప్‌లు మరియు యునికార్న్‌లకు మార్గం సుగమం చేసే ప్రయత్నాలను భాగస్వాములందరూ సినర్జిక్ పద్ధతిలో చేపట్టాలని అన్నారు.
ఈ సందర్భంగా 5వ ప్రకృతి వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కవర్ కవరును విడుదల చేశారు. న్యూఢిల్లీ, వార్ధా, హైదరాబాద్‌ల నుంచి పుణెలో సమావేశమైన సైకిల్ ర్యాలీలో పాల్గొన్న వారికి గాంధీ జ్ఞాపికను అందజేశారు. స్టార్టప్ యోగా ఛాలెంజ్ విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో 25కి పైగా కళాశాలల విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు. మల్లఖాంభ సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
నేచర్ క్యూర్ ఫౌండేషన్ ట్రస్ట్‌లో మహాత్మాగాంధీ జీవితకాల సభ్యునిగా ఉండి, దస్తావేజుపై సంతకం చేసిన రోజున నవంబర్ 18న భారతదేశంలో 2018 నుండి ప్రతి సంవత్సరం ప్రకృతి వైద్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. గాంధీజీ భారతదేశంలో ప్రకృతివైద్యం యొక్క స్థాపక వ్యక్తిగా పరిగణించబడతారు. ఎందుకంటే ఆయన ప్రయత్నాల ద్వారా ఈ అభ్యాసం భారతదేశంలో ప్రాచుర్యం పొందింది.
***
(Release ID: 1877266)
Visitor Counter : 163