పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
జనజాతీయ గౌరవ్ దివస్ పురస్కరించుకొని పిఈఎస్ఏ నిబంధనలను నోటిఫై చేసిన మధ్యప్రదేశ్
అటవీ ప్రాంతాల్లో అన్ని సహజ వనరులకు సంబంధించి నియమ నిబంధనల పై గ్రామ సభలకు నిర్ణయాధికారం
మధ్యప్రదేశ్ లోని అయిదవ షెడ్యూల్ ప్రాంతాల్లో పిఈఎస్ఈ చట్టం అమలు
Posted On:
17 NOV 2022 7:30PM by PIB Hyderabad
15 నవంబర్ 2022న జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా మధ్యప్రదేశ్ పిఈఎస్ఏ నిబంధనలను నోటిఫై చేసింది. మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి జనజాతీయ గౌరవ్ దివస్ సమ్మేళన్‌లో, మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్ పంచాయితీలు ( షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు} చట్టం ( పిఈఎస్ఏ చట్టం) మాన్యువల్ మొదటి కాపీని భారత రాష్ట్రపతి శ్రీమతి. ద్రౌపది ముర్ముకి అందజేశారు.
మధ్యప్రదేశ్‌లో ఇప్పుడు అమలులో ఉన్న పిఈఎస్ఏ చట్టం, అటవీ ప్రాంతాల్లోని అన్ని సహజ వనరులకు సంబంధించి నియమాలు, నిబంధనలపై నిర్ణయం తీసుకునేందుకు గ్రామసభలకు అధికారం ఇస్తుంది. పిఈఎస్ఏ చట్టం గిరిజన ప్రజలు నివసించే అటవీ ప్రాంతాల నుండి సహజ వనరుల వల్ల కలిగే ప్రయోజనాలను పొందేందుకు మరిన్ని రాజ్యాంగ హక్కులను ఇస్తుంది.
"మధ్యప్రదేశ్‌లోని షెడ్యూల్డ్ ప్రాంతాల కోసం రూపొందించిన కొత్త పిఈఎస్ఏ నియమాలు గిరిజన వర్గాల జీవితాలను బలోపేతం చేయడంలో, గిరిజనులకు వారి హక్కులను కల్పించడంలో ప్రభావవంతంగా ఉంటాయి" అని భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము. అన్నారు.
సమ్మేళన్‌కు హాజరైన వారిలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా, కేంద్ర గ్రామీణాభివృద్ధి & ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే, ఇతర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గిరిజనులు ఉన్నారు. జనజాతీయ గౌరవ్ దివస్‌ను జరుపుకోవడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి మహిళలు, యువతతో సహా సంఘం ప్రతినిధులు, స్థానిక పౌరులు హాజరయ్యారు.
పిఈఎస్ఏని సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో, పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ 2009లో డ్రాఫ్ట్ మోడల్ పిఈఎస్ఏ నియమాలను విడుదల చేసింది. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ఎనిమిది రాష్ట్రాల నిరంతర సమాలోచనల ఆధారంగా; ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ తమ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం తమ రాష్ట్ర పిఈఎస్ఏ నిబంధనలను నోటిఫై చేశాయి. ఇటీవల, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వారి పిఈఎస్ఏ నిబంధనలను 8 ఆగస్టు 2022న నోటిఫై చేసింది. జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లో శాఖల మధ్య సంప్రదింపుల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
రాజస్థాన్ మినహా రాష్ట్రాలు పిఈఎస్ఏ 1996 నిబంధనలను తమ తమ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాలలో పొందుపరిచాయి. పదవ రాష్ట్రం, రాజస్థాన్, "రాజస్థాన్ పంచాయితీ రాజ్ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు వారి దరఖాస్తులో నిబంధనల సవరణ) చట్టం 1999" నోటిఫై చేసింది.
ప్రస్తుతం, 10 రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణలు తమ తమ రాష్ట్రాల్లో ఐదవ షెడ్యూల్ ప్రాంతాలను కలిగి ఉన్నాయి.
నేపథ్యం:
ఐదవ షెడ్యూల్ ప్రాంతాలలో నివసించే ప్రజలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి, పార్లమెంటు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ఎం(4)(బి)) ప్రకారం, "పంచాయతీల నిబంధనల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం, 1996" (పిఈఎస్ఈ)ని రూపొందించింది. రాజ్యాంగంలోని IX భాగాన్ని పంచాయితీలకు సంబంధించి, ఐదవ షెడ్యూల్ ప్రాంతాలకు, కొన్ని మార్పులు మరియు మినహాయింపులతో విస్తరించడం. ఐదవ షెడ్యూల్ ప్రాంతాలను కలిగి ఉన్న రాష్ట్రాలు, ఈ ప్రాంతాల కోసం పంచాయతీ చట్టాలను రూపొందించడానికి అధికారం పొందాయి.
"పంచాయతీల నిబంధనలు (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు), చట్టం 1996" ( పిఈఎస్ఈ ), ఐదవ షెడ్యూల్‌లోని పంచాయితీలకు సంబంధించిన రాజ్యాంగంలోని 9వ భాగం నిబంధనల పొడిగింపుకు సంబంధించిన అన్ని చట్టాలను రూపొందించడానికి రాష్ట్ర శాసనసభలకు అధికారం ఇవ్వబడింది. చట్టంలోని సెక్షన్ 4లో అందించబడిన మినహాయింపులు సవరణలకు లోబడి.
పిఈఎస్ఈ అనేది పంచాయితీలకు సంబంధించిన రాజ్యాంగంలోని 9 లోని పార్ట్‌లోని నిబంధనలను షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగించడానికి కల్పించే చట్టం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 244లోని క్లాజ్ (1)లో సూచించిన షెడ్యూల్డ్ ప్రాంతాలు. పది పిఈఎస్ఈ రాష్ట్రాలలో, ఎనిమిది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ తమ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం తమ రాష్ట్ర పిఈఎస్ఈ నియమాలను రూపొందించి నోటిఫై చేశాయి.
75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశాన్ని పురస్కరించుకుని, పంచాయతీల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం, 1996 ( పిఈఎస్ఈ) అమలులోకి వచ్చిన 25వ సంవత్సరాన్ని పురస్కరించుకుని, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ సహకారంతో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ , ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 18 నవంబర్, 2021న న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో పంచాయితీల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం 1996 ( పిఈఎస్ఈ )పై ఒక రోజు జాతీయ సదస్సును నిర్వహించింది. చట్టం అమలులో రాష్ట్రాల పురోగతిని అంచనా వేయడంతోపాటు దాని ప్రభావంపై భాగస్వామ్య దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో జాతీయ సదస్సును నిర్వహించింది. షెడ్యూల్డ్ ప్రాంతాలలో పిఈఎస్ఈ ని సమర్థవంతంగా అమలు చేయడంలో సవాళ్లు, అంతరాలను పరిష్కరించడానికి ఒక మార్గాన్ని కూడా నిర్దేశించింది.
***
(Release ID: 1876945)
Visitor Counter : 272