శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐక్యరాజ్యసమితి - ఎస్కేప్ కు చెందిన డి ఎస్ ఐ ఆర్ , సి ఎస్ ఐ ఆర్,


ఎ పి సి టి టి సంయుక్త ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని సి ఎస్ ఐ ఆర్ సైన్స్ సెంటర్ లో "క్రాస్ బోర్డర్ ఇన్నోవేషన్, యాక్సిలరేషన్ ఛాలెంజెస్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ ఫర్ ఆఫ్ టెక్నాలజీస్" అనే అంశంపై రెండు రోజులపాటు ఇంటర్నేషనల్ నాలెడ్జ్ షేరింగ్ వర్క్ షాప్

Posted On: 16 NOV 2022 3:04PM by PIB Hyderabad

"క్రాస్ బోర్డర్ ఇన్నోవేషన్, యాక్సిలరేషన్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ ఫర్ ఆఫ్ టెక్నాలజీస్" అనే అంశంపై అంతర్జాతీయ నాలెడ్జ్ షేరింగ్ వర్క్ షాప్ 2022 నవంబర్ 14 నుంచి 15 వరకు న్యూఢిల్లీలోని సి ఎస్ ఐ ఆర్ సైన్స్ సెంటర్ లో హైబ్రిడ్ మోడ్ లో  జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా ,

అండ్ పసిఫిక్ ఏషియన్ అండ్ పసిఫిక్ (యు ఎన్ - ఇ ఎస్ సి ఎ పి ) కి చెందిన

ఆసియన్ అండ్ ఫసిఫిక్ సెంటర్ ఫర్ ట్రాన్స్ ఫర్ ఆఫ్ టెక్నాలజీ (ఎ పి ఎస్ సి టి టి) సహకారంతో డిపార్ట్ మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (డి ఎస్ ఐ ఆర్), మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) సంయుక్త ఆధ్వర్యంలో ఈ వర్క్ షాప్ ను నిర్వహించారు..  సి ఎస్ ఐ ఆర్ -హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ సెంటర్ (సి ఎస్ ఐ ఆర్- హెచ్ ఆర్ డి సి) సమన్వయం ఈకార్యక్రమాన్ని సమన్వయం చేసింది. ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్న 350 మందిలో బంగ్లాదేశ్, కంబోడియా, ఇరాన్ (ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్), ఇండోనేషియా, జోర్డాన్, లెబనాన్, మలేషియా, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, శ్రీలంక, థాయ్ లాండ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఉజ్బెకిస్తాన్ వంటి 17 దేశాల నుండి 36 మంది అంతర్జాతీయ భాగస్వాములుగా ఉన్నారు. సుమారు 70 మంది భౌతికంగా

పాల్గొన్నారు.

 

ప్యానలిస్టులు ఎఫ్ఏవో, ఐఎల్ఆర్ఐ, ఐఎస్ఏ, డీడబ్ల్యూఐహెచ్, యూకేఆర్ఐ, ఆర్ఐఎస్ వంటి అంతర్జాతీయ సంస్థలు; సిఎస్ఐఆర్- ఎన్ బి ఆర్ ఐ , ఐఐటిడి, ఎస్ పిఎమ్ వివి, సిఎస్ఐఆర్-ఎన్ సిఎల్, వెంచర్ సెంటర్ వంటి భారతీయ జాతీయ సంస్థలు; పి ఎస్ ఎ ఆఫీసు, ఎం ఓ ఇ ఇన్నోవేషన్ సెల్ వంటి ప్రభుత్వ శాఖలు, ఎన్ ఆర్ డి సి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఇంటర్నేషనల్ ట్రాక్టర్లు, ఐఓసిఎల్, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, అంకుర్ సీడ్స్ , మహికో ప్రయివేట్ లిమిటెడ్ వంటి ఎక్స్ లెన్స్ పరిశ్రమలు; రీసెర్చ్ పార్కులు, ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్ ల ప్యానలిస్తులు, సభ్య దేశాల  ప్రతినిధులు , ఎన్ ఐ టి , అరుణాచల్ ప్రదేశ్, జి ఎస్ బి టి ఎం , సి ఎస్ ఐ ఆర్ - ఎన్ ఇ ఐ ఎస్ టి , సి ఎస్ ఐ ఆర్ -సి ఎస్ ఐ ఆర్, సి టి ఎ ఇ, ఉదయపూర్, సి ఎస్ ఐ ఆర్ - ఎన్ ఎ ఎల్ ,ఇగ్నో, శివ్ నాడార్ విశ్వ విద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఐఐటిడి, ఐఐటి మండి, ఐఐటి రూర్కీ, ఐఐటి ఇండోర్, అనేక ఇంక్యుబేషన్ హబ్ లు, డి ఎస్ ఐఆర్ , సిఎస్ ఐఆర్ ప్రధాన కార్యాలయం , సిఎస్ఐఆర్-ఐ ఐ పి , సిఎస్ఐఆర్-ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ , ఎన్ ఆర్ డి సి, ఎ పి సి టి టి వంటి జాతీయ సంస్థలప్రతినిధులు పాల్గొన్నారు.

 

 ప్రతినిధులు పాల్గొన్నారు.

 

సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (డిఎస్ఐఆర్) కార్యదర్శి డాక్టర్ ఎన్ కలైసెల్వి , కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్ ఈ వర్క్ షాప్ ను ఆన్ లైన్ లో ప్రారంభించారు. ప్రారంభోపన్యాసం చేస్తూ, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, క్రాస్ బోర్డర్ ఇన్నోవేషన్ ప్రాముఖ్యత గురించి , సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో,  వాటిని పరిశ్రమలకు బదిలీ చేయడంలో సిఎస్ఐఆర్ సమిష్టి కృషి గురించి ఆమె వివరించారు. అంతిమంగా సమాజానికి చేరుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని ఆమె సలహా ఇచ్చారు. ఎస్ డిజి 2 ఎస్ డిజి 7 , ఎస్ డిజి 9 కింద లక్ష్యాలను సాధించడానికి రోడ్ మ్యాప్ గురించి చర్చించడానికి ఆవిష్కర్తలు, పరిశ్రమ, పరిశోధన , అభివృద్ధి ప్రయోగశాలలు, అకాడెమియా, ఎంఎస్ ఎమ్ ఈ, స్టార్టప్ లు, పెద్ద పరిశ్రమలు, ఇంక్యుబేషన్ సెంటర్లు, విధాన రూపకర్తలు , ఇతర భాగస్వాములను ఈ వర్క్ షాప్ ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకు వచ్చిందని ఆమె అభినందించారు.

 

డాక్టర్ పర్వీందర్ మైనీ, సైంటిఫిక్ సెక్రటరీ, ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, భారత ప్రభుత్వం; డిఎస్ఐఆర్ సంయుక్త కార్యదర్శి శ్రీ సురీందర్ పాల్ సింగ్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్, డిఎఎడి రీజనల్ ఆఫీస్ , డిడబ్ల్యుఐహెచ్, న్యూ ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ కట్జా లాన్స్, శ్రీమతి రెబెక్కా ఫెయిర్ బైర్న్, సైన్స్ అండ్ ఇన్నోవేషన్ హెడ్, యుకె రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ (యుకెఆర్ఐ), యుకె ప్రభుత్వం, డాక్టర్ హబీబర్ రెహమాన్, ఇంటర్నేషనల్ లైవ్ స్టాక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఎల్ఆర్ఐ) రీజనల్ రిప్రజెంటివ్, దక్షిణాసియా, తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జమున దువ్వూరు, న్యూఢిల్లీ లోని ఇండియా అండ్ సైన్స్ డిప్లొమసీ ఫెలో, రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ (ఆర్ఐఎస్) డాక్టర్ భాస్కర్ బాలకృష్ణన్,  ఎపిసిటిటి-ఎస్కేప్ అధిపతి డాక్టర్ ప్రీతి సోని, సి ఎస్ ఐ ఆర్-ఇంటర్నేషనల్ ఎస్ అండ్ టి అఫైర్స్ డైరెక్టరేట్ (ఐఎస్ టిఎడి) అధిపతి డాక్టర్ రామ స్వామి బన్సాల్, సిఎస్ఐఆర్-హెచ్ ఆర్ డి సి అధిపతి డాక్టర్ ఆర్ కె సిన్హా వ్యక్తిగతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

వర్క్ షాప్ ప్రారంభ సెషన్

 

" నష్టానికి, వైఫల్యానికి గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ మనుగడ, పోటీతత్వం , మార్కెట్ శక్తిని పెంచడానికి సృజనాత్మకత అవసరం‘‘ అని డాక్టర్ పర్విందర్ మైనీ నొక్కి చెప్పారు. భారతదేశ విధానం యొక్క అవలోకనాన్ని ఇచ్చింది మరియు కొన్ని దృష్టి రంగాలు అంటే పరిశ్రమ నుండి పరిశోధన , అభివృద్ధి వ్యయంపెంపు, ; పరిశోధన , అభివృద్ధిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డిఐ); పరిశోధన - అభివృద్ధి ఎగుమతుల్లో పెరుగుదల; సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ద్వారా ఆర్ అండ్ డి; కొన్ని ఆర్ అండ్ డిలో ఖర్చు చేయడం కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మార్గదర్శకాలు, టెక్నాలజీ బదిలీ ,స్టార్టప్ ఎకోసిస్టమ్ ని పెంపొందించడం కోసం భారత దేశ విధానం, దృష్టి పెట్టవలసిన కొన్ని రంగాలు గురించి ఆమె వివరించారు.

 

డిఎస్ఐఆర్ సంయుక్త కార్యదర్శి శ్రీ సురీందర్ పాల్ సింగ్ మాట్లాడుతూ,

ఈ వర్క్‌షాప్ భారతదేశంతో సహా ఎపిసిటిటి సభ్య దేశాలకు తమ అవసరాలను పంచుకోవడానికి , సరిహద్దుల మధ్య ఆవిష్కరణలపై అవకాశాలను, అంతర్జాతీయ సహకారాన్ని వేగవంతం చేయడానికి , అంతర్జాతీయ టెక్నాలజీ బదిలీలో సవాళ్లను గుర్తించడానికి బలమైన వేదికను అందిస్తుందని అన్నారు.

 

డా. కట్జా లాస్చ్, శ్రీమతి రెబెక్కా ఫెయిర్‌బైర్న్ , డాక్టర్ హబీబర్ రెహమాన్ మాట్లాడుతూ, క్రాస్-బోర్డర్ ఇన్నోవేషన్ యాక్సిలరేషన్‌ను వేగవంతం చేయడానికి మరింత ఫలవంతమైన సహకారాన్ని ఆకాంక్షించారు. ప్రొఫెసర్ జమున దువ్వూరు మాట్లాడుతూ, ప్రభుత్వ నూతన విద్యా విధానం భారతదేశంలో మరింత ఆవిష్కరణలు , వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఒక ప్రభావవంతమైన అడుగు అని అన్నారు.

 

ఈ అంతర్జాతీయ వర్క్ షాప్ ను ఆవిష్కర్తల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి , భారతదేశ ఆవిష్కర్తలు , ఏ పి సి సి టి సభ్య దేశాల మధ్య అనుభవం , మంచి అభ్యాసాల నుండి క్రాస్ లెర్నింగ్ ద్వారా ప్రాంతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి, క్రాస్-బోర్డర్ టెక్నాలజీ బదిలీ కోసం సంభావ్య సహకార అవకాశాలు , వ్యూహాలను గుర్తించడానికి ఉద్దేశించారు. ఇది ఆసియా-పసిఫిక్ రీజియన్ లో సృజనాత్మకత, బదిలీ , సాంకేతిక పరిజ్ఞానాల వ్యాప్తి కి సంబంధించిన సవాళ్లు, యంత్రాంగాలు , మంచి విధానాలపై విజ్ఞానం , అవగాహనను పెంచింది; సరిహద్దుల వెంబడి బదిలీ , సాంకేతిక పరిజ్ఞానాల వ్యాప్తి కోసం ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇది వినూత్న వ్యూహాలు , పద్ధతులను అన్వేషించింది;

సృజనాత్మకత , సాంకేతిక పరిజ్ఞాన బదిలీ కోసం ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి కీలకమైన సవాళ్లను పరిష్కరించడంపై వర్క్ షాప్ ప్యానెలిస్టులు సిఫారసులు చేశారు.

 

ఎస్ డి జి 2 (జీరో హంగర్), ఎస్ డి జి 7 (చౌకఅయిన, , పరిశుభ్రమైన ఇంధనం), ఎస్ డి జి 9 (ఇండస్ట్రీ-ఇన్నోవేషన్ -ఇన్ ఫ్రాస్ట్రక్చర్) లలో లక్ష్యాలను సాధించడం కోసం సవాళ్లను గుర్తించడం ఈ వర్క్ షాప్ లక్ష్యం. సెషన్ కింద, "ఎస్ డి జి కు మద్దతు ఇవ్వడానికి వాతావరణ- స్థితిస్థాపక వ్యవసాయం,  పశుసంవర్ధకం

కోసం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు", ఉత్పాదక వ్యవసాయం,  పశుసంవర్ధక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ( ఐ ఒ టి ), రోబోటిక్స్, డ్రోన్లు, ఎనర్జీ స్థితిస్థాపక సంరక్షణ , మెరుగైన ఎంపిక కోసం ఇంధన స్థితిస్థాపక సంరక్షణ , బయోటెక్నాలజీ, దిగుబడి మెరుగుదల, వ్యాధి నిరోధకత, ఖచ్చితమైన వ్యవసాయం, ఖచ్చితమైన పోషక పంపిణీలు,  సృజనాత్మకత , విధాన దృక్పథాల పై చర్చిం చారు. సి ఎస్ ఐ ఆర్ - ఐ ఎస్ టి ఎ డి ప్రిన్సిపల్ సైంటిస్ట్, డాక్టర్ ఆనంద్ మోహిత్ చర్చను సమన్వయ పరిచారు. స్మార్ట్ , శీతోష్ణస్థితిని తట్టుకునే వ్యవసాయం, ఉత్పాదక వ్యవసాయం కోసం పంట సాగు సాంకేతికత, ఖచ్చితమైన వ్యవసాయం, ఖచ్చితమైన పోషకాహార పంపిణీ, పశుపోషణ , సృజనాత్మకత - గ్లోబల్,  భారతదేశ దృక్పథాల పై నిర్మాణాత్మక చర్చ జరిగింది.

 

ఈ సెషన్ లో భాగంగా, “ఎస్ డి జి 7కు మద్దతు ఇవ్వడానికి ఇంధనం లో ఆకుపచ్చ , తక్కువ కార్బన్ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు", మెటీరియల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, ప్రొడక్షన్ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ స్టోరేజీ l,  ప్రత్యామ్నాయ ఎనర్జీ కోసం మేనేజ్ మెంట్ (సోలార్, ఆఫ్ షోర్, విండ్ మొదలైనవి), గ్రీన్ హైడ్రోజన్, కార్బన్-నెగటివ్ టెక్నాలజీలు, ఓషన్ బయోమాస్, బయోఫ్యూయల్, 5 జి ఆధారిత స్మార్ట్ గ్రిడ్ లు, క్లైమేట్ ప్రొటెక్షన్, సస్టెయినబిలిటీ మొదలైన వాటిపై చర్చించారు.

 

ఎనర్జీ సెక్టార్ లో గ్రీన్ అండ్ తక్కువ కార్బన్ టెక్నాలజీలకు సంబంధించిన వివిధ సవాళ్లు, పరిశోధన , అభివృద్ధి ,ఇన్నోవేషన్ ,పాలసీ సమస్యలు; గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి , స్టోరేజీ , హైడ్రోజన్ ని రవాణా ఇంధనంగా ఉపయోగించడం,

శిలాజ ఇంధనాలు, స్మార్ట్ గ్రిడ్ లు, ఇంధన శక్తి సమర్థత కోసం విద్యుత్ రంగంలో ఐ ఒ టి , ఎం ఎల్ , సి పి ఎస్ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో హైడ్రోజన్ మిశ్రమం, గ్రీన్ ఎనర్జీ , సుస్థిరత; పునరుత్పాదక శక్తిని చొప్పించడానికి వివిధ కంట్రోలర్ ల (ఎసి-డిసి అండ్ డిసి-డిసి) అభివృద్ధి , ఇప్పటికే ఉన్న గ్రిడ్ లను స్థితిస్థాపకంగా మార్చడానికి సంబంధించిన సమస్యలు మొదలైన అంశాలు కూడా చర్చకు వచ్చాయి.

 

సెషన్ కింద, "ఎస్ డి జి 9 కు మద్దతు ఇవ్వడానికి సృజనాత్మకత, టెక్నాలజీ ప్రమోషన్ , వాణిజ్యీకరణలో ప్రక్రియ , కీలక అడ్డంకులు", అవకాశాలు, సవాళ్లు దేశాలు ఏ విధంగా టెక్నాలజీ ఫార్ములేషన్ అన్వయ చక్రాలను వేగవంతం చేయగలవనే దానిపై మార్గదర్శకత్వం గురించి చర్చలు జరిగాయి. భారతదేశం, జర్మనీ, యుకె ల్లోనూ, ఏ పి సి సి టి సభ్య దేశాల్లోనూ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, అవకాశాలు, సవాళ్ల కు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.

 

చివరగా, "టెక్నో-కమర్షియల్ వాల్యూ అసెస్ మెంట్, టెక్నో-ఎకనామిక్స్, మార్కెటబిలిటీ, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ స్థోమత" పై ప్యానెల్ డిస్కషన్ లు జరిగాయి. కంబోడియా, నేపాల్, ఉజ్బెకిస్థాన్, థాయ్ లాండ్, ఇండియా వంటి దేశాలకు చెందిన వివిధ ఆవిష్కర్తలు తమ స్టార్టప్ ల గురించి కేస్ స్టడీస్ గా చర్చించారు. పూణేలోని ఎకోజెన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కో ఫౌండర్,  చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీ వివేక్ పాండే, కాన్పూర్ లోని ఇ-స్పిన్ నానోటెక్ ప్రయివేట్ లిమిటెడ్,  ఇండీమా ఫైబర్స్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ పాటిల్, డిఎస్ఐఆర్ స్కీం, టెప్ , ప్రిస్మ్ ల నుండి గ్రాడ్యుయేట్ అయిన విజయవంతమైన స్టార్టప్ లు, ప్యానెల్ డిస్కషన్ సందర్భంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.

 

డి.ఎస్.ఐ.ఆర్. కార్యదర్శి , సి.ఎస్.ఐ.ఆర్ భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. కలైసెల్వి ముగింపు ఉపన్యాసం చేశారు. క్రాస్ బోర్డర్ టెక్నాలజీ బదిలీ,  సాధ్యమైన సిఫార్సుల క్లిష్టమైన సవాళ్లపై వర్క్‌షాప్ ఫలితాలను ఆమె సమీక్షించారు. సమీప భవిష్యత్తులో విజయవంతమైన సాంకేతిక బదిలీలు/స్టార్ట్-అప్‌లను వర్క్‌షాప్ ఫలితంగా ఆకాంక్షించారు.

 

వర్క్ షాప్ మొదటి, రెండు రోజులలో చర్చలు

 

ఏ పి సి టి టి- యు ఎన్ ఇ ఎస్ సి ఎ పి హెడ్ డాక్టర్ ప్రీతి సోని , డిఎస్ఐఆర్ , యు ఎన్ ఇ ఎస్ సి ఇ పి -ఎపిసిటిటి కి చెందిన నేషనల్ ఫోకల్ పాయింట్ (ఇండియా) డిఎస్ఐఆర్ మరియు నేషనల్ ఫోకల్ పాయింట్ (ఇండియా) శాస్త్రవేత్త డాక్టర్ రామానుజ్ బెనర్జీ

ముగింపు వ్యాఖ్యలు,  చర్చలపై వివరణతో కార్యక్రమం ముగిసింది. తరువాత సి ఎస్ ఐ ఆర్ - హెచ్ ఆర్ డి సి ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వినయ్ కుమార్ వందన సమర్పణ చేస్తూ హాజరైన భారతదేశం , ఏ పి సి సి టి సభ్య దేశాల ప్రముఖులు, ప్యానెలిస్ట్‌లు, వక్తలు, ఇతరులకు స్పీకర్లు ధన్యవాదాలు తెలిపారు.

                                                                                           

<><><><><><>


(Release ID: 1876631) Visitor Counter : 265


Read this release in: Urdu , English , Hindi