జల శక్తి మంత్రిత్వ శాఖ
భారతదేశ జియోస్పేషియల్ ఆర్థిక వ్యవస్థ 2025 చివరి నాటికి 61,000 కోట్ల రూపాయలకు చేరుతుంది... కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
హైదరాబాద్‌లో ప్రారంభమైన జియో స్మార్ట్ ఇండియా 2022 మూడు రోజుల సదస్సు
సదస్సుకు హాజరైన ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 2500 మంది ప్రతినిధులు
Posted On:
15 NOV 2022 5:43PM by PIB Hyderabad
సాంకేతిక రంగంలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో పెద్దసంఖ్యలో అంకుర సంస్థలు (స్టార్టప్‌లు) ఏర్పాటవుతున్నాయని శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. దేశంలో దాదాపు 250 జియోస్పేషియల్ స్టార్టప్‌లు ఉన్నాయని, ఇవి ఆవిష్కరణ స్ఫూర్తికి నిదర్శనమని శ్రీ షెకావత్ అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమైన 3 రోజుల (15-17 నవంబర్ 2022)జియో స్మార్ట్ ఇండియా 2022 సదస్సులో కేంద్ర మంత్రి కీలకోపన్యాసం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ షెకావత్ ప్రసంగిస్తూ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, అటవీ, జలవనరుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక రంగాల్లో వివిధ జియోస్పేషియల్ ప్రాజెక్టులు ప్రయోగాత్మకంగా అమలు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. దేశంలో ఏర్పాటైన అంకుర సంస్థల సంఖ్య యువత సామర్థ్యం సాధించిన అభివృద్ధిని తెలియజేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన రెండవ ఐక్యరాజ్యసమితి వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (యుఎన్‌డబ్ల్యుజిఐసి) ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని శ్రీ షెకావత్ గుర్తు చేశారు. అట్టడుగున ఉన్న వారికి ప్రయోజనం కలిగించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను శ్రీ షెకావత్ గుర్తు చేశారు.
సాంకేతిక రంగంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది: కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్:
ప్రజలకు నీరు జీవనాధారం గా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జల సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి అనేక చర్యలు తీసుకుందని శ్రీ షెకావత్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రజలకు ప్రయోజనం కలిగించే అంశానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గతంలో జలవనరుల అంశం తొమ్మిది మంత్రిత్వ శాఖల పర్యవేక్షణలో ఉండేవని శ్రీ షేకావత్ తెలిపారు. జల సంబంధిత అంశాలను సమర్థంగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం జలవనరులను జల్ శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోకి తెచ్చిందని వివరించారు. గంగా మరియు దాని ఉపనదులు పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన కార్యక్రమంగా ‘నమామి గంగే’ పథకం అమలు చేస్తున్నదని శ్రీ షెకావత్ వివరించారు. దీనికి అదనంగా,జలశక్తి మంత్రిత్వ శాఖ జలవనరుల శాఖ, జల వనరుల అభివృద్ధి శాఖ సహకారంతో ‘నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్’ (NHP)ని కూడా చేపట్టిందని మంత్రి తెలిపారు.నీటి వనరుల నిర్వహణ కోసం కార్యక్రమాలు అమలు చేస్తున్న అన్ని విభాగాలకు ప్రణాళిక మరియు సమర్ధ భూ జలవనరుల సమాచారం, సమాచార వ్యవస్థ అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి వివరించారు.
‘నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్’ అమలు కోసం ఇస్రో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) ప్రధాన ఏజెన్సీలుగా పనిచేస్తాయని శ్రీ షెకావత్ తెలిపారు.నీటి వనరుల రంగంలో జియోస్పేషియల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించడాన్ని అనేక కార్యకలాపాలు చేపట్టామని తెలిపారు.IoT సాంకేతికతలు జీపీఎస్ అనుబంధ కమ్యూనికేషన్ పరిజ్ఞానంతో కలిసి అమలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టులు దేశం సమగ్ర అభివృద్ధికి భౌగోళిక మరియు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఉపకరిస్తాయని వివరించారు.
గ్రామీణ మరియు పట్టణ అభివృద్ధి మరియు ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ ప్రమాణాలు కలిగి ఉన్న సమగ్ర జాతీయ అభివృద్ధికి సహకరించే జియోస్పేషియల్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలకు పరిశ్రమ మరియు విద్యాసంస్థలు సహకరించాలని మంత్రి సూచించారు.
జియోస్పేషియల్ అర్థ, జియోస్పేషియల్ స్ట్రాటజీ ఫర్ నేషనల్ డెవలప్‌మెంట్ అనే రెండు నివేదికలను జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఐఎస్ఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ ప్రకాష్ చౌహాన్, ఐఎస్జీ కార్యదర్శి డాక్టర్ రాజ్ కుమార్, భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ రవిచంద్రన్మి సమక్షంలో విడుదల చేశారు. భారత జియోస్పేషియల్ పరిశ్రమ సేవలు అందించే రంగంగా కాకుండా పరిష్కారాల పరిశ్రమగా అభివృద్ధి చెందుతుందని నివేదికలు ప్రముఖంగా పేర్కొన్నాయి. రక్షణ, నిఘా, సేవలు, పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, భూ నిర్వహణ రంగాల్లో మార్కెట్ అభివృద్ధి సాధించేందుకు జియోస్పేషియల్ రంగం దోహదపడుతుందని భారతదేశం జియోస్పేషియల్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం దాదాపు 41600 కోట్ల రూపాయల వరకు ఉంది. ఈ రంగం 5,45,000 మందికి ఉపాధి కల్పిస్తోంది, 2025 చివరి నాటికి జియోస్పేషియల్ రంగం 61,000 కోట్ల రూపాయల మార్కెట్ గా ఎదుగుతుందని జియో స్మార్ట్ ఇండియా 2022 సదస్సులో విడుదల చేసిన జియోస్పేషియల్ స్ట్రాటజీ ఫర్ నేషనల్ డెవలప్‌మెంట్ నివేదిక పేర్కొంది.
జియో స్పేషియల్ అర్థ, జియోస్పేషియల్ జాతీయ అభివృద్ధికి వ్యూహం
సమస్యల పరిష్కారం, బహుళ ఆధారిత పరిష్కార మార్గాలను అమలు చేయడానికి అనుసరించవలసిన కార్యక్రమాన్ని రూపొందించడానికి జియో స్మార్ట్ ఇండియా మరియు ISRS/ISG జాతీయ సదస్సులు సంయుక్తంగా నిర్వహించబడుతున్నాయి. సామాజిక-ఆర్థిక సవాళ్లను చర్చల ద్వారా పరిష్కరించడం, ప్రభుత్వం, మ్యాప్ సంస్థలు , పరిశోధకులు, విద్యావేత్తలు మరియు ప్రైవేట్ పరిశ్రమలు మరియు ప్రాదేశిక సమాచారం, వినియోగదారుల సమాచారంతో కూడిన జియోస్పేషియల్ వ్యవస్థను అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవడం, ప్రగతిశీల విధాన మార్పులు అమలు చేయడం తదితర అంశాలు సదస్సులో చర్చకు రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జియోస్పేషియల్ రంగానికి చెందిన వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, విద్యా రంగాలకు 2500 మంది ప్రతినిధులు 3 రోజుల (15-17 నవంబర్ 2022) 'జియో స్మార్ట్ ఇండియా 2022' సదస్సులో పాల్గొంటారు. సింపోజియం ఉద్దేశ్యం రిమోట్ సెన్సింగ్, GIS నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు మరియు విద్యార్థులను ఒక వేదిక పైకి తీసుకువచ్చి సమస్యలు మరియు సవాళ్లపై చర్చలు జరిపి పరిష్కార మార్గాలు అందించడం లక్ష్యంగా సదస్సులను నిర్వహిస్తున్నారు.
(Release ID: 1876293)
Visitor Counter : 145