వ్యవసాయ మంత్రిత్వ శాఖ
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ కృషి విజ్ఞాన కేంద్రాల 29వ ప్రాంతీయ కార్యశాలను ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
प्रविष्टि तिथि:
12 NOV 2022 8:51PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకేలు) 29వ ప్రాంతీయ కార్యశాలను మధ్యప్రదేశ్‌లోని మొరేనాలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ తోమర్ మాట్లాడారు. వ్యవసాయ రంగం వస్తృతమైనది, సవాళ్లతో కూడుకున్నదని, ముంగిపు లేనిదని, తరతరాల పాటు కొనసాగుతుందని చెప్పారు. దేశ వ్యవసాయం అభివృద్ధి కోసం అన్ని కేవీకేలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అసాధారణ సహకారం అందిస్తున్నారంటూ అభినందించారు.
ప్రజలు వ్యవసాయం వైపు అడుగు వేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని, ఇందుకోసం అందరితో పాటు శాస్త్రవేత్తలు, రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించిందని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశ వ్యవసాయ భూమి సారవంతమైనదని, భారతదేశం ఒక వ్యవసాయ దేశం. ఆహార ఉత్పత్తి పరంగా మనది ప్రత్యేక స్థానమని వివరించారు. రైతుల ప్రయోజనాలపై మాట్లాడుతూ, ఇప్పుడు రైతులకు పూర్తి అవగాహన ఉందన్నారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరిస్తూ, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు వరం వంటిదని, ప్రతి రైతూ దానిని సద్వినియోగం చేసుకోవాలని తోమర్ సూచించారు. గత ఆరేళ్లలో, ఈ పథకం కింద రైతులకు రూ.1.24 లక్షల కోట్ల పరిహారం అందించారు.

వ్యవసాయ రంగంలో ఎదరయ్యే అనేక సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం మన వ్యవసాయ శాస్త్రవేత్తల బాధ్యత అని శ్రీ తోమర్ చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌లో జరుగుతున్న అభివృద్ధిని గమనించిన ప్రపంచ దేశాలు, వ్యవసాయ ఆహారానికి సంబంధించిన అంశాలపై భారత్‌తో చర్చిస్తున్నాయని వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తి, ఆహార శుద్ధిలో మన దేశం ప్రపంచంలోనే నాయకత్వ స్థానంలో ఉందని, నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉందని కేంద్ర మంత్రి వివరించారు.
చిత్రకూట్‌లో ఉన్న దీనదయాళ్ పరిశోధన సంస్థ నిర్వాహక మంత్రి శ్రీ అభయ్ మహాజన్, గ్వాలియర్‌లోని ఆర్‌వీఎస్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ ఎస్‌కే రావు, ఝాన్సీలోని ఆర్‌ఎల్‌బీకే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ ఏకే సింగ్, ఇక్రా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (వ్యవసాయ విస్తరణ) డాక్టర్ వీపీ చాహల్, తదితరులు కూడా ఈ సందర్భంగా ప్రసంగించారు. డా. వైపీ సింగ్, డా.డీపీ శర్మ, డా.అజయ్ వర్మ, డా.ఎస్‌ఎస్ తోమర్ సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని 81 కేవీకేల సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
****
(रिलीज़ आईडी: 1875644)
आगंतुक पटल : 166