ఉక్కు మంత్రిత్వ శాఖ

ఆర్ఐఎన్ఎల్ లో విజిలెన్సు అవగాహనా వారం ముగింపు ఉత్సాహంతో పూర్తి


ఆర్ఐఎన్ఎల్ నివారణ విజిలెన్స్ కార్యక్రమాలను ప్రశంసించిన సీవీసీ అదనపు సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ కుమారి సింగ్,

Posted On: 05 NOV 2022 6:50PM by PIB Hyderabad
ఆర్‌ఐఎన్‌ఎల్‌లో నిర్వహించిన విజిలెన్స్ అవేర్‌నెస్ వారోత్సవాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఈరోజు ముగిశాయి. ఈ సమావేశంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అదనపు కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమారి సింగ్ అవినీతిని ఎదుర్కోవడానికి బహుముఖ వ్యూహం అనే అంశంపై ప్రసంగించారు.
 

డాక్టర్ ప్రవీణ్ కుమారి సింగ్ పలు అంశాలపై చర్చించారు. ఆమె  ఆర్‌ఐఎన్‌ఎల్‌, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, హరిత పర్యావరణం, ఉన్నత జీవన ప్రమాణాలు, సమర్థవంతమైన శ్రామిక శక్తి, సాంకేతిక పురోగమనం మౌలిక సదుపాయాల కోసం గణనీయమైన నిరంతర ప్రయత్నాలకు ఆమె ప్రశంసించారు. వివిధ విజిలెన్స్ కార్యకలాపాలు, సీవీసీ  అంచనాలు, శిక్షాత్మక-నివారణ విజిలెన్స్, దేశంలోని యువ ఉద్యోగుల బాధ్యతలు, సామర్థ్యాలు, అభివృద్ధి-అవినీతి, నైతికత, అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మించడంలో సుపరిపాలన గురించి ఆమె వివరించారు.

 

ఆర్‌ఐఎన్‌ఎల్ సీఎండీ శ్రీ అతుల్ భట్ ప్రసంగిస్తూ కార్పొరేట్ మేనేజ్‌మెంట్‌లో పారదర్శకతపై ప్రధానంగా ప్రస్తావించారు. డిజిటలైజేషన్ ద్వారా తమ ప్రక్రియలను మార్చుకున్నందుకు ఆర్‌ఐఎన్‌ఎల్ సమిష్టి కృషిని ప్రశంసించారు, ఇది మరింత సమర్థవంతమైన, వినియోగదారుని కేంద్రంగా పనికి దారి తీస్తుంది. ఆర్‌ఐఎన్‌ఎల్ వైజాగ్ స్టీల్‌లో ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అమలు, వినియోగం గురించ్చి అయన వివరించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశానికి అనుగుణంగా, అవినీతిని ఎదుర్కోవడానికి మా విధులకు సాంకేతికతను ఉపయోగించుకోవడాన్ని ప్రస్తావించిన ఆర్‌ఐఎన్‌ఎల్ సీఎండీ   సాంకేతికతను ఉపయోగించుకోవడానికి సరైన మార్గంలో ఉందని సూచించారు.

ఆర్‌ఐఎన్‌ఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్    శ్రీ బి విశ్వనాథ్, విజిలెన్స్ కార్యక్రమాలను ప్రశంసించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు అందించే విధానాలు, మార్గదర్శకాలను నిరంతరం నవీకరించాలని, సంస్థ ప్రక్రియలలో వాటిని స్వీకరించాలని ఆయన నొక్కిచెప్పారు. .
 

అవినీతిని అరికట్టాల్సిన  ఆవశ్యకతపై కార్యక్రమంలో ఆర్‌ఐఎన్‌ఎల్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు నీడ నాటకాన్ని ప్రదర్శించారు. .

 

ముగింపు కార్యక్రమం సందర్భంగా, ఆర్‌ఐఎన్‌ఎల్-విఎస్పి ఐటీ ఈఆర్పి విభాగాలు అభివృద్ధి చేసిన విజిలెన్స్ క్లియరెన్స్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ ఆన్‌లైన్ అప్లికేషన్‌ను అదనపు కార్యదర్శి సీవీసీ ప్రారంభించారు. ప్రక్రియకు పారదర్శకత, సామర్థ్యం, లో  ఆర్‌ఐఎన్‌ఎల్  అధికారులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సందేశాలను చదివి వినిపించారు.

 

విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్, 2022 సందర్భంగా  ఆర్‌ఐఎన్‌ఎల్-విఎస్పి  నిర్వహించిన పోటీల్లో విజేతలకు డాక్టర్ ప్రవీణ్ కుమారి సింగ్, శ్రీ అతుల్ భట్,  ఆర్‌ఐఎన్‌ఎల్ డైరెక్టర్లు బహుమతులు ప్రకటించారు.

 

*****



(Release ID: 1874045) Visitor Counter : 117


Read this release in: English , Urdu , Hindi