రక్షణ మంత్రిత్వ శాఖ
బంగాళాఖాతంలో రాయల్ ఆస్ట్రేలియన్ నావికాదళంతో ముగిసిన నావికాదళ భాగస్వామ్య విన్యాసాలు
Posted On:
05 NOV 2022 5:54PM by PIB Hyderabad
ఓడల పై హెలికాప్టర్లతో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఎఎన్) నౌకలు హెచ్ఎంఎఎస్ అడిలైడ్, హెచ్ఎంఎఎస్ అంజాక్, భారతీయ నౌకాదళ ఓడలు జలాశ్వ, కవరత్తిలతో 2 నుంచి 3 నవంబర్ 2022వరకు బంగాళాఖాతంలో నావికాదళ భాగస్వామ్య కసరత్తు/ విన్యాసాలు నిర్వహించాయి.
:ఐఎన్, ఆర్ ఎ ఎన్‌ల మధ్య ఉన్నతస్థాయి అంతర్ కార్యకలాపాలను సూచించే వ్యూహాత్మక విన్యాసాలు, హెలికాప్టర్ లాండింగ్‌లు, ఉభయచర కార్యకలాపాలతో ఈ విన్యాసాలు కూడి ఉన్నాయి.
ఆర్ ఎఎన్ నౌకలు, హెచ్ఎంఎఎస్ అడిలైడ్, హెచ్ఎంఎఎస్ అంజాక్ 30 అక్టోబర్ నుంచి 01 నవంబర్ 2022 వరకు విశాఖపట్నాన్ని సందర్శించాయి. ఇది ఆస్ట్రేలియా ప్రారంభించిన ఇండో-పసిఫిక్ ఎండీవర్ 2022 (ఐపిఇ22)లో భాగం. తూర్పు నౌకాదళ కమాండ్ ఆస్ట్రేలియా రక్షణ దళాలకు ఆతిథ్యమిచ్చింది. వివిధ సంయుక్త కార్యకలాపాలలో భారతీయ నావికాదళ తూర్పు నైకాదళంతో పాటుగా, భారతీయ సైనిక, భారతీయ వైమానికదళ సిబ్బంది కూడా పాలుపంచుకున్నారు.
హార్బర్ (రేవు) దశలో విస్త్రతమైన వృత్తిపరమైన సంభాషణలుసహా అనుభవాలు పంచుకోవడం, ఉమ్మడి ప్రణాళిక కార్యకలాపాలు, స్నేహపూర్వక క్రీడలమార్పిడి వంటివి ఉన్నాయి. భారత్-ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న సైనిక పరస్పర చర్యలలో ఈ విన్యాసాలను విజయవంతంగా పూర్తి చేయడం ఒక మైలురాయి.
***
(Release ID: 1874043)
Visitor Counter : 192