వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ప్రభుత్వంలో అపరిష్కృత సమస్యలను తగ్గించడం, స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టితో ప్రత్యేక ప్రచారం 2.0ను చేపట్టిన వ్యవసాయ పరిశోధన & విద్య విభాగం (డిఎఆర్ఇ)
సూక్ష్మజీవుల ఆధారిత వ్యవసాయ వ్యర్ధాల నిర్వహణను ప్రదర్శించేందుకు 900 గ్రామాలను దత్తత తీసుకున్నదేశంలోని కెవికెలు
Posted On:
28 OCT 2022 1:16PM by PIB Hyderabad
స్వచ్ఛత (పరిశుభ్రత), ప్రభుత్వంలో అపరిష్కృత అంశాలను తగ్గించాలన్న విషయంపై దృష్టితో 2 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్, 2022 వరకు ప్రత్యేక ప్రచారం 2.0ను భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇది సకాలంలో సూచనలను పరిష్కరించడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రమైన కార్యస్థలం ప్రాముఖ్యతను బలపరుస్తుంది.
దేశంలోని కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికె)లు సూక్ష్మజీవుల ఆధారిత వ్యవసాయ వ్యర్ధాల నిర్వహణ, వర్మి కంపోస్టింగ్ ప్రాముఖ్యతను ప్రదర్శించి, ప్రోత్సహించేందుకు 900 గ్రామాలను దత్తత తీసుకున్నాయి. వ్యవసాయ అవశేషాల సూక్ష్మజీవుల పృథక్కరణం, వ్యవసాయ అవశేషాలు, ఇతర సేంద్రీయ వ్యర్ధాలను వర్మికంపోస్ట్ గా (వానపాముల ఎరువు) మార్చడానికి సంబంధించిన సాంకేతికతలను 22,678 మంది రైతులకు ప్రదర్శించారు. రైతులతో పాటుగా, 3,000మంది పాఠశాల విద్యార్ధులకు వర్మికంపోస్టింగ్ పై అవగాహన కల్పించారు.
పంట అవశేషాలను సరైన రీతిలో పృథక్కరణం చేసిన తర్వాత ఉపయోగించినప్పుడు, భూమి, మన్ను ఆరోగ్యం, పంట ఉత్పాదకతను మెరుగుపరచడంలో సేంద్రీయ ఎరువులు విలువైన ఇన్‌పుట్‌లుగా పని చేస్తాయి. అత్యధికంగా పంట అవశేషాలు సహజసిద్ధంగా కంపోస్టింగ్ ప్రక్రియకు లోనైనప్పుడు అవి దీర్ఘకాలం తీసుకునే కారణంగా, రైతులు వాటిని తగులబెట్టడాన్ని ఆశ్రయిస్తారు, ఫలితంగా విలువైన ఆస్తి వృధా కావడమే కాక పర్యావరణం కలుషితమవుతుంది. పియుఎస్ఎ డీకంపోసర్ వంటి సమర్ధవంతమైన సూక్ష్మజీవుల డీకంపోసర్లను (పృథక్కరణానికి దోహదం చేసే) పచ్చి ఎరువుల సాంకేతికతలను పృథక్కరణ ప్రక్రియ వేగవంతం చేసిన ఫలితంగా తక్కువ వ్యవధిలో అధిక న్యాణత కలిగిన సేంద్రీయ ఎరువు లభిస్తుంది. కాల్చిన బూడిద కాకుండా పృథక్కరణం చేసిన పచ్చి ఎరువుల అవశేషాలను ఉపయోగించడం వల్ల సేంద్రీయ కార్బన్, మొక్కలకు అత్యవసరమైన పోషకాలకు మట్టికి అంది, అందులో సూక్ష్మజీవుల కార్యకలాపాలను ప్రోత్సహిస్తాయి. పంట వ్యర్ధాలు, అవశేషాలు, ఆవు పేడ, వంటింటి వ్యర్ధాల వంటి ఇతర వ్యవసాయ వ్యర్ధాలు పాక్షికంగా పృథక్కరణం చెందిన తర్వాత సమర్ధవంతమైన వానపాముల జాతులను ఉపయోగించి, దానిని వెర్మికంపోస్ట్‌గా మార్చవచ్చు. వర్మికంపోస్ట్ మొక్కలకు అవసరమైన పోషకాలను సరఫరా చేసి, ప్రయోజనకరమైన మట్టిలోని సూక్ష్మజీవులను ప్రోత్సహించి, మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, తద్వారా మెరుగైన పంట ఉత్పాదకతను,స్థిరత్వను నిర్ధారించడంలో తోడ్పడుతుంది. ఉత్పత్తి చేసిన వర్మికంపోస్ట్ మిగులను అదనపు ఆదాయం వచ్చేందుకు మార్కెటింగ్ కూడా చేయవచ్చు.
***
(Release ID: 1871765)
Visitor Counter : 212