ఆయుష్
azadi ka amrit mahotsav

కశ్మీర్ లో 'ఆయుష్ ఉత్సవ్'ను ప్రారంభించినశ్రీ శర్వానంద సోనోవాల్


కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి

సోన్ మార్గ్ లో టూరిస్టులకు అత్యవసర వైద్య సేవలను అందించే ప్రత్యేక క్లినికల్ వర్క్ షాప్ ను ప్రారంభించిన శ్రీ సోనోవాల్

Posted On: 28 OCT 2022 6:07PM by PIB Hyderabad

కేంద్ర రేవులు, నౌకాయాన, జలమార్గాలు,  ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శర్వానంద సోనోవాల్ ఈ రోజు కశ్మీర్ లోని గందర్బల్

ప్రభుత్వ యునానీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జి యు ఎమ్ సి)లో ఆయుష్ ఉత్సవ్ ను ప్రారంభించారు. ఆధునిక రోగి సంరక్షణకు అనుబంధంగా సంప్రదాయ వైద్య విధానాలను అందుబాటులోకి తేవడంపై ప్రభుత్వం దృష్టి

సారించినందున 'ఆరోగ్య సంరక్షణలో అంతరాలను పూడ్చడం: ఆయుష్, ఒక ప్రామిసింగ్ రీకోర్స్' అనే సెమినార్ ఆయుష్ ఉత్సవ్ ను కేంద్ర ఆయుష్ మంత్రి ప్రారంభించారు.

 

ఈ సదస్సు సందర్భంగా ఔషధ మూలికలు, విద్యార్థుల పోస్టర్లు, డైరెక్టరేట్ ఆఫ్ ఆయుష్ వీడియో డాక్యుమెంటరీని ప్రదర్శించారు. జమ్మూ కాశ్మీర్ లో ఆయుష్ వైద్య వ్యవస్థ సాధించిన విజయాలు, పురోగతిని వివరిస్తూ ఒక వీడియో డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు.

 

ఈ సందర్భంగా శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ, "మన సుసంపన్న మైన సంప్రదాయ ఔషధాల ప్రాముఖ్యాన్ని మానవ జీవితాల ప్ర యోజనాలకు, సుసంపన్నతకు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రధాన మంత్రి

శ్రీ నరేంద్ర మోదీ క్రియాశీల నాయకత్వంలో, ఆయుష్ ఔషధ పద్ధతులను ప్రోత్సహించడానికి , ప్రజల సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆధునిక ఔషధ చికిత్సలతో అనుబంధంగా అందించడానికి గట్టి ప్రయత్నం జరిగింది. మోదీ దార్శనికతను ముందుకు తీసుకెళ్తూ, గుజరాత్ లోని జామ్ నగర్ లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు కానుండడం ఎంతో గర్వించదగ్గ విషయం. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ వైద్య విధానాలను మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక అద్భుతమైన వార్త‘‘ అని అన్నారు.

 

ఈ ప్రాంతంలోని పర్యాటక రద్దీ కలిగిన సోన్ మార్గ్ లో అత్యవసర వైద్యసేవలను

ప్రారంభించడం కోసం, మూడు రోజుల ఫ స్ట్ ఎయిడ్/బిఎల్ఎస్ ట్రైనింగ్ వర్క్ షాప్ ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా, గందర్బల్ సి ఎం ఓ ప్రధమ చికిత్స/బిఎల్ఎస్ శిక్షణ ప్రాముఖ్యత గురించి , సాధారణ ప్రజల ప్రయోజనాల కోసం అవుట్ రీచ్ నైపుణ్యాల ఆధారిత శిక్షణా కార్యక్రమాలలో కాశ్మీర్ లోని డైరెక్టర్ హెల్త్ సర్వీసెస్ సునిశిత దృష్టి గురించి మంత్రికి వివరించారు. డి హెచ్ ఎస్ కె బిఎల్ఎస్ మాస్టర్ ట్రైనర్ బిఎల్ఎస్ సిమ్యులేషన్ ఆధారిత మెథడాలజీపై భాగస్వాములకు వివరిస్తున్న బిఎల్ఎస్ మాడ్యూల్స్ గురించి మంత్రికి వివరించారు. ఈ రకమైన శిక్షణ మొదటి సారిగా సోన్ మార్గ్ లో నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇది అన్ని వాతావరణ పరిస్థితుల అనుకూల పర్యాటక గమ్యస్థానంగా  గుర్తింపు కలిగివుంది.

 

కేంద్ర మంత్రి ట్రౌట్ ఫిష్ ఫారం - హేమర్- ను కూడా సందర్శించారు . అలాగే, వ్యవసాయ క్షేత్రం మాదిరి ఉండే రేస్ వేస్, వృత్తాకార చెరువు, స్టాకింగ్ చెరువు, ఓవా హౌస్, ఇండోర్ పెంపకం హేచరీ, ట్రౌట్ ఫీడ్ మిల్లు, వినోద చేపల చెరువు వద్ద అందుబాటులో ఉన్న సదుపాయాలను , పరిశీలించారు. రెయిన్ బో ట్రౌట్ ఫిషింగ్ శిక్షణ, పరిశోధన, సప్లై ఛైయిన్ మేనేజ్ మెంట్ తో సహా కార్యకలాపాలపై వివరాలను మంత్రి ఆసక్తిగా తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి మద్దతు వ్యాపారంలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఏవిధంగా సహాయపడుతోందనే సమాచారం కూడా తెలుసుకున్నారు. పొలం పెంపకం సామర్థ్యం 0.25 లక్షలు , పొదిగే సామర్థ్యం నాలుగు లక్షలు అని మంత్రికి తెలియజేశారు.

 

శ్రీ సోనోవాల్ నేషనల్ ఫిష్ సీడ్ ఫామ్ మానస్ బల్ ను సందర్శించారు, అక్కడ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నేషనల్ ఫిష్ సీడ్ ఫార్మ్ ప్రాముఖ్యత గురించి , కల్చర్ , క్యాప్చర్ సెక్టార్ ల్లో చేపల పెంపకం విస్తరణ కు తీసుకున్న వివిధ కార్యకలాపాల గురించి మంత్రికి వివరించారు. చేప విత్తన ఉత్పత్తి లో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, 2022-23 సంవత్సరంలో సుమారు 40.00 లక్షల కార్ప్ ఫిష్ ఫ్రై ఉత్పత్తి సాధించబడిందని, అందులో ఆక్వా-రాంచింగ్ కార్యక్రమం కింద సహజ జలవనరుల్లో గణనీయమైన సంఖ్యలో చేపల విత్తనాలను నిల్వ చేశామని, వివిధ ప్రైవేట్ , ప్రభుత్వ కార్ప్ ఫిష్ ఫార్మ్ లకు కూడా సరఫరా చేయబడిందని మంత్రికి తెలియజేశారు.

చేప విత్తనోత్పత్తి, చేపపిల్లల పెంపకం, తదనంతర అమ్మకాలతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాల పురోగతి, తక్కువ ఖర్చుతో కూడిన ఇల్లు, ఆటో రిక్షా, ఫిషింగ్ క్రాఫ్ట్ లు , గేర్లు , మత్స్యకారుల కమ్యూనిటీ అభ్యున్నతి కోసం అమలు జరుగుతున్న ఇతర సంక్షేమ పథకాల పురోగతి గురించి మంత్రికి వివరించారు. మనస్ బల్ లోని అత్యాధునిక ట్రౌట్ ఫీడ్ మిల్లు గురించి కూడా మంత్రికి వివరించారు, ఇది ప్రైవేట్ సెక్టార్ లో ట్రౌట్ ఫీడ్ డిమాండ్ ను,  అలాగే యు టి జమ్మూ ,కాశ్మీర్ ,లడఖ్ అంతటా ప్రభుత్వ డిమాండ్ ను తీరుస్తుంది

 

మానస్బల్ పార్కును సందర్శించిన మంత్రి శ్రీ సొనోవాల్ , పార్క్ లోపల 'గ్రీన్ కాశ్మీర్' చొరవ కింద చేపట్టిన ప్లాంటేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. పి-4, బేసిక్ సీడ్ ఫామ్, సెంట్రల్ సిల్క్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ టైల్స్, భారత ప్రభుత్వం, మానస్బల్, సఫపోరాను కూడా మంత్రి సందర్శించారు. డాక్టర్ రాజేష్ కుమార్, సీనియర్ సైంటిస్ట్/హెడ్, బయోబోల్టిన్ సిల్క్ ఆఫ్ కాశ్మీర్ గురించి , భారతదేశంలో ఈ స్టేషన్ ల ప్రాముఖ్యత గురించి మంత్రికి వివరించారు. భారతదేశంలో సమశీతోష్ణ బేసిక్ సిల్క్‌వార్మ్ సీడ్ అలాగే మల్బరీ టెంపరేట్ మల్బరీ జాతీయ ,అంతర్జాతీయ జెర్మ్‌ప్లాజమ్ బ్యాంక్‌ను నిర్వహించే ఏకైక స్టేషన్ ఇది. ఈ సందర్భంగా జిల్లాలోని సెరికల్చర్ రైతులతో మంత్రి ముచ్చటించారు.

 

అంతకుముందు, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ సింగ్ ఆయుష్ అభ్యాసాలను కేంద్రపాలిత ప్రాంతం అంతటా ఇంటి పేరుగా మార్చడానికి డిపార్ట్మెంట్ సాధించిన విజయాలను వివరించారు. ఆయుష్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేశామని, యోగాసనాల ద్వారా ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, వ్యాధుల నివారణకు అన్ని ఆయుష్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లలో యోగా బోధకులను నియమించినట్లు డాక్టర్ సింగ్ తెలిపారు.

 

32.50 కోట్ల వ్యయంతో జి యు ఎమ్ సి, గందర్‌బల్‌ ను జమ్మూ కాశ్మీర్ హౌసింగ్ బోర్డు నిర్మించింది. 2020-21 విద్యాసంవత్సరం నుంచి 60 సీట్లతో బ్యాచిలర్స్ ఇన్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (బీయూఎంఎస్) కోర్సును ప్రారంభించడానికి ప్రభుత్వ యునానీ మెడికల్ కాలేజీ (జీయూఎంసీ), గందర్బల్ కశ్మీర్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

 

జమ్మూ కాశ్మీర్ హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డ్ 32.50 కోట్ల వ్యయంతో జి యు ఎం సి,  గందర్‌బల్‌ను నిర్మించింది.ప్రభుత్వ యునాని మెడికల్ కాలేజ్ (జి యు ఎం సి) హాస్పిటల్, గందర్‌బల్ ,కాశ్మీర్‌కు 2020-21 అకడమిక్ సెషన్ నుండి 60 మంది ఇన్‌టేక్ కెపాసిటీతో మొదటి బ్యాచ్ ఆఫ్ బ్యాచిలర్స్ ఇన్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (బి యు ఎం ఎస్) కోర్సును ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

 

*****


(Release ID: 1871751) Visitor Counter : 136


Read this release in: English , Urdu , Hindi