ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తిపై పరిశోధించేందుకు కేరళకు అత్యున్నత స్థాయి బృందాన్ని పంపుతున్న కేంద్ర ప్రభుత్వం

Posted On: 27 OCT 2022 5:49PM by PIB Hyderabad

కేరళలో ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ ఫ్లూ) వ్యాప్తిపై పరిశోధించేందుకు ఒక అత్యున్నత స్థాయి బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపాలని కేంద్ర ఆరోగ్య  &కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తిపై ఈ బృందం సవివరంగా శోధించి సిఫార్సులతో కూడిన ఒక నివేదికను కేంద్రానికి సమర్పిస్తుంది.

మొత్తం ఏడుగురు నిపుణుల కేంద్ర బృందం కేరళకు వెళ్తోంది. దిల్లీలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్‌క్యులోసిస్ & రెస్పిరేటరీ డిసీజెస్', 'నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్', 'ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్', చెన్నైలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ' నిపుణులు ఈ బృందంలో ఉన్నారు. బెంగుళూరులో ఉన్న ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ ప్రాంతీయ కార్యాలయం సీనియర్‌ ఆర్.డి. డాక్టర్ రాజేష్ కేదామణి ఈ బృందానికి నాయకత్వం వహిస్తారు.

కేరళలో పెరుగుతున్న ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా కేసులను నిర్వహించడానికి ఆ రాష్ట్ర ఆరోగ్య విభాగాలకు కేంద్ర బృందం సాయం చేస్తుంది. ప్రజారోగ్య చర్యలు, నిర్వహణ మార్గదర్శకాలు, పద్ధతుల గురించి సూచనలు చేస్తుంది.

****



(Release ID: 1871397) Visitor Counter : 121


Read this release in: English , Urdu , Hindi , Malayalam