గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

రాజ్ కోట్ లో మూడు రోజుల ఇండియన్ అర్బన్ హౌసింగ్ కాన్ క్లేవ్ - 2022 కు 5,000 మందికి పైగా సందర్శకులు


పరిశుభ్రమైన పచ్చని నగరాలు, సృజనాత్మక వాతావరణ స్థితిస్థాపక నిర్మాణ సాంకేతికతలు, మురికివాడల పునరాభివృద్ధి , పట్టణ భారతదేశ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ లపై చర్చలు

అందరికీ ఇళ్లు అందించడానికి
గృహ నిర్మాణ , పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎం ఓ హెచ్ యు ఎ) చేస్తున్న ప్రయత్నాలకు ప్రశంస

ఎం ఓ హెచ్ యు ఎ ద్వారా గుర్తించబడ్డ పి ఎం ఎ యు - యు అమలులో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/యుఎల్ బి ల అసాధారణ సహకారం

Posted On: 22 OCT 2022 5:51PM by PIB Hyderabad

 గుజరాత్ లోని రాజ్ కోట్ లో మూడు రోజుల పాటు జరిగిన ఇండియన్ అర్బన్ హౌసింగ్ కాన్ క్లేవ్ ( ఐ యు హెచ్ సి ) -2022 ఘనంగాముగిసింది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022, అక్టోబర్ 19న ఈ సదస్సును అట్టహాసంగా ప్రారంభించారు., ఇందులో భాగంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పిఎమ్ఎవై-యు) కింద లైట్ హౌస్ ప్రాజెక్ట్ (ఎల్ హెచ్ పి) రాజ్ కోట్ ను కూడా ప్రధాన మంత్రి  ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు.

 

మరిన్ని వివరాల కోసం, ఇక్కడ చదవండి:

 

 

ఈ సందర్భంగా గృహ నిర్మాణ , పట్టణ

వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఒహెచ్ యుఎ) కు చెందిన నాలుగు ప్రచురణ లను కూడా గౌరవ ప్రధానమంత్రి

విడుదల చేశారు. గౌరవ గుజరాత్

ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ , కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ,  పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ హర్ దీప్ ఎస్ పూరి, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌష ల్ కిశోర్, ఇతర

ప్రముఖులు ఈ కార్యక్రమానికి

హాజరయ్యారు.

 

(టెక్స్ట్, స్కై, బిల్డింగ్, అవుట్ డోర్ డిస్క్రిప్షన్ కలిగిన ఒక చిత్రం )

 

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఎల్ హెచ్ పి లను ప్రారంభించిన ఆరు నగరాల్లో రాజ్ కోట్ ఒకటి. చెన్నైలో కూడా మే 2022 లో గౌరవ ప్రధాన మంత్రి ఒక ఎల్ హెచ్ పి ని ప్రారంభించారు. "కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ అందమైన ఇళ్లకు యజమానులుగా మారిన తల్లులు , సోదరీమణులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీపావళి సమయంలో నిర్మించిన మీ ఇళ్లలో లక్ష్మీ దేవి నివసించాలని ప్రార్థిద్దాం. నేను తాళాలు ఇస్తున్నప్పుడు ఇంటి గురించి ప్రతి ఒక్కరినీ అడుగుతున్నాను. వారి ముఖాల్లో ఉన్న తృప్తి ఇళ్ళకు సంబంధించిన ప్రతిదాన్ని సంక్షిప్తీకరించింది" అని గౌరవ ప్రధాన మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

 

(టెక్స్ట్, పర్సన్, స్టాండింగ్, ప్రిపేర్ అవుతున్న డిస్క్రిప్షన్ కలిగిన చిత్రం)

 

పిఎంఎవై-యు అవార్డ్స్ - 2021 విజేతలను కూడా ఈ కాన్ క్లెవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రకటించారు.  విజేతలను గౌరవ ప్రధాన మంత్రి సత్కరించారు.ఈ పథకం కింద ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు వరుసగా 1వ, 2వ, 3వ స్థానాల్లో నిలిచాయి. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీం (సిఎల్ఎస్ఎస్) అమలుకు గాను గుజరాత్ ఉత్తమ రాష్ట్రంగా అవార్డు పొందింది. ఈశాన్య, కొండ రాష్ట్రాల విభాగంలో పీఎంఏవై-యు కింద ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా త్రిపుర అవార్డు గెలుచుకుంది.

 

అవార్డుల ప్రదానోత్సవం తరువాత,

అంతర్జాతీయ, దేశీయ ఎగ్జిబిటర్లు ఇన్నోవేటివ్ బిల్డింగ్ మెటీరియల్స్ , కన్ స్ట్రక్షన్ టెక్నాలజీస్,  ప్రాసెస్ లపై ఎంఒహెచ్యుఎ కింద వివిధ

పట్టణ మిషన్ లపై ఏర్పాటు చేసిన

ప్రదర్శన లను ప్రధాన మంత్రి

సందర్శించారు.

 

అదే సమయంలో, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి, మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపల్ కౌన్సిల్ ,నగర పంచాయితీ స్థాయిలో పిఎమ్ఎవై-యు అవార్డులను, ప్రత్యేక కేటగిరీ అవార్డులను ప్రదానం చేశారు.జమ్ము, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలు, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూలను వాటి పని తీరుకు గానూ సన్మానించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి, అస్సాం తమిళనాడుకు చెందిన మంత్రులు కూడా పాల్గొన్నారు.

 

ఐ యు హెచ్ సి - 2022 లో రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి: మొదటిది స్వచ్ఛ భారత్ మిషన్, పట్టణ రవాణా, స్మార్ట్ సిటీస్ మిషన్, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్ (డి ఎ వై- ఎన్ యు ఎల్ ఎం) , ఎం ఓ యు హెచ్ యు ఎ నుండి పి ఎం స్వనిధి మిషన్ లపై ఎగ్జిబిషన్; అర్బన్ ల్యాండ్ స్కేప్ ఇన్నోవేటివ్ ఇండిజెనియస్ కన్ స్ట్రక్షన్ టెక్నాలజీస్ ను ఆవిష్కరించే గుజరాత్ స్టేట్ పెవిలియన్. రెండవ భాగం లో చౌకైన గృహనిర్మాణ వివిధ సమస్యలపై జాతీయ , అంతర్జాతీయ డొమైన్ నిపుణుల మధ్య చర్చలు ఉన్నాయి, ఇది దేశంలో భవిష్యత్ గృహనిర్మాణ విధానాలకు మార్గం సుగమం చేస్తుంది.మొత్తం మీద, రెండు ప్లీనరీ సెషన్లు, మూడు మేధోమథన సెషన్లు , ఆరు థీమాటిక్ సెషన్లను తక్కువ ధర లో హౌసింగ్, స్లమ్ రీడెవలప్ మెంట్ , బిల్డింగ్ టెక్నాలజీస్ పై నిర్వహించారు. యుఎన్-హాబిటాట్ ఇండియా, బిఎమ్ టిపిసి, జిఐజెడ్ ఇండియా కూడా మురికివాడల పునరాభివృద్ధి, క్లైమేట్ స్మార్ట్ బిల్డింగ్ లు, పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్ షిప్ లు, ఇన్ క్లూజివ్ సస్టెయినబుల్ పై వివిధ సెషన్లను నిర్వహించాయి. ప్రభుత్వ, ప్రయివేట్ ఏజెన్సీల ద్వారా సృజనాత్మక టెక్నాలజీలను ఉపయోగించడం వంటి అంశాలను సెషన్ లలో ప్రధానంగా చర్చించారు.

 

ఈ సెషన్ లలో జాతీయ , అంతర్జాతీయ ఖ్యాతి చెందిన పలువురు ప్రముఖులు ఈ పాల్గొన్నారు. 'పాలసీ డైలాగ్స్ ఫర్ బియాండ్ పీఎంఏవై(యు)' ముగింపు కూడా జరిగింది. భారతదేశంలో పట్టణ గృహనిర్మాణ కొరతను తీర్చాలనే దార్శనికతను నెరవేర్చడానికి ఒక వ్యూహాన్ని రూపొందించడానికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు/ భాగస్వాములతో ఈ ధారావాహిక ఒక చర్చా వేదికను అందించింది.

 

ఐరాస-హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి మైమునాహ్ మొహమ్మద్ షరీఫ్ మురికివాడల పునరాభివృద్ధిపై వర్చువల్ గా జరిగిన సెషన్ లో పాల్గొన్నారు. పని, సహాయం, సామాజిక భద్రత, ఓటు, గోప్యత లేదా విద్యతో సహా అనేక మానవ హక్కులను ఆస్వాదించడానికి తగినంత గృహనిర్మాణం ఒక ముందస్తు అవసరం అని షరీఫ్ తన సందేశంలో పేర్కొన్నారు.

 

"అనేక అధిక ప్రభావం , సమ్మిళిత కార్యక్రమాల" ద్వారా హౌసింగ్ డిమాండ్ సవాలును ఎదుర్కోవడానికి ఎం ఓ హెచ్ యు ఎ చేసిన కృషిని ఆమె ప్రశంసించారు.

 

"అతిపెద్ద సరసమైన గృహనిర్మాణ కార్యక్రమాల ద్వారా పట్టణ పేదలందరికీ మంచి గృహాలను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను. ఈ చొరవ మహిళలు, మైనారిటీలు, వికలాంగులు , పట్టణ వలసదారుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని ఆమె అన్నారు.

 

మూడవ రోజు జరిగిన ఈ సదస్సు ముగింపు సమావేశానికి గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిశోర్ అధ్యక్షత వహించారు.  గృహనిర్మాణ శాఖ సంయుక్త కార్యదర్శి,  మిషన్ డైరెక్టర్ శ్రీ కుల్దీప్ నారాయణ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్, కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి షర్మిలా జోసెఫ్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సదస్సులో ఉత్తమ ఎగ్జిబిటర్లకు, పోస్టర్ కాంపిటీషన్ కు మంత్రి అవార్డులను అందజేశారు

 

మొత్తం 5,000 మందికి పైగా సందర్శకులు, భాగస్వాములు, 200 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్న 'ఇండియన్ అర్బన్ హౌసింగ్ కాన్ క్లీవ్ - 2022' టెక్నాలజీ ప్రొవైడర్లు, వినియోగదారులు, ఆవిష్కర్తలు, అభ్యాసకులు , ఇతర భాగస్వాముల మధ్య అంతరాన్ని పూడ్చగలదని భావిస్తున్నారు. ఈ సదస్సు వాటాదారులకు వారి సాంకేతిక పరిజ్ఞానాలను ప్రదర్శించడానికి , అలాగే దేశంలో వివిధ రకాల గృహ నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అన్వయం, ప్రధాన స్రవంతి కోసం వివిధ మెటీరియల్ , ప్రక్రియల ఎంపికలపై చర్చించడానికి ఒక వేదికను అందించింది.

 

**** 



(Release ID: 1870361) Visitor Counter : 137


Read this release in: English , Urdu , Hindi