మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచారం 2.0 కింద పెండింగ్‌ లో ఉన్న అంశాలన్నింటినీ పరిష్కరించడం కొనసాగిస్తున్న - మత్స్య శాఖ


పరిశుభ్రత డ్రైవ్ కోసం 15 స్థలాలను గుర్తించిన - మత్స్య శాఖ

Posted On: 21 OCT 2022 1:53PM by PIB Hyderabad

రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత (లోపల, బయట), కార్యాలయంలో చెత్తను పారవేయడం, నిబంధనలను సడలించడం / స్థలాన్ని ఖాళీ చేసే ప్రక్రియల లక్ష్యంతో పెండింగ్లో ఉన్న అంశాలను పరిష్కరించడం కోసంప్రత్యేక ప్రచారం 2.0 ను  (2022 అక్టోబర్, 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు) చేపట్టడం జరిగింది.  ఇందులో భాగంగా మత్స్య శాఖ (డి.ఐ.ఎఫ్-జి.ఓ.ఐ.) తో పాటు,   దానికి అనుబంధంగా ఉన్న స్వయంప్రతిపత్తి సంస్థలు కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ యాక్ట్ (సి.ఏ.ఏ);   నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎం.ఎఫ్.డి.బి);   మరియు దానికి అనుబంధంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ (ఎన్.ఐ.ఎఫ్.పి.హెచ్.ఏ.టి.టి);  సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ (సి.ఐ.ఎఫ్.ఎన్.ఈ.టి);  ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎస్.ఐ);  సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజనీరింగ్ ఫర్ ఫిషరీస్ (సి.ఐ.సి.ఈ.ఎఫ్) వంటి సంస్థలు వివిధ కార్యక్రమాలు చేపట్టాయి.  ఈ పరిశుభ్రతా ప్రచార కార్యక్రమం అమలు కోసం డి.ఓ.ఎఫ్. (జి.ఓ.ఐ) ఆధీనంలోని 15 ప్రాంతాలలోని కార్యాలయాలతో పాటు, వాటి అనుబంధ కార్యాలయాలను గుర్తించడం జరిగింది. 

ముందస్తు సన్నాహక దశలో భాగంగా (2022 సెప్టెంబర్, 14వ తేదీ నుంచి 30వ తేదీ వరకు), పట్టణ, సబర్బన్ ప్రాంతాల్లోని క్షేత్ర కార్యాలయాలపై ప్రచారం దృష్టి కేంద్రీకరించడంతో, ఈ విభాగంతో పాటు దాని అధీనంలోని కార్యాలయాల అధికారులు / ఇతర సిబ్బందికి తగిన అవగాహన ఏర్పడింది, సమీకరించబడ్డారు.  ప్రచారం కోసం ఎంపిక చేసిన వర్గాలలో పెండింగు అంశాలను గుర్తించడం జరిగింది.  నిర్దేశించిన విధానాల ప్రకారం వాటిని పరిష్కరించి, అనవసరమైన చెత్తను, అవసరమైన సామాగ్రిని గుర్తించి ఖరారు చేయడం జరిగింది. 

వివిధ కార్యకలాపాల ద్వారా ఈ ప్రచార కార్యక్రమంలో డి.ఓ.ఎఫ్. (జి.ఓ.ఐ) చురుకుగా పాల్గొంటోంది.  ప్రచారం యొక్క పురోగతిని అధిక రిజల్యూషన్ కలిగిన ఫోటోల ద్వారా కార్యక్రమాలు చేపట్టడానికి "ముందు, తర్వాత దృశ్యాలను" సేకరించి, భద్రపరచడం జరుగుతోంది.  మత్స్య శాఖ, డి.ఏ.ఆర్.పి.జి., స్వచ్ఛత ప్రచారం 2.0 కి సంబంధించిన  చిత్రాలు / వీడియోలను జత చేసేటప్పుడు, వాటిని సామాజిక మాధ్యమం వేదికలలో పంచుకోవాలని, తమ ఆధీనంలోని అన్ని కార్యాలయాలు, అనుబంధ కార్యాలయాలకు సూచించడం జరిగింది. 

ఈ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు డి.ఓ.ఎఫ్. కు చెందిన ప్రాంతీయ కార్యాలయాలను కూడా ప్రోత్సహించడం జరిగింది.   దేశంలోని వివిధ తీర ప్రాంతాల్లోని అన్ని విభాగాలు / డివిజన్లు / హాళ్ళు / రికార్డు గదులతో పాటు ఆధీనంలోని కార్యాలయాలు, అనుబంధంగా ఉన్న కార్యాలయ ప్రాంతాల్లో కూడా తనిఖీ / సందర్శన చేపట్టడం జరుగుతోంది.   ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా, సహాయ మంత్రి (ఎం.ఓ.ఎస్) డాక్టర్ ఎల్ మురుగన్, 2022 అక్టోబర్, 21వ తేదీన చెన్నై జోనల్ కార్యాలయాల్లోని  రెండు ప్రదేశాలను సందర్శించి, పురోగతిని సమగ్రంగా సమీక్షించారు.  ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా, 2022 అక్టోబర్ 20వ తేదీన, డి.ఓ.ఎఫ్-జి.ఓ.ఐ. సెక్రటరీ (ఫిషరీస్) శ్రీ జతీంద్ర నాథ్, విశాఖపట్నంలో ఎఫ్.ఎస్.ఐ. మరియు సి.ఐ.ఎఫ్.ఎన్.ఈ.టి. జోనల్ కార్యాలయాలలో కొనసాగుతున్న ప్రచారం సందర్భంగా సాధించిన పురోగతి, విజయాలను పరిశీలించారు. 

"ప్రత్యేక ప్రచారం 2.0" గురించి అవగాహన కల్పించడం కోసం, ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ తో పాటు స్టాండులను కారిడార్ల వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రదర్శించడం జరుగుతోంది. 

"ప్రత్యేక ప్రచారం 2.0" కింద, పెండింగ్‌లో ఉన్న వి.ఐ.పి. అభ్యంతరాలను తొలగించి, డిపార్ట్‌మెంటుకు చెందిన పథకాలు / కార్యక్రమాల కింద ప్రాజెక్టు ప్రతిపాదనల ఆమోదాలు వేగవంతం చేయడం జరిగింది.   డి.ఏ.ఆర్.పి.జి. కి చెందిన ఎస్.సి.డి.పి.ఎం. పోర్టల్‌ లక్ష్యం, సాధన, కార్యకలాపాల చిత్రాలు (ముందు, తరువాత) ప్రతిరోజూ అప్‌-లోడ్ చేయడం జరుగుతోంది. 

ఎన్.ఎఫ్.డి.బికార్యాలయం ఆవరణలో క్వార్టర్స్ వెనుక వైపు శుభ్రం చేస్తున్న ఉద్యోగులు

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0026G21.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003U0AY.jpg

ప్రచార సమయంలో, ప్రజల ఫిర్యాదులు, వి.ఐ.పి. సూచనల సంఖ్య తగ్గడంతో పాటు, రికార్డుల నిర్వహణ, సుందరీకరణ, స్థల వినియోగం కోసం ప్రాంగణాన్ని భౌతికంగా శుభ్రపరచడం వంటి అంశాలలో విశేషమైన పురోగతి కనిపించింది.

 

 

*****

 


(Release ID: 1870147) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Hindi