రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ, ఎయిరోస్పేస్ రంగంలో 2021-22 సంవత్సరానికి ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేసిన రక్షణమంత్రి శ్రీరాజ్‌నాథ్ సింగ్.
అద్భుత ఆణిముత్యాలుగా వారిని అభినందించిన మంత్రి, ఆత్మనిర్భర్ భారత్ సాధనకు చోదకశక్తులుగా , దార్శనికులుగా అభివర్ణన
ఎయిరోస్పేస్, రక్షణ రంగం అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు గల రూ 80,000 కోట్ల రూపాయల రంగం. ఇందులో ప్రైవేటు రంగం వాటా 17 ,000 కోట్ల రూపాయలు.
రక్షణ రంగ ఆవిష్కరణలకు మేధోసంపత్తి హక్కుల రక్షణ ఉండాలన్న రక్షణమంత్రి.ఈ విషయంలో సూచనలు ఇవ్వాల్సిందిగా రక్షణమంత్రి పిలుపు
అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేకతను చాటుకునేందుకు తక్కువ ఖర్చుకాగల అత్యధునాతన ఉత్పత్తులను తయారు చేయాల్సిందిగా పిలుపునిచ్చిన రక్షణమంత్రి
Posted On:
20 OCT 2022 5:24PM by PIB Hyderabad
రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రక్షణ, ఎయిరోస్పేస్ రంగంలో 2021-22 సంవత్సరానికి రక్షామంత్రి అవార్డ్స్‌ఫర్ ఎక్సలెన్స్‌ను భారత రక్షణ పరిశ్రమలకు అందజేశారు. ఇందులో ప్రైవేటు రంగానికి చెందిన సంస్థలు కూడా ఉన్నాయి. గుజరాత్ లోని గాంధీ నగర్‌లోజరిగిన 12వ డిఫెక్స్‌పోలో భాగంగా అక్టోబర్ 20,2022న ఈ అవార్డులను రక్షణమంత్రి అందజేవారు.వివిధ కేటగిరీల కింద మొత్తం 22 అవార్డులను అందజేశారు. దిగుమతులకు ప్రత్యామ్నాయం, దేశీయత, ఆవిష్కరణలు, సాంకేతిక అధ్బుత సాధన, ఎగుమతులకు వీలుక ల్పించడం వంటి రంగాలకు వీటిని ఇచ్చారు. ఈ 22అవార్డులలో 13 అవార్డులను ప్రైవేటు సంస్థలు దక్కించుకున్నాయి. మిగిలిన వాటిని డిపిఎస్‌యులు, పిఎస్‌యులు దక్కించుకున్నాయి. ఈ అవార్డులు వివిధ సంస్థల స్థాయిలో భారీ , మధ్యతరహా, చిన్న తరహా స్టార్టప్ఎంటర్‌ప్రైజ్‌లకు అన్ని కేటగిరీలకు సమాన అవకాశాలు కల్పిస్తూ వీటిని అందజేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ రక్షణమంత్రి ,ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం, సంస్థాగత పనితీరుకు సంబంధించి ఆల్‌రౌండ్ ఎక్సలెన్స్‌కు వీలుకల్పిస్తూ , రక్షణ, ఎయిరోస్పేస్ రంగాలలో భారతదేశ పునాదిని పటిష్టం చేసేందుకు , ఈ రంగంలోని ఆణిముత్యాలను గుర్తించి ప్రత్యేకించి ఎంఎస్ఎంఇ, స్టార్టప్‌రంగాలలో ప్రతిభగలవారిని గుర్తించి వారిని ఇతరులకు మార్గదర్శకులుగా చూపేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ అవార్డులను 2022నుంచి తిరిగి ఏర్పాటుచేసినట్టు చెబుతూ, ప్రైవేటు పరిశ్రమలను కూడా ఇందులో చేర్చినట్టు చెప్పారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌ను మరింత ముందుకు తీసుకుపోతుందని, ఈ కంపెనీలను ప్రోత్సహిస్తుందని తెలిపారు.
భారతదేశ రక్షణవ్యవస్థ అద్భుతమైనదని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రభుత్వం, రక్షణ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఉమ్మడి కృషితో ముందుకుసాగుతున్నదన్నారు. ప్రస్తుతం సాగుతున్న సంయుక్త కృషిని అభినందిస్తూ మంత్రి ఇది రక్షణ రంగాన్ని మరింత ముందుకు తీసుకుపోతుందన్నారు. ఈ రంగంలో సుస్థిర ప్రగతికి పరస్పరం సహకరించుకుంటూ ముందుకు పోవాలని మంత్రి సూచించారు.
ఎయిరొస్పేస్, రక్షణ రంగం ప్రస్తుతం 80,000 కోట్ల రూపాయల విలువగలదని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.ఇందులో ప్రైవేటు రంగం భాగస్వామ్యం 17,000 కోట్ల రూపాయలని ఆయన అన్నారు. రక్షణ మంత్రిత్వశాఖ దార్శనికత భారత రక్షణ, ఎయిరోస్పేస్ రంగం సామర్ధ్యాలను ప్రపంచానికి చూపే ప్రయత్నం రక్షణ మంత్రిత్వశాఖ చేస్తుండడం దాని దార్శనికతకు అద్దం పడుతున్నదన్నారు. తక్కువ ఖర్చుకాగల అత్యధునాతన ఉత్పత్తులను తయారుచేస్తే రక్షణమంత్రిత్వశాఖ దార్శనిక లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఆయన అన్నారు. ఉన్నత స్థాయి ఉత్పత్తులు అవి తయారు చేసే దేశాన్ని ప్రతిబింబిస్తాయని అంటూ రక్షణమంత్రి, తక్కువ ఖర్చు కాగల నాణ్యమైన ప్రత్యేకతతో కూడిన అధునాతనసాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉత్పత్తులను తయారు చేయాల్సిందిగా పి
రక్షణ,ఎయిరోస్పేస్ రంగంలో అద్భుతనైపుణ్యాలను సాధించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నట్టు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. తద్వారా ప్రధానమంత్రి దార్శనికత అయిన ఆత్మనిర్భర్ భారత్‌ను సాకారం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రక్షణ ఉత్పత్తుల రంగంలో స్వావలంబన సాధించేందుకు దేశీయ ఉత్పత్తుల జాబితా రూపొందించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. రక్షణ మంత్రిత్వశాఖలో డిఫెన్స్ ఇన్వెస్టర్ సెల్ ను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. రక్షణరంగంలో పెట్టుబడి అవకాశాలు, ప్రొసీజర్లు, ఇతర రెగ్యులేటరీ అవసరాలకు సంబంధించిన సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దేశీయ పోర్టల్ శ్రీజన్ గురించి ప్రస్తావించారు. త్రివిధ దళాలకు అవసరమైన రక్షణ పరికరాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు వన్ స్టాప్ పోర్టల్‌ను ఏర్పాటుచేసినట్టు మంత్రి తెలిపారు.
రక్షణరంగంలో ఐపిఆర్‌లను ప్రోత్సహించాల్సిన అవసరం గురించి రక్షణమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ఎక్సలెన్స్ అవార్డుల ద్వారాఇది ప్రాముఖ్యత సంతరించుకున్నట్టు ఆయన చెప్పారు. మిషన్ రక్షా గ్యాన్ శక్తిని డిఫెన్స్ రంగంలో మేధో సంపత్తి హక్కుల ను ప్రోత్సహించేందుకు ప్రారంభించినట్టు చెప్పారు. మేథో సంపత్తి హక్కుల సెల్ ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, డిజైన్లు, కాపీరైట్లకు సంబంధించి ఐపిఆర్ విషయంలో తగిన సలహాలు ఇచ్చేందుకు దీనిని ఏర్పాటుచేసినట్టు చెప్పారు.
రక్షణరంగంలో ఐపిఆర్‌ను ప్రోత్సహించేందుకు ఇలాంటి సంస్కరణల చర్యలను తీసుకువచ్చినట్టు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ చర్యల వల్ల భారత రక్షణ,ఏయిరోస్పేస్ పరిశ్రమల విస్తరణకు, గుర్తింపునకు మరిన్ని అవకాశాలు లభించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ రక్షణ ఉత్పత్తులు జాతీయంగా , అంతర్జాతీయంగా ఇతర ప్రముఖ కంపెనీలతో పోటీకి నిలవగలుగుతున్నట్టు చెప్పారు.
రక్షణ రంగం పురోభివృద్దికి అవసరమైన సంస్కరణలు నిరంతర ప్రక్రియ అని అంటూ ఇందుకు స్టేక్‌హోల్డర్లు నిరంతర కృషి చేయాలన్నారు. భారతీయ పరిశ్రమ ముందుకు వచ్చి సంపూర్ణ స్వావలంబన సాధించేందుకు నిర్మాణాత్మక సూచనలు చేయాలని పిలుపునిచ్చారు. పరిశ్రమ ఆకాంక్షలను నెరవేర్చేందుకు రక్షణ మంత్రిత్వశాఖ కట్టుబడి ఉన్నట్టు మంత్రి తెలిపారు.
రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీ అజయ్ భట్, ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, ఛీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ ఛీఫ్ మార్షల్ వి.ఆర్. చౌదరి, ఛీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్. హరి కుమార్, ఛీఫ్ ఆప్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పామడే, ఇతర సీనియర్ సివల్ , మిలటరీ అధికారులు, రక్షణ మంత్రిత్వశాఖ అధికారులు ఈ సందర్భంగా పాల్గొన్నారు.
***
(Release ID: 1870000)
Visitor Counter : 157