పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కంప్రెస్డ్ బయో గ్యాస్ (సిబిజి) ఈ కాలపు అవసరం, దాని చుట్టూ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది: శ్రీ హర్దీప్ ఎస్. పూరి


రైతులు, పర్యావరణానికి పరస్పరం ప్రయోజనం పొందే పరిస్థితిని చేరుకోవడంలో సిబిజి ప్లాంట్లు ఒక పెద్ద ముందడుగు: శ్రీ హర్దీప్ ఎస్. పూరి

ఆసియాలోనే అతిపెద్ద కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్‌ను సంగ్రూర్‌లో ప్రారంభించిన కేంద్ర మంత్రి హర్దీప్ ఎస్. పూరి

సంగ్రూర్ సిబిజి ప్లాంట్ 390 మందికి ప్రత్యక్షంగా, 585 మందికి పరోక్షంగా ఉపాధిని అందిస్తుంది: శ్రీ హర్దీప్ ఎస్. పూరి

సంగ్రూర్ ప్లాంట్ 40,000 – 45,000 ఎకరాల కోత కోసిన పొలాల కాల్చడాన్ని తగ్గించడానికి,
ఏడాదికి 150,000 టన్నుల సమానమైన కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది

प्रविष्टि तिथि: 19 OCT 2022 4:15PM by PIB Hyderabad

పంజాబ్‌లోని సంగ్రూర్‌లోని లెహ్రాగాగాలో ప్రారంభించిన ఆసియాలోనే అతిపెద్ద కంప్రెస్డ్ బయో గ్యాస్ (సిబిజి) ప్లాంట్,  కేవలం సిబిజి ఆధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక మాస్టర్ ప్లాన్ అవుతుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పూరి అన్నారు. సంగ్రూర్‌లోని ఈ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. సిబిజి అనేది ప్రస్తుత ఆవశ్యకమని, దాని చుట్టూ ఉన్న పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు.

సంగ్రూర్‌లో శ్రీ హర్‌దీప్ ఎస్. పూరి ప్రారంభించిన కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్, పర్యావరణ వ్యవస్థను నెలకొల్పడానికి అక్టోబర్ 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫర్డబుల్ ట్రాన్స్‌పోర్టేషన్ (ఎస్ఏటిఎస్ఏటి) పథకం లక్ష్యాలను సాధించడంలో ఒక అడుగు, దేశంలోని వివిధ వ్యర్థాలు/బయోమాస్ మూలాల నుండి కంప్రెస్డ్ బయో గ్యాస్ (సిబిజి) ఉత్పత్తి. ఈ పథకం రైతులకు మద్దతు ఇవ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, భారతదేశ దేశీయ ఇంధన ఉత్పత్తి, స్వయం సమృద్ధిని పెంచడం, వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ప్రపంచాన్ని స్వచ్ఛమైన ఇంధన పరివర్తన వైపు నడిపించడంలో భారతదేశానికి సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాంట్ కాకుండా,  ఎస్ఏటిఎస్ఏటి చొరవ కింద 38 సిబిజి / బయోగ్యాస్ ప్లాంట్లు సిద్ధమయ్యాయి.

సంగ్రూర్‌లోని సిబిజి  ప్లాంట్, జర్మనీ కి చెందిన ప్రముఖ బయో-ఎనర్జీ కంపెనీలలో ఒకటైన వెర్బియో ఏజి ద్వారా సుమారు రూ. 220 కోట్ల ఎఫ్ డి ఐ పెట్టుబడితో ప్రారంభించారు. ఇది సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్లాంట్ ప్రస్తుత ఉత్పత్తి సుమారు 6 టిపిడి సిబిజి,  అయితే త్వరలో ఈ ప్లాంట్ గరిష్టంగా రోజుకు 300 టన్నుల వరి గడ్డిని ప్రాసెస్ చేస్తుంది. 10,000 క్యూబిక్ మీటర్ల 8 డైజెస్టర్‌లను ఉపయోగించి 33  టిపిడి సిబిజిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. 

సిబిజి ప్లాంట్ ప్రారంభోత్సవం రోజు ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వారా రైతు సమాజానికి కీలకమైన పథకాలు, ప్రయోజనాలను ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ ప్లాంట్‌ను ప్రారంభించుకోవడం విశేషమని శ్రీ హర్దీప్ ఎస్. పూరి తెలిపారు. నిన్న, పీఎం-కిసాన్ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం 12వ విడత సహాయాన్ని ప్రధాని విడుదల చేసారు. రూ.16,000 కోట్లు రైతు-లబ్దిదారుల ఖాతాల్లోకి తక్షణమే బదిలీ అయ్యాయి. 600 ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను (పీఎంకేఎస్కేలు) కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు, ఇవి ఎరువుల విక్రయ కేంద్రాలు మాత్రమే కాకుండా దేశంలోని రైతులతో లోతైన బంధాన్ని ఏర్పరచుకునే యంత్రాంగాన్ని కలిగి ఉంటాయి. ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన - వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్, రైతులకు 'భారత్ బ్రాండ్' కింద నాణ్యమైన ఎరువులను సరసమైన ధరకు అందజేసే పథకాన్ని కూడా ఆయన ప్రారంభించారు.

కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రి ఈ సిబిజి ప్లాంట్ల వంటి కార్యక్రమాలు రైతులకు,, పర్యావరణానికి ఉమ్మడి ప్రయోజనాన్ని కలిగించే ఒక భారీ ముందడుగు అని అన్నారు. 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంగ్రూర్ సిబిజి ప్లాంట్ ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయని కేంద్ర మంత్రి అన్నారు. ఈ ప్లాంట్ 100,000 టన్నుల వరి గడ్డిని వినియోగిస్తుందని అన్నారు. ఇది ప్లాంట్ కి 10 కి.మీ పరిథిలో 6-8 ప్రదేశాల నుండి ఎండు గడ్డిని సేకరిస్తుంది. ప్రతిరోజూ దాదాపు 600-650 టన్నుల ఎఫ్ఓఎం (ఫర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువు) ఉత్పత్తి అవుతుంది, వీటిని సేంద్రీయ వ్యవసాయానికి ఉపయోగించవచ్చు. సిబిజి ప్లాంట్ 390 మందికి ప్రత్యక్షంగా, 585 మందికి పరోక్ష ఉపాధిని కూడా అందిస్తుంది.

ఈ ప్లాంట్ సంగ్రూర్ రైతులకు అదనపు ఆదాయాన్ని అందించడమే కాకుండా, కోత తర్వాత మిగిలిన మోడును కాల్చడానికి అవసరమైన ప్రత్యామ్నాయాన్ని కూడా అందిస్తుంది అని మంత్రి తెలిపారు. ఈ ప్లాంట్ వల్ల 40,000 - 45,000 ఎకరాల పొలాలను తగలబెట్టడాన్ని తగ్గిస్తుంది. ఇది 150,000 టన్నుల కర్బన ఉద్గారాలను వార్షికంగా తగ్గించగలదని, ఇది పంజాబ్‌లోని సంగ్రూర్ పౌరులు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం కలిపిస్తుందని ఆయన అన్నారు. భారతదేశం కాప్ 26 వాతావరణ మార్పు లక్ష్యాలు ఇప్పటి నుండి 2030 వరకు ఒక బిలియన్ టన్నుల మొత్తంగా అంచనా వేసిన కార్బన్ ఉద్గారాలను 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడానికి ఇది కూడా దోహదపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. 

క్యాస్కేడ్‌లు, కంప్రెసర్లు & డిస్పెన్సర్‌లు వంటి సీబీజీ ప్లాంట్ పరికరాల స్వదేశీ తయారీని ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, ఇది భారతదేశ తయారీ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’ అవకాశాలను పెంచుతుందని శ్రీ హర్దీప్ ఎస్. పూరి పేర్కొన్నారు. ప్లాంట్ల స్థాపనకు చౌకగా రుణాలు అందజేసేందుకు వాటాదారులతో సమాలోచనలు జరుపుతున్నామని ఆయన చెప్పారు.

***


(रिलीज़ आईडी: 1869373) आगंतुक पटल : 125
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Kannada