పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

గాలి నాణ్యత పారామితులను నిశితంగా పర్యవేక్షిస్తున్న సిఏక్యూఎం - వాయు కాలుష్యాన్ని తగ్గించే చర్యలపై సమీక్ష


05.10.2022 నుండి అమలులో ఉన్న జిఆర్ఏపి ఒకటవ దశ కింద సంబంధిత వారందరూ నివారణ చర్యలు తీసుకోవాలి

స్టేజ్-I కింద జిఆర్ఏపి చర్యలను ఎన్‌సిఆర్ అంతటా అమలు/పర్యవేక్షించే అన్ని ఏజెన్సీలు తీవ్రతరం చేయాలి: సిఏక్యూఎం

ఎన్‌సిఆర్, డిపిసిసిలో జిఆర్‌ఎపి, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పిసిబిలు) కింద చర్యలను అమలు చేయడానికి బాధ్యత వహించే ఏజెన్సీలు కఠినంగా వాటిని అమలు చేయాలి.

పౌరులు ఏజెన్సీలకు సహకరించాలి

Posted On: 16 OCT 2022 5:13PM by PIB Hyderabad

ఎన్‌సిఆర్, పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సిఏక్యూఎం)  ఎన్‌సిఆర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దృష్ట్యా  జిఆర్ఏపి మొదటి దశ కింద చర్యలను ఖచ్చితంగా అమలు చేయాలని  ఎన్‌సిఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేసే అన్ని ఏజెన్సీలకు పునరుద్ఘాటించింది. ఇది కూడా పౌరులు సంబంధిత దశల పౌర చార్టర్‌కు కట్టుబడి సహకరించాలని, ప్రాంతంలో మొత్తం గాలి నాణ్యతను మెరుగుపరచడానికి  జిఆర్ఏపి చర్యలను సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయం చేయాలని కోరారు. ఢిల్లీలోని గాలి నాణ్యత 05.10.2022న " అధమ " స్థాయికి దిగజారింది, అయితే అది తర్వాత మెరుగుపడింది. గాలి నాణ్యత మళ్లీ "అధమ" స్థాయికి చేరినందున, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జిఆర్ఏపి) దశ I కింద చర్యలను సంబంధిత వారందరూ తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంది. 

నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) గాలి నాణ్యతను మెరుగుపరచడానికి, తగ్గించడానికి దాని కఠినమైన ప్రయత్నాలను కొనసాగిస్తూ,  ఎన్‌సిఆర్, పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సిఏక్యూఎం)  సబ్-కమిటీ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చేపట్టిన చర్యలను సమీక్షిస్తోంది. కూడా వాతావరణ పరిస్థితులు మరియు ఐఎండి/ఐఐటీఎం అందుబాటులో ఉంచిన వాతావరణ పరిస్థితులు, గాలి నాణ్యత "అధమ" స్థాయి సూచిక ప్రకారం  ఎన్ సిఆర్ లో  గాలి నాణ్యత పారామితులను నిశితంగా పర్యవేక్షించడం జిఆర్ఏపి - 'అధమంగా' గాలి నాణ్యత (201-300 మధ్య ఢిల్లీ ఏక్యూఐ) దశ I కింద ఊహించిన విధంగా అన్ని చర్యలను అమలు చేశారు.  జిఆర్ఏపి  -'పూర్' ఎయిర్ క్వాలిటీ (ఢిల్లీ  ఏక్యూఐ 201-300 మధ్య) దశ I కింద చర్యలను ప్రారంభించడం కోసం ఆర్డర్ తదనుగుణంగా 05.10.2022న జారీ అయింది. ఇప్పటికీ అమలులో ఉంది.

 

సవరించిన  జిఆర్ఏపి మొదటి దశ  ప్రకారం 24-పాయింట్ యాక్షన్ ప్లాన్ ఇప్పటికే మొత్తం ఎన్ సి ఆర్ లో 05.10.2022 నుండి అమలులో ఉంది. ఈ 24-పాయింట్ యాక్షన్ ప్లాన్‌లో సంబంధిత ఎన్‌సిఆర్ రాష్ట్ర ప్రభుత్వం 'వెబ్ పోర్టల్'లో నమోదు చేసుకోని ప్లాట్ పరిమాణం 500 చదరపు మీటరర్లు అంత కంటే  ఎక్కువ ఉన్న ప్రాజెక్ట్‌ల సి అండ్ డి  కార్యకలాపాలను మూసివేయడం వంటి దశలు ఉన్నాయి; ధూళి నివారణ చర్యలు, నిర్మాణ కూల్చివేత వ్యర్థాల మంచి పర్యావరణ నిర్వహణపై మార్గదర్శకాలను సరిగ్గా అమలు చేయడం; మునిసిపల్ సాలిడ్ వేస్ట్, వ్యర్థాలు, ప్రమాదకర వ్యర్థాల కు ప్రత్యేకించిన డంప్ సైట్ల నుండి క్రమం తప్పకుండా ఎత్తడం; క్రమానుగతంగా మెకనైజ్డ్ స్వీపింగ్, లేదా రోడ్డుపై నీరు చిలకరించడం; సి అండ్ డి సైట్‌లలో యాంటీ స్మోగ్ గన్‌ల ఉపయోగం; బయోమాస్, పురపాలక ఘన వ్యర్థాలను బహిరంగంగా కాల్చడంపై నిషేధం; కఠినమైన నిఘా, పియుసి నిబంధనల అమలు; విద్యుత్ సరఫరా,  సాధారణ వనరుగా డిజి సెట్‌లను ఉపయోగించకూడదని కఠినమైన నిషేధాలు; పారిశ్రామిక ప్రాంతాల్లో ఆమోదించబడిన ఇంధనాలను మాత్రమే ఉపయోగించడం; 

ఇంకా, జిఆర్ఏపి కింద చర్యలను అమలు చేయడానికి బాధ్యత వహించే వివిధ ఏజెన్సీలు, ఎన్ సి ఆర్, డిపిసిసి రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు  కింద దశల వారీ చర్యలను ఖచ్చితంగా అమలు చేయాలి. షెడ్యూల్ ,  కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. www.caqm.nic.in ద్వారా యాక్సెస్ చేయవచ్చు

కమిషన్, ఎప్పటికప్పుడు, ఈ ప్రాంతంలో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు నిర్దేశించిన విధాన కార్యక్రమాలు, చర్యలతో కూడిన సలహాలు, ఆదేశాలను జారీ చేస్తోంది. సిఏక్యూఎం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్ సి ఆర్ లోని ఇతర ఏజెన్సీలకు 68 ఆదేశాలు, 7 అడ్వైజరీ లు జారీ చేసింది.

 

*****(Release ID: 1868499) Visitor Counter : 83


Read this release in: English , Urdu , Hindi