భారత ఎన్నికల సంఘం
సాధారణ ఎన్నికలు/ శాసనసభల ఉప ఎన్నికల కోసం కోవిడ్ మార్గదర్శకాలు
Posted On:
14 OCT 2022 5:24PM by PIB Hyderabad
కోవిడ్ మార్గదర్శకాలు, 2022
మొదటి సమావేశం జరిగిన తేదీ నుంచి 5 సంవత్సరాల పాటు శాసన సభ పదవీకాలం ఉంటుందని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 172(1) పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ పదవీ కాలం 2023 జనవరి 8 నాటికి, గుజరాత్ శాసనసభ పదవీ కాలం 2023 ఫిబ్రవరి 18 నాటికి ముగుస్తుంది. భారత రాజ్యాంగం లోని 324 అధికరణం ని 171(1) తో కలిపి చదివినప్పుడు, ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 15 కింద పదవీ కాలం ముగిసే లోపు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ శాసనసభలకు స్వేచ్ఛగా, న్యాయమైన, భాగస్వామ్య, ప్రాప్యత, సమ్మిళిత మరియు సురక్షితమైన ఎన్నికలు నిర్వహించడానికి భారత ఎన్నికల సంఘం ( ఇకపై ఈసీఐ గా ప్రస్తావించబడుతుంది) కట్టుబడి ఉంది.
2. ఓటు మరియు ఓటర్లకు భద్రత కల్పిస్తూ చట్టపరమైన మరియు సంస్థాగత నిబంధనల ప్రకారం రాజ్యాంగ నిబంధనల మేరకు దఖలు పడ్డ అధికారాన్ని వినియోగించి నిర్ణీత వ్యవధిలో గా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది.
3. కోవిడ్ సమయంలో బీహార్, తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల శాసనసభలకు సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం 2020 ఆగస్టు 21 న “COVID-19 సమయంలో సాధారణ ఎన్నికలు/ఉప ఎన్నికల నిర్వహణకు విస్తృత మార్గదర్శకాలను” విడుదల చేసింది. ఆ తర్వాత గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ మరియు ఉత్తర ప్రదేశ్ శాసనసభలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భం పరిస్థితిని సమీక్షించి జనవరి 8, 2022న “సవరించిన మార్గదర్శకాలు 2022”ని ఎన్నికల సంఘం జారీ చేసింది. దీని ప్రకారం, ప్రచారం, ప్రదర్శనలు లాంటి అంశాలపై సంఘం ఆంక్షలు విధించింది. వీటిని 2022 జనవరి 15, 2022 జనవరి 22, 2022 జనవరి 31, 2022 ఫిబ్రవరి 6, 2022 ఫిబ్రవరి 12, 2022 ఫిబ్రవరి 22, 2022 మార్చి 10 న విడుదల చేసిన ప్రకటనల ద్వారా దశల వారీగా ఎన్నికల సంఘం సడలించింది.
4. 2022 సెప్టెంబర్ 7న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శితో, 2022 సెప్టెంబర్ 13 న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శి (హోం) ప్రధాన ఎన్నికల అధికారులతో కోవిడ్ తాజా పరిస్థితిపై ఎన్నికల సంఘం సమావేశం సమీక్షించింది. కోవిడ్ తాజా పరిస్థితి, టీకా కార్యక్రమం స్థాయి, ప్రస్తుతం అమలులో ఉన్న ఎస్డీఎంఏ మార్గదర్శకాలు, రానున్న పండుగల కాలంలో కోవిడ్ జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చలు జరిగాయి. దేశంలో పరిస్థితులు మెరుగుపడ్డాయని, కేసుల సంఖ్య పెరిగితే పరిస్థితిని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ నియంత్రణ చర్యల కోసం డీఎం చట్టం లోని చర్యలు అమలు చేయవలసిన అవసరం లేదని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు రావడం జరిగింది.
5.కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన సూచనలు ముఖ్యంగా టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్ మరియు కోవిడ్ సముచిత ప్రవర్తన విధానాన్ని ఖచ్చితంగా పాటించాలని మరియు కొనసాగించాలని గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ ముఖ్య కార్యదర్శులు మరియు ఇతర అధికారులను సంఘం ఆదేశించింది. అర్హులైన పోలింగ్ సిబ్బంది, అధికారులందరికీ టీకాలు వేయాలని కమిషన్ సూచించింది. అంతేకాకుండా, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మరియు/లేదా సంబంధిత రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ లు సూచించిన మార్గదర్శకాల ప్రకారం కఠినమైన నిఘా ఉంచాలని మరియు రాబోయే పండుగ సీజన్‌లు, ఎన్నికల సమయంలో కోవిడ్ పరిస్థితికి సంబంధించిన అవాంఛనీయ పరిస్థితి తలెత్తిన సమయంలో మార్గదర్శకాల అమలులో పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.
6. ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా స్థాయిలో జిల్లా మేజిస్ట్రేట్, కమిషన్ జారీ చేసిన ఈ కోవిడ్ మార్గదర్శకాలను పరిస్థితికి తగినట్టుగా రూపొందించడం , పర్యవేక్షించడం మరియు అమలు చేయడం కోసం ప్రాథమికంగా బాధ్యత వహిస్తారు.
7. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రచారకర్తలు, ఓటర్లు మరియు ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైన అన్ని వర్గాలు ప్రజారోగ్యం / భద్రత తమ ప్రధాన కర్తవ్యంగా భావించి కోవిడ్ అనుగుణ ప్రవర్తనను పాటించాలి.
8. మార్గదర్శకాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
I. ఎన్నికల ప్రక్రియ సమయంలో ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన సాధారణ మార్గదర్శకాలు
i) ఎన్నికల సంబంధిత కార్యకలాపాల సమయంలో పాల్గొన్న వ్యక్తులందరూ కోవిడ్ అనుగుణ ప్రవర్తన అనుసరించాలని సూచించడం జరిగింది.
ii) అర్హత గల పోలింగ్ సిబ్బంది/సెక్యూరిటీ సిబ్బంది/కౌంటింగ్ సిబ్బంది ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో నియమించే ముందు /పని ప్రారంభించే ముందు పూర్తిగా మరియు ప్రాధాన్యంగా బూస్టర్ మోతాదు టీకాలు వేయాలి.
iii) స్వీయ పర్యవేక్షణ తో సహా కోవిడ్ అనుగుణం ప్రవర్తనపై ప్రజల్లో అవగాహన కల్పించాలి.
II. రాజకీయ పార్టీలు/పోటీ చేసే అభ్యర్థులు/ఇతరుల ప్రచారం
i) అవుట్‌డోర్ మీటింగ్/ఇండోర్ మీటింగ్‌లు/ర్యాలీలు/రోడ్ షోలు/పాద యాత్రలు / ఊరేగింపు సమయంలో, నిర్వాహకులు మరియు సంబంధిత రాజకీయ పార్టీ అధికారం కలిగిన అధికారులు జారీ చేసే మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తులు సూచించిన కోవిడ్ అనుగుణ ప్రవర్తనను పాటించాలి. కోవిడ్ సంబంధిత నిబంధనలు మరియు మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే నిర్వాహకులు బాధ్యత వహించాలి.
ii) రాజకీయ పార్టీలు/అభ్యర్థులు తమ సమావేశాలు మరియు ప్రదర్శనలు , రోడ్ షో, పాదయాత్ర మరియు ఊరేగింపు, ఇంటింటికి ప్రచారం మొదలైనవాటిని సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుని ఈ విషయంలో ఎన్నికల సంఘం జారీచేసే సూచనలకు లోబడి నిర్వహించవచ్చు.
iii) ఇప్పటికే కమిషన్ సూచించిన పద్ధతిలో సువిధ యాప్‌ని ఉపయోగించి పబ్లిక్ స్థలాల కేటాయింపు చేయాలి.
III .) పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు-
(i) ప్రతి పోలింగ్ కేంద్రంలో కల్పించవలసిన కనీస సౌకర్యాలపై ఎన్నికల సంఘం ఇప్పటికే వివరణాత్మక సూచనలను జారీ చేసింది. కోవిడ్‌ని దృష్టిలో ఉంచుకుని, అవసరమైన విధంగా కింది అదనపు సౌకర్యాలు/చర్యలు తీసుకోవచ్చు:
(ఎ) క్యూ లో వేచి ఉండకుండా చూసేందుకు ముందు వచ్చిన ఓటర్ కి ముందుగా టోకెన్ పంపిణీ చేయడానికి హెల్ప్ డెస్క్.
(బి) క్యూ కోసం సామాజిక దూరాన్ని ప్రదర్శించడానికి గుర్తులు .
(సి) కోవిడ్ నిబంధనల ప్రకారం సంబంధిత అధికారి జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం,స్థల లభ్యతను బట్టి క్యూలో నిలబడిన ఓటర్ల మధ్య సామాజిక దూరం నిర్వహించబడుతుంది. పురుషులు, స్త్రీలు మరియు వికలాంగులు/ సీనియర్ సిటిజన్ ఓటర్ల కోసం ఒక్కొక్కటి మూడు క్యూలు ఉంటాయి.
(డి) సంబంధిత అధికారి సూచించిన సామాజిక దూర నిబంధనలను పర్యవేక్షించడానికి మరియు నియంత్రించడానికి బిఎల్ఓ,వాలంటీర్లు మొదలైన వారి సేవలు ఉపయోగించవచ్చు.
(ఇ) పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలో మగ మరియు ఆడవారికి వేర్వేరుగా కుర్చీలు, డేరాలు మొదలైనవాటితో వెయిటింగ్ ఏరియా ఏర్పాటు చేయాలి. తద్వారా ఓటర్లు భద్రతాపరమైన సమస్యలు లేకుండా ఓటింగ్‌లో పాల్గొనవచ్చు.
(ఎఫ్) సాధ్యమైన చోట, బూత్ యాప్‌ను పోలింగ్ స్టేషన్‌లో ఉపయోగించవచ్చు.
(జి) కోవిడ్‌పై అవగాహన పోస్టర్‌లను సమర్థ అధికారం సూచించిన నిబంధనల ప్రకారం కనిపించే ప్రదేశాలలో ప్రదర్శించాలి.
(ii) కోవిడ్ -19 సంబంధిత నివారణ చర్యలను ఖచ్చితంగా పాటిస్తూ, ఆరోగ్య అధికారుల పర్యవేక్షణలో, కోవిడ్ పేషెంట్లు మరియు క్వారంటైన్‌లో ఉన్న ఇతర వ్యక్తులందరూ పోలింగ్ రోజు చివరి గంటలో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి అనుమతించబడతారు. సెక్టార్ మేజిస్ట్రేట్‌లు తమకు కేటాయించిన పోలింగ్కేంద్రాల్లో ఈ కార్యాచరణను సమన్వయం చేస్తారు.
IV ) పోస్టల్ బ్యాలెట్
కోవిడ్ పాజిటివ్/అనుమానిత మరియు క్వారంటైన్‌లో ఉన్న (ఇల్లు/సంస్థాగత) ఓటర్లకు కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఎంపిక కల్పించబడింది.
వి .) ఓట్ల లెక్కింపు
(i) 30 ఏప్రిల్ 2014 నాటి కమిషన్ ప్రస్తుత సూచనల ప్రకారం ఒక నియోజకవర్గం యొక్క ఓట్ల లెక్కింపు కోసం గరిష్టంగా 15 కౌంటింగ్ టేబుల్‌లు (ఆర్వో టేబుల్‌తో సహా) ఉండాలి .
(ii) కౌంటింగ్ ప్రక్రియలో జరుగుతున్న సమయంలో కౌంటింగ్ వేదిక వెలుపల ప్రజలు గుమి కూడదానికి అనుమతించరాదు.
(iii) కోవిడ్ నివేదిక సానుకూలంగా ఉన్నట్లయితే అభ్యర్థి కౌంటింగ్ ఏజెంట్లను నియమించవచ్చు/మరొకరిని నియమించవచ్చు.
9. కోవిడ్ మార్గదర్శకాల్లో పొందుపరచని అంశాలు ఏర్పడినప్పుడు ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎన్నికల సమయంలో ఎదురైనప్పుడు సంబంధిత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదరు అంశాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు రావాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం తదుపరి తగిన సూచనలను జారీ చేసి కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడంలో/ నిర్వహించడంలో రాష్ట్రం అమలు చేస్తున్న సూచనలు/ ప్రయత్నాల అమలుకు సహకరిస్తుంది.
***
(Release ID: 1867992)
Visitor Counter : 301