మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

‘పోషణ్ మాహ్’లో దేశవ్యాప్తంగా 15కోట్లకు పైగా కార్యక్రమాలు!


వివిధ ఇతివృత్తాల కింద కార్యక్రమాల నిర్వహణ..
రక్తహీనత నిర్ధారణ, ఆరోగ్యంపై అవగాహనతోపాటుగా
‘మహిళ-ఆరోగ్యం’ కార్యక్రమాలదే కీలకపాత్ర..

ముందస్తు బాల్య సంరక్షణ, విద్యా, పోషణపై దృష్టిని

కేంద్రీకరిస్తూ దాదాపు 81లక్షల కార్యకలాపాలు...

లింగ ప్రాతిపదికన నీటి నిర్వహణ,
నీటి పరిరక్షణ ఇతివృత్తంతో
43 లక్షల కార్యకలాపాల నిర్వహణ...

‘స్వస్థ బాలక స్పర్థ’ పేరిట యు.పి., మహారాష్ట్ర, ఎం.పి., అస్సాం రాష్ట్రాల్లో విజయవంతంగా
ప్రయోగాత్మక కార్యక్రమాలు...


ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ‘పోషణ్ ఉత్సవ్‌’తో ఐదవ ఐదవ రాష్ట్రీయ పోషణ్ మాహ్ ముగింపు...

సెప్టెంబరు 30నుంచి అక్టోబరు 2వరకూ జరిగిన
‘పోషణ్ ఉత్సవ్‌’కు లక్షన్నర మందికి పైగా హాజరు..

Posted On: 12 OCT 2022 4:30PM by PIB Hyderabad

సుపోషిత భారత్ కోసం ప్రధానమంత్రి కన్న కలలను సాకారంచేసే కార్యక్రమంలో భాగంగా 5వ రాష్ట్రీయ పోషణ మాసం (పోషణ్ మాహ్)-2022 కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1 నుంచి, 30 తేదీ వరకూ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ఇతివృత్తాల క్రింద 15 కోట్లకు పైగా కార్యకలాపాలను చేపట్టారు. ఐదవ పోషణ్ మాహ్‌కు ముందుగా, అంటే.. ఈ పథకం మొదలైనప్పటినుంచి, నాలుగు పోషణ్ మాహ్‌లను, 4 పోషణ్ పఖ్వాడాలను 40 కోట్ల కంటే ఎక్కువమంది సామూహిక కార్యాచరణతో నిర్వహించారు.

   ఈ సంవత్సరం, పోషణ మాహ్ నిర్వహణ సందర్భంగా గ్రామ పంచాయతీలు కేంద్ర బిందువులుగా అన్ని కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహం ఇచ్చారు. ఇది అట్టడుగు క్షేత్రస్థాయిలో వివిధ కమిటీలను సమీకరించటానికి ఇది దోహదపడింది. క్షేత్రస్థాయిలో అంటే గ్రామ ఆరోగ్య, పారిశుద్ధ్య, పోషకాహార కమిటీ (వి.హెచ్.ఎస్.ఎన్.సి.), పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్.ఎం.సి.)/ విద్యా కమిటీలను సమీకరించేందుకు ఇది దోహదపడింది. నీరు-పర్యావరణ పరిరక్షణా కమిటీ,  ప్రణాళిక-అభివృద్ధి కమిటీ, సామాజిక న్యాయ స్థాయీ సంఘం వంటి వాటిని సమీకరించేందుకు కూడా ఇది ఉపయోగపడింది. అన్ని కార్యకలాపాలకు పోషణ పంచాయితీలను కేంద్రాలుగా పరిగణిస్తూ, 2022వ సంవత్సరపు పోషణ్ మాహ్ కోసం ఈ కింది అంశాలను ఇతివృత్తాలుగా చేపట్టారు. మహిళా- ఆరోగ్యం, పిల్లలు-విద్య, లింగ ప్రాతిపదికన నీటి వినియోగ నిర్వహణ, మహిళలు-పిల్లలకు సాంప్రదాయ ఆహారం వంటి ఇతివృత్తాలను చేపట్టారు.

      

https://ci4.googleusercontent.com/proxy/q703w5ZoTCd-dp4EYaFSC5vEICX_U83vB4pkUvbOswgognOEzomHwORZ27cgc3Aeqhg_tf8qWOammWPTrCm-4XYMX0IPAi5lgUOaFceMBH9r4gX1LZjkyMVGDQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FGQY.jpg

  'మహిళ-ఆరోగ్యం' పేరుతో దేశవ్యాప్తంగా పలు రకాల కార్యకలాపాలను ప్రముఖంగా నిర్వహించారు.  రక్తహీనత నిర్ధారణ పరీక్ష- అవగాహన ప్రచార కార్యక్రమాలు (సుమారు 32 లక్షల కార్యకలాపాలు), ప్రసవానికి ముందస్తు పరీక్షా శిబిరాలు (సుమారు 11 లక్షలు), బహిష్టు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు (సుమారు 7లక్షలు), చేతుల పరిశుభ్రత-పారిశుద్ధ్య కార్యక్రమాలు (సుమారు 41 లక్షలు) ఈ సందర్భంగా నిర్వహించారు.

https://ci5.googleusercontent.com/proxy/x0MmYUBnYKTELhI9klChTT0fCOCNitUADbenWnpESmAE_KvKhwoY1mkby9-FsTmkKkdbknBA1Gab-oYlFAylg-VxdpL1Ph1TxliiLqHrQ0ge13kt0rmsIbsEKw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002V8QS.pnghttps://ci6.googleusercontent.com/proxy/mY2LDowP5QbxFixqF80UvvsCHnqiouQEKin_lNu2WkH4jl9KNScDn58JFEdgmmh4RVB3VWgDj0z1EMbzmzkY66w8g_sK9erMdlZAOdn2EzNGldaSMX-aX9PLow=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003PT76.png

https://ci5.googleusercontent.com/proxy/tfdUYLY1lgwB0C3BizAghuWkYkB1X6wwWIXCB7-VmkFNf_LCmh6uqxOGguWL2we261x1Bau3aGRrCWB-o8tC3xcvcqbig01YWpliYVs7vz3H7iEZsdEHJ-x_pw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005QWY0.jpghttps://ci3.googleusercontent.com/proxy/tm2MEzopyn9RstqbvTSCCOxAv3ZH-BrplMqMF1SGtsIqAVUEgdiqsaIRhwvKwJVxnNtG0XdJo_xhzNsIna2Ftjm4vQKXbRuQdnBCge7w4rPduh34h1TLyAH7HA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004L1ZT.jpg

   ఆరేళ్ల కంటే తక్కువ వయస్సుగల బాలలకు నాణ్యమైన ప్రీ-స్కూల్ విద్యను అందించడంపై  దృష్టిని కేంద్రీకరిస్తూ -బచ్చా ఔర్ శిక్షా-పోషణ్ భీ, పఢాయ్ భీ- పథకం కింద చేపట్టిన కార్యకలాపాలు కూడా  పోషణ్ మాహ్-2022లో ఊపందుకున్నాయి. ఈ ఇతివృత్తం కింద దాదాపు 81 లక్షల వరకూ కార్యకలాపాలను చేపట్టారు. ఈ కార్యకలాపాల్లో మందస్తు బాల్యదశలో సంరక్షణ, విద్య వంటి అంశాలపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించారు. దీనికి తోడుగా, ప్రారంభ దశలో అభ్యాసం, అధ్యయనానికి, స్వదేశీ, స్థానిక ఆటబొమ్మల అభివృద్ధి, వాటి సహాయంతో బాలలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో చదవు నేర్పడం వంటి కార్యకలాపాలను దేశవ్యాప్తంగా ప్రోత్సహించారు. ముందస్తు బాల్యదశలో స్వదేశీ ఆటబొమ్మల సహాయంతో అభ్యున్నతి కార్యకలాపాలకు ప్రోత్సాహం అన్న అంశంపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి అధ్యక్షతన ఢిల్లీలో జాతీయ స్థాయి సదస్సును నిర్వహించారు.  అంగన్‌వాడీ కార్యకర్తలనుంచి సహాయకుల వరకు సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం (ఐ.సి.డి.ఎస్.) కార్యనిర్వాహకులందరి ప్రయోజనం కోసం సదస్సును యూట్యూబ్ ద్వారా  ప్రత్యక్ష ప్రసారం చేశారు.  వయస్సుకు అనుగుణమైన రీతిలో బొమ్మలు, బొమ్మలద్వారా అధ్యయాన్ని అందరికీ వర్తింపజేయడం తదితర అంశాలపై ఈ సదస్సులో నిపుణులచేత ప్యానెల్ చర్చలను నిర్వహించారు.  స్వదేశీ తయారీ బొమ్మల సృష్టిపై మాస్టర్ క్రాఫ్ట్ నిపుణులతో ప్రత్యక్ష ప్రదర్శన, స్థానిక ఆటబొమ్మల సృష్టిపై దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలతో కార్యక్రమాలను ఈ సదస్సులో భాగంగా నిర్వహించారు.

https://ci3.googleusercontent.com/proxy/57EgA2xPfWlFiZnLKicXFpSZ5I5HCjKtVSMgn_hhar1_izcUw45K4fiZrwmdfDUXzsYQBmDDhVltNz6vQrio9ierLSRWhsGpXghBHY_Kage-1u4_SNj3H9scDg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0067TFH.jpg

  ఇంకా, పలు ఇతివృత్తాలకు అనుగుణంగా అనేక రాష్ట్రాలు ఎన్నో కార్యకలాపాలను నిర్వహించాయి. ఆటబొమ్మలపై మణిపూర్‌లో స్టేట్ టోయాథాన్/టాయ్ ఫెయిర్, గుజరాత్‌లోని అంగన్ వాడీ కేంద్రాల్లో బాలల బొమ్మలు/ ప్లే-అధ్యయన ప్రదర్శన, జార్ఖండ్‌లోని అంగన్ వాడీ కేంద్రాల్లో స్థానిక బొమ్మల తయారీపై చర్చాగోష్టులు, బొమ్మల తయారీ, ఒడిశాలోని అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలు-తల్లులతో బొమ్మల తయారీ తదితర కార్యకలాపాలను చేపట్టారు.

   ఇంకా, నీటి సంరక్షణ, నీటి వినియోగ నిర్వహణపై లింగ ప్రాతిపదికన అవగాహన కార్యక్రమాలను, గిరిజన ప్రాంతాలలో సాంప్రదాయ ఆహారాలపై దృష్టి కేంద్రీకరణ అనే ఇతివృత్తాలతో పోషణ్ పఖ్వాడా-2022కింద చేపట్టిన కార్యకలాపాలు జయప్రదం కావడంతో కీలకమైన ఇవే ఇతివృత్తాలతో పోషణ్ మాహ్ 2022లో కార్యకలాపాలను కొనసాగించారు. లింగ ప్రాతిపదికన వర్షపునీటి సంరక్షణా నిర్మాణాలను ఏర్పాటు చేయడానికి చర్చాగోష్టులు, సదస్సులు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను చేపట్టేందుకు తగిన అంగన్ వాడీ కేంద్రాలను గుర్తించేందుకు చర్చాగోష్టులు, సదస్సులు నిర్వహణకోసం దాదాపు 43 లక్షల కార్యకలాపాలను నిర్వహించారు.

 స్వస్థ బాలక్ స్పర్ధ పేరిట ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అస్సాం వంటి నాలుగు రాష్ట్రాలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు ఎంతో విజయవంతమయ్యాయి.  సరైన ఆరోగ్య, పోషకాహార స్థితి కోసం పిల్లలు, కుటుంబాల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించడం ద్వారా 'ఆరోగ్యకరమైన బిడ్డ'ను గుర్తించడమ స్వస్థ బాలక్ స్పర్ధ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఐదు సంవత్సరాలలోపు పిల్లల ఎదుగుదలపై మధింపునకు సంబంధించి ఈ ఉధృతస్థాయిలో  కార్యకలాపాలు నిర్వహించారు. విజేతలను సత్కరించేందుకు, ధ్రువీకరణ పత్రాలు అందించడం ద్వారా విజేతలైన పిల్లలను, తల్లిదండ్రులను గుర్తించేందుకు ఈ కార్యకలాపాలు నిర్వహించారు. వారికి  పోషకాహార కిట్/పారిశుద్ధ్య కిట్, స్థానికంగా లభించే స్వదేశీ బొమ్మలు, వాటర్ బాటిల్ మొదలైన వాటిని బహుమతులుగా ప్రదానం చేశారు. మొత్తం 4 రాష్ట్రాల్లో బహుమతుల పంపిణీ జరిగింది.

  ఐదవ రాష్ట్రీయ పోషణ్ మాహ్ ముగింపును పురస్కరించుకుని, 2022 సెప్టెంబర్ 30వ తేదీనుంచి అక్టోబర్ 2వరకూ న్యూ ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో పోషణ్ ఉత్సవ్‌ కార్యక్రమం నిర్వహించారు.  సరైన పోషకాహారానికి ఉన్న ప్రాముఖ్యతపై ప్రజలకు, ప్రత్యేకించి చిన్న పిల్లలకు కీలకమైన సందేశాలను అందించేందుకు ఈ పోషణ్ ఉత్సవ్ కార్యక్రమం ఒక చక్కని వేదికగా ఉపయోగపడింది.  దేశంలో పోషకాహార లోపంతో తలెత్తే సవాళ్లను పరిష్కరించడానికి వీలుగా వయస్సుకు తగిన ఆరోగ్య పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఇది దోహదపడింది.

   పోషణ లేదా పౌష్టికాహారం అనే ఇతివృత్తం మీద కేంద్రీకృతమైన పోషణ పరేడ్‌లు, ఆరోగ్యకరమైన-ఆహార ప్రదర్శన శాలలు, ఆరోగ్య పరీక్షల కేంద్రాలు మొదలైన వాటిపై సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పౌష్టికాహారం అనే అంశంపై పిల్లలను, దేశ ప్రజలను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. పోషణ్ ఉత్సవ్‌లో భాగంగా, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పలు ప్రదర్శన శాలలను నిర్వహించింది. ఆయుష్ పోషకాహార పద్ధతులు, ఆయుర్వేద ఉత్పత్తులపై/వివిధ ఔషధాలపై పుస్తక ప్రదర్శన శాలలను, విక్రయకేంద్రాలను ఆ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఉచిత ఆరోగ్య పరీక్షల కోసం ప్రత్యేక కేంద్రాలను కూడా పోషణ్ ఉత్సవ్‌లో అందుబాటులో ఉంచారు.  అతిథుల శారీరక ద్రవ్య పరిమాణ సూచిక (బి.ఎం.ఐ.)ను సరిచూసే యంత్రాలను కూడా ఇందులో ప్రదర్శించారు. . అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లల ప్రారంభ అభ్యాసం, అభివృద్ధికి దేశీయ బొమ్మలు ప్రధాన సాధనాలు కాబట్టి, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 9 స్థానిక సాంప్రదాయ బొమ్మల సమూహాలకు చెందిన దేశీయ బొమ్మలతో పలు ప్రదర్శన శాలలను ఏర్పాటు చేశారు,  ఏటికొప్పాక (ఆంధ్రప్రదేశ్), కొండపల్లి ( ఆంధ్రప్రదేశ్), చిత్రకూట్ (ఉత్తరప్రదేశ్), వారణాసి (ఉత్తరప్రదేశ్), కత్పుట్లీ హస్తకళలు (రాజస్థాన్), మైసూర్ (కర్ణాటక), మంగళూరు (కర్ణాటక), చన్నపట్టణ (కర్ణాటక), ఇండోర్ (మధ్యప్రదేశ్)  బొమ్మలను ఈ స్టాళ్లలో  ప్రదర్శించారు.

https://ci3.googleusercontent.com/proxy/wiMlF98tKK5kmAXzIXpJunzUJvNO6dBN-LudZ1aITqu1SLjuDow_i5ViyjFCBguSe_XGV7LLf6mTjllFNHn86Mo9Ke4YW3gM1p95MKlj35gaIbu0ounZPpxiiw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0070I59.jpg

  ప్రజలను, పిల్లలను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి, ప్రధానమంత్రి చిత్రంతో ఫోటో తీసుకోవడానికి వీలుగా ఎ.ఆర్. ఫోటో-బూత్‌ను ఈ ఉత్సవ్‌లో ఏర్పాటు చేశారు. సందర్శకులను ఇది విశేషంగా ఆకట్టుకుంది. పోషణ్ ఉత్సవ్ జరిగిన 3 రోజుల్లో దాదాపు లక్షా 50వేలమంది నుంచి 2 లక్షల మంది వరకూ సందర్శకులు పాల్గొన్నారని అంచనా.

   ప్రజల్లో అవగాహన లక్ష్యంగా కొన్ని సంవత్సరాల తరబడి నిర్వహించిన జనోద్యమ కార్యక్రమాలు,, ఆరోగ్యం-పోషణపై స్త్రీలు, పిల్లలు, యుక్తవయస్కులు దృష్టి సారించేందుకు దోహదపడ్డాయి. ఆరోగ్యం, పోషకాహారంపై  ప్రజల ఆలోచనా విధానలలో ముఖ్యమైన మార్పును తీసుకురావడంలో పోషణ్ మాహ్ ప్రభావవంతంగా పనిచేసింది. పురుషులు, మహిళలు (బాలురు మరియు బాలికలు) సమాన భాగస్వామ్యంతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

   పౌష్టికాహార ప్రాధాన్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో 2018వ సంవత్సరం మార్చి 8న గౌరవనీయ ప్రధానమంత్రి ఈ పోషణ్ అభియాన్ పథకానికి శ్రీకారం చుట్టారు.  పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం ఈ  కార్యక్రమాన్ని రూపొందించింది.

    జనోద్యమాలు, అవగాహనా కార్యక్రమాల ద్వారా, జనంలో పోషకాహార ఆధారిత మార్పులను తీసుకురావాలన్న లక్ష్యాన్నిఈ కార్యక్రమం నిర్దేశించుకుంది.  గౌరవనీయులైన ప్రధాన మంత్రి కలలు గన్న సుపోషిత్ భారత్ అనే దార్శనికతను సాకారం చేసేందుకు ఇది దోహదం చేస్తుంది.

 

   15వ ఆర్థిక సంఘం కాలానికి, పోషణ్ అభియాన్‌ పథకంతో పాటు అంగన్‌వాడీ సేవల పథకం (ఎ.డబ్ల్యు.ఎస్.), కౌమార బాలికల పథకం (ఎస్.ఎ.జి.)  వంటి కార్యక్రమాలను సమీకృత పోషకాహార సహాయ కార్యక్రమంలో భాగంగా  చేపడుతున్నారు. సక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 పేరిట వీటిని నిర్వహిస్తున్నారు.

 పోషణ్ అభియాన్ పథకం కింద, పోషణ్ మాహ్, పోషణ్ పఖ్వాడా రూపంలో సంవత్సరానికి రెండుసార్లు  పౌష్టికాహార-కేంద్రీకృత కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నారు. పౌష్టికాహార ప్రాధాన్యంపై ఆశించిన పరివర్తనను ప్రజల్లో తీసుకురావడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయని  భావిస్తున్నారు.

****



(Release ID: 1867299) Visitor Counter : 151


Read this release in: English , Urdu , Hindi