రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
19వ డివిడెండ్ చెల్లించిన మినీరత్న-II కంపెనీ ఎఫ్‌సీఐ ఆరావళి జిప్సమ్ & మినరల్స్ ఇండియా లిమిటెడ్
Posted On:
11 OCT 2022 12:22PM by PIB Hyderabad
రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్‌సీఐ ఆరావళి జిప్సమ్ & మినరల్స్ ఇండియా లిమిటెడ్, ప్రభుత్వానికి రూ.12,55,00,000/- (రూపాయలుపన్నెండు కోట్ల యాభై ఐదు లక్షలు మాత్రమే) డివిడెండ్‌ను చెల్లించింది. సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ అమర్ సింగ్ రాథోడ్ కేంద్ర రసాయన, ఎరువుల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాకు డివిడెండ్ చెక్‌ను అందజేశారు. ఎరువుల శాఖ కార్యదర్శి శ్రీ అరుణ్ సింఘాల్ సమక్షంలో. ఈ చెక్‌ను అందజేశారు. కంపెనీ సాధించిన ఫలితాలు, వృద్ధిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. రాబోయే సంవత్సరాల్లో కంపెనీ విపరీతంగా వృద్ధి చెందుతుందని.. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని అన్నారు. అధిక డివిడెండ్‌లతో సంస్థ దేశ ఆర్థకవృద్ధిలో మేటిగా పాలుపంచుకోగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మే 2022లో కంపెనీకి ప్రైవేట్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీగా నోటిఫై చేయబడిందని సీఎండీ తెలియజేశారు. కంపెనీ సమీప భవిష్యత్తులో ముడిఫాస్ఫేట్ మరియు డోలమైట్ మైనింగ్‌లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. అంతేకాక రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో ఎరువుల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కూడా కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎఫ్‌సీఐ ఆరావళి జిప్సమ్ మరియు మినరల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ (ఎఫ్ఏజీఎంఐఎల్) 14.02.2003న జోధ్‌పూర్ మైనింగ్ ఆర్గనైజేషన్ (మెస్సర్స్ ఎఫ్‌సీఐఎల్ యొక్క ఒక యూనిట్) నుండి బయటకు వచ్చిన తర్వాత స్థాపించబడింది. కంపెనీ గత 18 సంవత్సరాలుగా డివిడెండ్‌ను నిరంతరాయంగా చెల్లిస్తోంది.
***
(Release ID: 1866945)