భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

ఇంటాస్ ఫార్మాస్యూటిక‌ల్ లిమిటెడ్ (ఇంటాస్‌)లో ఈక్విటీ వాటాల‌ను కాంపిటీష‌న్ చ‌ట్టం, 2002లోని సెక్ష‌న్ 31 (1) కింద ప్లాటిన‌మ్ జాస్మిన్ ఎ 2018 ట్ర‌స్ట్ (ప్లాటిన‌మ్ ఔల్‌) కొనుగోలు చేసేందుకు క‌మిష‌న్ ఆమోదం

Posted On: 10 OCT 2022 5:57PM by PIB Hyderabad

ప్ర‌తిపాదిత లావాదేవీలో  ఇంటాస్‌కు చెందిన 3శాతం ఈక్విటీ వాటాల‌ను (అత్యుత్త‌మ వాటా ప్రాతిపాదిక‌న‌) (ప్ర‌తిపాదిత ఏకీక‌ర‌ణ‌) ప్లాటిన‌మ్ ఔట్ ఔల్ కొనుగోలు చేసే సెకెండ‌రీ అక్విసిష‌న్ (అనుషంగిక కొనుగోలు) ఉంటుంది. 

ప్లాటిన‌మ్ ఔల్‌

ప్లాటిన‌మ్ ఔల్ అనేది అబుధాబీ గ్లోబ‌ల్ మార్కెట్‌లో (ఎబిడిజిఎం) విలీన‌మైన ప‌రిమిత ప‌రిధి క‌లిగిన (ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది ప్లాటిన‌మ్ జాస్మిన్ ఎ 2018 ట్ర‌స్టుకు ధ‌ర్మ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీనిని 27 జ‌న‌వ‌రి 2019లో సెటిల్‌మెంట్ డీడ్ ద్వారా ఎడిజిఎం చ‌ట్టాల కింద స్థాపించారు.  ప్లాటిన‌మ్ జాస్మిన్ ఎ 2018 ట్ర‌స్టుకు ఏకైక ల‌బ్ధిదారు అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఎడిఐఎ).  ఎడిఐఎ అన్న‌ది ఎమిరేట్ ఆఫ్ అబుధాబి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స్వ‌తంత్ర పెట్టుబ‌డి సంస్థ.

ఇంటాస్‌

ఫార్మాస్యూటిక‌ల్ ఫార్ములేష‌న్స్ (ఔష‌ధ సూత్రీక‌ర‌ణ‌ల ) అభివృద్ధి, ఉత్ప‌త్తి, మార్కెటింగ్‌లో నిమ‌గ్న‌మైన ప‌బ్లిక్ కంపెనీ ఇంటాస్‌. ఇది ఇంటాస్ గ్రూప్‌కు అంతిమ మాతృ సంస్థ‌. ఇంటాస్ ఉత్ప‌త్తులు భార‌త‌దేశ వ్యాప్తంగా ఉనికిని క‌లిగి ఉండ‌ట‌మే కాక‌, భార‌త‌దేశంలో ఉన్న త‌న ఉత్ప‌త్తి సంస్థ‌ల నుంచి అంత‌ర్జాతీయంగా ప్ర‌త్యేక & జెన‌రిక్ ఔష‌ధాల‌ను ఎగుమ‌తి చేసే విస్త్ర‌త‌మైన పోర్ట్‌ఫోలియోను క‌లిగి ఉంది.  
క‌మిష‌న్ త్వ‌ర‌లోనే వివ‌ర‌ణాత్మ‌క ఉత్త‌ర్వుల‌ను జారీ చేయ‌నుంది. 

***


(Release ID: 1866715) Visitor Counter : 137


Read this release in: English , Urdu , Hindi