భారత పోటీ ప్రోత్సాహక సంఘం

కాంపిటీష‌న్ యాక్ట్‌, 2002లోని సెక్ష‌న్ 31 (1) కింద ఇండ్ఇన్‌ఫ్రావిట్ ట్ర‌స్టు (ఇండ్ఇన్‌ఫ్రావిట్) ఐదు ఎస్‌పివిల కొనుగోలును, ఇండ్ఇన్‌ఫ్రావిట్ యూనిట్ల‌ను సిపిపి ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ ప్రైవేట్ హోల్డింగ్స్ (4)ఐఎన్‌సి (సిపిహెచ్ఐ-4) కేటాయించేందుకు ఆమోదం తెలిపిన సిసిఐ

Posted On: 10 OCT 2022 5:58PM by PIB Hyderabad

ఇండిఇన్‌ఫ్రావిట్ ఐదు స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహికిల్స్ (ఎస్‌పివిలు- ప్ర‌త్యేక ప్ర‌యోజ‌న వాహ‌నాలు) కొనుగోలులో, ఎస్‌పివిల కొనుగోలుకు పాక్షిక నిధుల‌న‌ను అందించే ల‌క్ష్యంతో  ఇండిఇన్‌ఫ్రావిట్‌కు సంబంధించిన యూనిట్ల‌ను సిపిహెచ్ఐ-4కు కేటాయింపు ల‌తో కూడిన ప్ర‌తిపాదిత క‌ల‌యిక‌లో 100% ఈక్విటీ & కంప‌ల్స‌రీ క‌న్వ‌ర్టిబుల్ డిబెంచ‌ర్స్ (సిసిడి -  త‌ప్ప‌నిస‌రి ప‌రివ‌ర్త‌నీయ రుణ‌ప‌త్రాలు) కొనుగోలు ఉంటాయి. 
ఇండ్ఇన్‌ఫ్రావిట్‌ను 7 మార్చి 2018న ఇండియ‌న్ ట్ర‌స్ట్స్ యాక్ట్ (భార‌తీయ ధ‌ర్మ‌నిధుల చ‌ట్టం)1882 కింద ఒక తిరుగులేని ట్ర‌స్ట్‌గా స్థాపించారు. భార‌త‌దేశంలో ర‌హ‌దారుల మౌలిక స‌దుపాయాల సంప‌ద‌/  ఆస్తుల‌లో పెట్టుబ‌డి పెట్టేందుకు వీలుగా దానిని  సెబి (మౌలిక స‌దుపాయాల పెట్టుబ‌డుల ట్ర‌స్ట్స్‌)  నిబంధ‌న‌లు, 2014 (స‌వ‌రించ‌బ‌డిన‌ట్టుగా)  (ఐఎన్‌వి ఐటి నిబంధ‌న‌ల‌) కింద మౌలిక స‌దుపాయాల పెట్టుబ‌డుల ట్ర‌స్టుగా న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం దానికి ఆరు రాష్ట్రాల‌లో 5,000 లేన్ కిమీల విస్త‌రించిన నెట్‌వ‌ర్క్‌తో కూడిన 13 రోడ్ అసెట్లు దాని పోర్ట్‌ఫోలియో ఉంది. ఇండ్ఇన్‌ఫ్రావిట్ ప్రారంభ ఆస్తుల పోర్ట్‌ఫోలియోలో రాజ‌స్థాన్‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, తెలంగాణ స‌హా ఐదు రాష్ట్రాల్లోని ఐదు టోల్ రోడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. త‌ద‌నంత‌రం, ఇండ్ఇన్‌ఫ్రావిట్ మ‌రొక ఎనిమిది రోడ్డు ఆస్తుల‌ను రాజ‌స్థాన్‌, క‌ర్ణాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌ల‌లో జోడించుకుంది. ఈ ఎనిమిది ప్రాజెక్టుల‌లో, ఆరు ఆస్తులు జాతీయ ర‌హ‌దారుల (ఎన్‌హెచ్ఎఐ) ప్రాజెక్టులు కాగా, మ‌రొక రెండు రాష్ట్ర ప్రాజెక్టులు. ఈ టోల్ రోడ్లు  ఎన్‌హెచ్ఎఐ అధికారులు మంజూరు చేసిన రాయితీల‌కు అనుగుణంగా నిర్వ‌హిస్తారు. 
సిపిహెచ్ఐ-4 అనేది కెనెడాకు చెందిన కార్పొరేష‌న్‌, విస్త్ర‌త‌మైన ఆస్తుల పోర్ట్‌ఫోలియోలో పెట్టుబ‌డులు పెట్టే  ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ కంపెనీ. కెనెడా పెన్ష‌న్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (సిపిపిఐబి) అన్న‌ది పెట్టుబ‌డి నిర్వ‌హ‌ణ సంస్థ‌. ఇది 21 మిలియ‌న్ల కంట్రిబ్యూట‌ర్లు, ల‌బ్ధిదారుల త‌రుఫున  వ‌ర్త‌మాన ప్ర‌యోజ‌నాల‌కు చెల్లించే సిపిపి నిధికి అవ‌స‌ర‌మైన నిధుల‌ను త‌న‌కు బ‌ద‌లాయించే కెనెడా పెన్ష‌న్ ప్లాన్ (సిపిపి నిధి) త‌రుఫున పెట్టుబ‌డుల‌ను పెట్టే సంస్థ‌. విస్త్ర‌త‌మైన ఆస్తుల‌తో కూడిన పోర్ట్‌ఫోలియోను నిర్మించేందుకు సిపిపిఐబి ప‌బ్లిక్ ఈక్విటీలు, ప్రైవేటు ఈక్విటీలు, రియ‌ల్ ఎస్టేట్‌, మౌలిక స‌దుపాయాలు, స్థిర ఆదాయ సాధ‌నాల‌లో పెట్టుబ‌డులు పెడుతుంది. 
ఐదు ల‌క్షిత ఎస్‌పివీలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌, బీహార్‌, మ‌హారాష్ట్ర రాష్ట్రాల జాతీయ ర‌హ‌దారుల నిర్వ‌హ‌ణ‌, కార్య‌క‌లాపాల‌లో నిమ‌గ్న‌మై ఉంటాయి.   
క‌మిష‌న్ జారీ చేసిన వివ‌ర‌ణాత్మ‌క ఉత్త‌ర్వులు త్వ‌ర‌లో వెలువ‌డ‌నున్నాయి. 

 

****



(Release ID: 1866713) Visitor Counter : 112


Read this release in: English , Urdu , Hindi