వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ప్రయోగశాలలలో ప్రమాణాలు, నాణ్యత, భద్రత మరియు సుస్థిరత విధానాలను అమలు
చేయడంలో సహకరించేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్, ఇన్స్పెక్షన్ మరియు సర్టిఫికేషన్‌తో ఎంఓయూపై సంతకం చేసింది
Posted On:
07 OCT 2022 3:30PM by PIB Hyderabad
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS), నేషనల్ స్టాండర్డ్స్ బాడీ ఆఫ్ ఇండియా టెస్టింగ్, ఇన్స్పెక్షన్, సర్టిఫికేషన్ కౌన్సిల్, ఇండియాతో ఎంఓయూపై సంతకం చేసింది.
ప్రయోగశాలలలో ప్రమాణాలు మరియు నాణ్యత, భద్రత మరియు సుస్థిరత పద్ధతుల అమలును ప్రోత్సహించడానికి మరియు సమన్వయం చేయడానికి రెండు సంస్థలు సహకరిస్తాయి. ప్రయోగశాలల కోసం ప్రతిస్పందనను మెరుగుపరచడానికి మరియు ప్రయోగశాలల రంగంలో ప్రపంచ అత్యుత్తమ పద్ధతులను మార్పిడి చేయడానికి మరియు వ్యాప్తి చేయడానికి మరింత కృషి చేయాలని సంస్థలు నిర్ణయించాయి. 2022 సెప్టెంబరు 29న ఎంఓయూపై సంతకం చేశారు. దీని తర్వాత, “ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రయోగశాలలలో ఎమర్జింగ్ గ్లోబల్ ట్రెండ్స్” అనే అంశంపై రెండు సంస్థలు సంయుక్తంగా 3వ నవంబర్ 2022న న్యూఢిల్లీలో సెమినార్‌ను నిర్వహిస్తున్నాయి.
బిఐఎస్ డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రమోద్ కుమార్ తివారీ మరియు టిఐసి కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ శ్రీమతి హనానే తైదీ సమక్షంలో ఎంఒయుపై సంతకాలు జరిగాయి. ఎంఓయూపై బిఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ లాబొరేటరీస్ శ్రీ రాజీవ్ శర్మ మరియు టిఐసి చైర్మన్ శ్రీ శశి భూషణ్ జోగాని సంతకాలు చేశారు.
రెండు సంస్థలూ కలిసి పరస్పరం సుసంపన్నమైన ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాయి. TIC కౌన్సిల్ (టెస్టింగ్, ఇన్స్పెక్షన్, సర్టిఫికేషన్ కౌన్సిల్) అనేది స్వతంత్ర థర్డ్-పార్టీ టెస్టింగ్, ఇన్స్పెక్షన్ మరియు సర్టిఫికేషన్ ఇండస్ట్రీ (TIC)కి ప్రాతినిధ్యం వహించే గ్లోబల్ ట్రేడ్ అసోసియేషన్.
***
(Release ID: 1866061)
Visitor Counter : 157