పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పరిశుద్ధ ఇంధన వనరుల భాగస్వామ్యంపై జరిగిన భారత అమెరికా మంత్రుల సంయుక్త ప్రకటన

Posted On: 07 OCT 2022 9:45PM by PIB Hyderabad

కాలుష్య రహిత ఇంధన వనరుల వినియోగాన్ని ఎక్కువ చేసి ఇంధన భద్రత కల్పించి క్లీన్ ఎనర్జీ వినియోగానికి అవసరమైన సౌకర్యాలను వేగవంతంగా కల్పించేందుకు కలిసి పనిచేయాలని   భారతదేశం, అమెరికా దేశాలు నిర్ణయించాయి. ఈ రోజు జరిగిన యూస్ -ఇండియా స్ట్రాటజిక్ క్లీన్ ఎనర్జీ పార్టనర్‌షిప్ (ఎస్ సి ఈ పి ) మంత్రుల స్థాయి సమావేశంలో భారత దేశ పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి, అమెరికా  ఇంధన కార్యదర్శి జెన్నిఫర్ గ్రాన్‌హోమ్ ఈ అంశం ప్రాధాన్యత గుర్తించి, ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 

యూస్ -ఇండియా స్ట్రాటజిక్ క్లీన్ ఎనర్జీ పార్టనర్‌షిప్ సంయుక్త ప్రకటన :

ప్రపంచ ఇంధన మార్కెట్లో నెలకొన్న అస్థిర పరిస్థితి , కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం నుంచి కోలుకుంటున్న సమయంలో  తరచూ ఎదురవుతున్న  వాతావరణ సంబంధిత సవాళ్ల నేపథ్యంలో   అవసరమైన సుస్థిర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలన్న అంశానికి అమెరికా మరియు భారతదేశం కట్టుబడి ఉన్నాయి. ఈ దిశలో చిత్తశుద్ధితో పనిచేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. తమ దేశాల పరిస్థితులకు అనుగుణంగా  పర్యావరణ పరిరక్షణ, పరిశుద్ధ ఇంధన వినియోగ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న అమెరికా మరియు భారతదేశం కర్బన ఉద్గారాలను తగ్గించి, వాతావరణ మార్పుల వల్ల కలుగుతున్న నష్ఠాలను నివారించి, పర్యావరణ పరిరక్షణ కోసం పరిశుద్ధ ఇంధన వనరుల వినియోగాన్ని ఎక్కువ చేయడానికి కృషి చేస్తున్నాయి. ప్రపంచ ఇంధన మార్కెట్లు, ఇంధన భద్రత, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు సాంకేతిక అంశాల మార్పిడి లాంటి అంశాలపై తరచు చర్చలు జరుపుతున్న అమెరికా మరియు భారతదేశం ఇంధన రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న సమస్యల పరిష్కారానికి యూస్ -ఇండియా స్ట్రాటజిక్ క్లీన్ ఎనర్జీ పార్టనర్‌షిప్ ద్వారా కృషి చేస్తున్నాయి. 

ఇంధన రంగంలో భాగస్వామ్యంపై రెండు దేశాల మధ్య కుదిరిన అవగాహన అంశాలు అమలు జరుగుతున్న తీరును రెండు దేశాల మంత్రులు సమావేశంలో చర్చించారు. గత కొన్ని సంవత్సరాలుగా ద్వైపాక్షిక ఇంధన వాణిజ్యంలో సాధించిన ప్రగతి పట్ల రెండు దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఇంధన రంగంలో ఇరు దేశాలకు చెందిన సంస్థల మధ్య కుదిరిన అవగాహన పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రులు దీనివల్ల ఇంధన రంగంలో పెట్టుబడులు పెరిగి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి జరుగుతుంది. 

ఇంధన మార్కెట్ల సమతుల్యత కోసం అవసరమైన ఇంధన వనరుల సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల నుంచి  ముడి చమురును విడుదల చేయాలన్న అమెరికా తీసుకున్న నిర్ణయానికి  భారతదేశం  మద్దతు ప్రకటించడం, పరిశుద్ధ ఇంధన వినియోగం అంశాలు కూడా మంత్రుల సమావేశంలో చర్చకు వచ్చాయి. 

వాతావరణం మరియు స్వచ్ఛమైన ఇంధన రంగంలో కుదిరిన అవగాహన ద్వారా అవసరమైన ఇంధన వనరులను అందుబాటులోకి తెచ్చి సుస్థిర ఆర్థిక పురోభివృద్ధికి,  ఇంధన పరివర్తనకు కృషి చేయాలని  మంత్రులు నిర్ణయించారు.  ప్రతిష్టాత్మకమైన జాతీయ వాతావరణం మరియు స్వచ్ఛమైన ఇంధన లక్ష్యాలను సాధించి సుస్థిర అభివృద్ధి సాధించేందుకు  అన్ని స్థాయిలలో సమిష్టి చర్య మరియు అమలు అవసరమని కూడా మంత్రులు గుర్తించారు. దేశాల వాతావరణం మరియు స్వచ్ఛమైన ఇంధన ఆశయాలను సాధించడంలో కీలకమైన భాగాలుగా అన్ని సంబంధిత వర్గాల  సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు మార్పిడి  కూడా సమావేశంలో ప్రముఖంగా చర్చకు వచ్చాయి. 

 అభివృద్ధి చెందుతున్న ఇంధనాలు మరియు సాంకేతికతలు మరియు విద్యుదీకరణ మరియు అంతిమ వినియోగ రంగాలలో కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు అమలు చేయాల్సిన అంశాలపై జరుగుతున్న చర్యల పురోగతిని రెండు దేశాల మంత్రులు  సమీక్షించారు. సంక్లిష్ట రంగాలపై చర్చలు జరిగాయి.   స్మార్ట్ గ్రిడ్‌లు మరియు ఇంధన నిల్వపై ఉమ్మడి పరిశోధన మరియు అభివృద్ధి,  కాలుష్య కారకాల విడుదల, యుటిలైజేషన్ మరియు స్టోరేజ్ (CCUS)  సాంకేతిక పరిజ్ఞానం మార్పిడిపై సహకారం,. యూస్-ఇండియా  పార్టనర్‌షిప్ టు అడ్వాన్స్ క్లీన్ ఎనర్జీ-రీసెర్చ్ (PACE-R) క్రింద చేపట్టేందుకు అవకాశం ఉన్న ఇతర కార్యక్రమాల వివరాలను మంత్రులకు అధికారులు వివరించారు. 

 స్థిరమైన, సరసమైన, విశ్వసనీయమైన, స్థితిస్థాపకమైన మరియు స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థలను గుర్తించి  ఇంధన రంగంలో పెట్టుబడులను సులభతరం చేయాల్సి ఉందని  మంత్రులు గుర్తించారు.

ఈ కింది అంశాలలో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి గల అవకాశాలు చర్చకు వచ్చాయి:

• స్మార్ట్ గ్రిడ్‌లు మరియు ఇంధన నిల్వ సౌకర్యాలు సహా విశ్వసనీయమైన, సరసమైన మరియు స్థితిస్థాపకంగా స్వచ్ఛమైన ఇంధన సరఫరా కోసం  పవర్ గ్రిడ్‌ను బలోపేతం చేయడం;
• లోడ్ నిర్వహణకు అనుగుణంగా  గ్రిడ్-ఇంటిగ్రేటెడ్ భవనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఇతర పంపిణీ చేయబడిన శక్తి వనరులను అంచనా వేయడం;
• 2030 నాటికి శిలాజ ఇంధనం ఆధారిత ఇంధన వనరుల ద్వారా  దాదాపు 50 శాతం సంచిత ఎలక్ట్రిక్ పవర్ స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలనే భారతదేశ లక్ష్యానికి సహకారం అందించి పునరుత్పాదక ఇంధన అభివృద్ధి 
• ఉపకరణాలు, భవనాలు మరియు పారిశ్రామిక రంగంలో శక్తి సామర్థ్యం మరియు పరిరక్షణకు ఆధునిక సౌకర్యాలు  అభివృద్ధి చేయడం;
• భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఫైనాన్సింగ్ సేవల సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రవాణా రంగాన్ని విద్యుదీకరించడం, పర్యావరణహిత  వ్యవస్థను అభివృద్ధి చేసి కర్బన ఉద్గారాలను తగ్గించడం 
• చమురు మరియు గ్యాస్ విలువ గొలుసు అంతా ఉద్గారాలను తగ్గించడం, మీథేన్ గుర్తింపు మరియు తగ్గింపు సాంకేతికతలను అమలు చేయడం
• విద్యుదీకరణ, కార్బన్ సంగ్రహణ మరియు నిల్వ మరియు ఇతర క్లీన్ ఎమర్జింగ్ ఎనర్జీ టెక్నాలజీ విస్తరణ ప్రయత్నాల ద్వారా పారిశ్రామిక రంగంలో కాలుష్య కారకాలను తగ్గించడం  
• భారతదేశం మరియు యూస్  డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ కి చెందిన  ల్యాబ్‌లు మరియు పర్యావరణ ప్రభావ అంచనా సంస్థల  మధ్య సహకారం పెంపొందించి  ఎనర్జీ డేటా మేనేజ్‌మెంట్, మోడలింగ్, తక్కువ కార్బన్ టెక్నాలజీల రంగంలో సహకారాన్ని మరింత పెంచడం.

పెట్టుబడులను సులభతరం చేయడానికి, విధానాలపై అవగాహన కల్పించడం, సాంకేతిక మార్పిడిని ప్రోత్సహించేందుకు ప్రైవేటు రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇరు దేశాల మంత్రులు అంగీకరించారు. ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే  దిశలో భాగంగా  హైడ్రోజన్ మరియు జీవ ఇంధనాలపైప్రభుత్వ -ప్రైవేట్ టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన మంత్రులు  పునరుత్పాదక శక్తిని పెద్ద ఎత్తున ఏకీకృతం చేయడానికి కొత్త ఎనర్జీ స్టోరేజ్ టాస్క్ ఫోర్స్‌ను నెలకొల్పుతున్నట్టు ప్రకటించారు.  చమురు మరియు గ్యాస్ రంగంలో ఉద్గారాలను తగ్గించడానికి  గ్యాస్ టాస్క్ ఫోర్స్ కింద భారతదేశ నగర గ్యాస్ పంపిణీ విభాగంలో మీథేన్ తగ్గింపు సాంకేతికతలను అమలు చేయడానికి  భారతదేశం-అమెరికాకి చెందిన సంస్థల మధ్య కుదిరిన   అవగాహన ఒప్పందం పట్ల  మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. 
 ఐదు సాంకేతిక అంశాలు  1) పవర్ & ఎనర్జీ ఎఫిషియన్సీ, 2) పునరుత్పాదక శక్తి, 3) బాధ్యతాయుతమైన ఆయిల్ , గ్యాస్ , 4) స్థిరమైన వృద్ధి , మరియు 5) ఎమర్జింగ్ ఇంధనాలు మరియు సాంకేతికత అంశాలపై సాధించిన ప్రగతిని భారతదేశం, అమెరికా దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు వివరించారు.   .
 ఇంధన భద్రత కల్పించి, వాతావరణం మరియు ఇంధన సవాళ్లను ఎదుర్కొనేందుకు న్యాయమైన ఇంధన పరివర్తనకు మద్దతు ఇవ్వడానికి యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ క్లీన్ ఎనర్జీ పార్టనర్‌షిప్ క్రింద సాగుతున్న  ప్రయత్నాలను మంత్రులు స్వాగతించారు.

***


(Release ID: 1866051) Visitor Counter : 220


Read this release in: Hindi , English , Urdu