Posted On:
02 OCT 2022 6:17PM by PIB Hyderabad
మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు చెందిన కార్పొరేట్ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఉక్కునగరంలో కార్యక్రమాలను నిర్వహించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని ఉక్కునగరం టౌన్‌షిప్‌లోని సెక్టార్-8లో సంస్థ సీఎండీ శ్రీ అతుల్ భట్, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
శ్రీ అతుల్ భట్ మాట్లాడుతూ, అహింస, సత్యంపై మహాత్ముడు తన దృఢమైన తత్వంతో ముందున్న మార్గం అంత సులభం కాకపోయినప్పటికీ, లక్ష్యాలను సాధించడంలో ఇది అత్యంత ప్రభావవంతమైన పద్ధతి అని ప్రపంచానికి నిరూపించారని తెలిపారు. ఈ నమ్మకమే ఆయనను గొప్ప స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరిగా చరిత్రకారులచే గుర్తించబడింది, ప్రశంసించబడిందని కొనియాడారు.
ఈ సందర్భంగా భగవద్గీత, ఖురాన్, గురుగ్రంథ సాహిబ్, బుద్ధ ప్రవచనం, బైబిల్ నుండి ప్రవచనాలు చేశారు. ఈ సందర్భంగా విస్టీల్ మహిళా సమితి సభ్యులు భజనలు చేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న సీఎండీ, డైరెక్టర్లు, అందరూ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు.
పరిపాలనా సంస్కరణలు & ప్రజా ఫిర్యాదుల శాఖ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, శ్రీ అతుల్ భట్, ఆర్ఐఎన్ఎల్ సీఎండీ నుండి అందిన సమాచారానికి అనుగుణంగా, సంస్థలో 2 అక్టోబర్ 2022 నుండి 31 అక్టోబర్ 2022 వరకు ప్రత్యేక స్వచ్ఛత 2.0 కార్యక్రమం నిర్వహించనున్నారు.
ప్రత్యేక స్వచ్ఛతా ప్రచారం సందర్భంగా, స్థల నిర్వహణ, వ్యర్థాల పారవేయడం, రికార్డుల నిర్వహణ, పెండింగ్‌లో ఉన్న అంశాలను మూసివేయడం మొదలైన వాటిపై దృష్టి సారిస్తారు. ప్లాంట్ మరియు మైన్స్‌లోని వివిధ ప్రాంతాలలో సామూహిక ప్రక్షాళన కార్యక్రమాలు, బాల స్వచ్ఛతా జాగృతి - ఒక అవగాహన వంటి ఒక నెల రోజుల కార్యకలాపాలు నిర్వహిస్తారు. పాఠశాల విద్యార్థుల కోసం 'వ్యక్తిగత పరిశుభ్రత' కార్యక్రమం, పరివర్తన - ఉన్నత పాఠశాలల విద్యార్థినులకు 'రుతు పరిశుభ్రత'పై అవగాహన కార్యక్రమం, చేనేత బ్యాగుల పంపిణీ, సఫాయి పఖ్వాడా మొదలైనవాటిని ఇందులో భాగం చేశారు.
ఇందులో భాగంగా గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంకు మద్దతుగా స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లోని ఘన వ్యర్థాల నిర్వహణ కోసం గాజువాక ఎఎంహెచ్ఓ, జీవిఎంసీ, డాక్టర్ ఎస్. కిరణ్ కుమార్ గారికి “ప్రతి ఇంటి చెత్త సేకరణ వాహనం” మరియు “పుష్ కార్ట్‌లను” శ్రీ అతుల్ భట్ అందించారు. RINL GVMCకి 65 పుష్ కార్ట్‌లను అందజేస్తుంది. తర్వాత శ్రీ అతుల్ భట్ ఒక ప్లాగ్ రన్‌ను ప్రారంభించారు, అంటే సెక్టార్-8, మహాత్మా గాంధీ పార్క్ మీదుగా సెక్టార్-8 కాంప్లెక్స్‌లో జాగింగ్ చేస్తున్నప్పుడు చెత్త/వ్యర్థాలను తీయడం అనే కార్యకలాపాన్ని క్రీడా శాఖ నిర్వహించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ప్లాస్టిక్ రహిత ఉక్కునగరం టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దేందుకు సెక్రోర్-8 షాపింగ్ కాంప్లెక్స్‌లో కాంట్రాక్ట్ కార్మికులకు శ్రీ అతుల్ భట్, శ్రీమతి నూపూర్ భట్, డైరెక్టర్లు బట్ట సంచులను పంపిణీ చేశారు.
ఆర్ఐఎన్ఎల్ ఉన్నతాధికారులు, ఎస్‌ఈఎ ప్రతినిధులు, యూనియన్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్, ప్రభుత్వ రంగ మహిళా ప్రతినిధులు, ఉద్యోగులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
*****