ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియాను ప్రపంచ ఎలక్ట్రానిక్ తయారీ హబ్‌గా తయారు చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా పెగట్రాన్ ప్లాంట్ ప్రారంభం కావడం మరో మైలురాయిని అధిగమించడం ః కేంద్ర సహాయమంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
టీమ్ ఇండియా- రాష్ట్రాలు, కేంద్రం భాగస్వామ్యంతో 1 ట్రిలియన్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, 300 బిలియన్ అమెరికన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీని సాధించడం లక్ష్యం.
కేంద్ర ప్రభుత్వం వారి పిఎల్ఐ పథకం రాష్ట్రాలు ఎలక్ట్రానిక్స్ తయారీ గమ్యస్థానాలుగా రూపుదిద్దుకోవడానికి సహాయపడనుంది.
ఇండియాను ప్రపంచ ఎలక్ట్రానిక్ తయారీ హబ్‌గా తయారు చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
దార్శనికతకు అనుగుణంగా పెగట్రాన్ ప్లాంట్ ప్రారంభం కావడం మరో మైలురాయిని అధిగమించడం ః కేంద్ర సహాయమంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
టీమ్ ఇండియా- రాష్ట్రాలు, కేంద్రం భాగస్వామ్యంతో 1 ట్రిలియన్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, 300 బిలియన్ అమెరికన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీని సాధించడం లక్ష్యం.
కేంద్ర ప్రభుత్వం వారి పిఎల్ఐ పథకం రాష్ట్రాలు ఎలక్ట్రానిక్స్ తయారీ గమ్యస్థానాలుగా రూపుదిద్దుకోవడానికి సహాయపడనుంది.
Posted On:
30 SEP 2022 2:08PM by PIB Hyderabad
చెన్నై సమీపంలోని చెంగల్పట్టు వద్ద పెగట్రాన్ మొబైల్ తయారీ సదుపాయాన్ని ప్రారంభించుకోవడం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత కింద ఇండియాను ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో సాధించిన మరో మైలురాయిగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్స్ టెక్నాలజీ, స్కిల్ డవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ శాఖ సహాయమంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
పెగట్రాన్ ఎలక్ట్రానిక్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ శ్రీ చంద్రశేఖర్, మన దేశం ప్రస్తుతం ఉన్న 75 బిలియన్ అమెరికన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్ధ్యం నుంచి 300 బిలియన్ అమెరికన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించే దిశగా కేంద్ర రాష్ట్రప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్య కృషికి ఈ యూనిట్ నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు.
ఈ ప్లాంట్‌ను తైవాన్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన , ఉత్పత్తితో అనుసంధానమైన ప్రోత్సాహక పథకం (పిఎల్ ఐ) కింద ఏర్పడింది. దీనిని చెన్నైకి సమీపంలోని చెంగల్పట్టు సమీపంలో గల పారిశ్రామిక పార్కులో ఏర్పాటు చేశారు.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ, ఉపాధి కల్పనకు పెట్టుబడులను పెద్ద ఎత్తున సమకూర్చడంలో పిఎల్ఐ పథకం ఎంత గొప్పపాత్ర పోషించిందో మంత్రి వివరించారు. స్వల్ప వ్యవధిలోనే ఈ పథకం 6500 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించిందని, 40 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నదని అన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం గురించి ప్రస్తావిస్తూ కేంద్ర సహాయమంత్రి, కోవిడ్ మహమ్మారి ఒకే రకమైన సవాలును అన్ని దేశాల ముందుకు తెచ్చింది. అయితే ఇండియా ఈ సవాలును ఎలా ఎదుర్కొన్నదన్నది ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతోపాటు గౌరవాన్ని పొందింది. మనం కోవిడ్‌ను వెనక్కి నెట్టి 2026 నాటికి దేశాన్ని ట్రిలియన్ డాలర్ డిజిటల్ ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నాం.టీం ఇండియా, రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం , మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ లక్ష్య సాధనకు భాగస్వామ్యం వహించగలవు అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పెగట్రాన్ టెక్నాలజీ ఇండియా ఛైర్మన్ చెంగ్‌జియాన్ జోంగ్, ఇండియాలో పెగట్రాన్ ప్రస్థానం అసాధారణమైనదని అన్నారు. భారత ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్రం తమకు అందించిన మద్దతుకు తాము ఎంతో ఆనందిస్తున్నామన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్, తమిళనాడు ప్రభుత్వానికి చెందిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రి శ్రీ టి.ఎం. అంబరసన్, పెగట్రన్ టెక్నాలజీ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ లిన్ చియు తన్, పెగట్రన్ కార్పొరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెన్సె యావో, పెగట్రాన్ టెక్నాలజీ ఇండియా సిఇఒ కువో షింగ్ జంగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1864200)
Visitor Counter : 128