సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఆజాదీ కా అమృత మహోత్సవ్ స్మారకార్ధం తొలిసారి స్ఫూర్తి క్లస్టర్ల నుంచి సంప్రదాయ ఉత్పత్తుల జాతీయ స్థాయి ప్రదర్శన
Posted On:
30 SEP 2022 4:11PM by PIB Hyderabad
ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న చట్టబద్ధ సంస్థ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్) 1 అక్టోబర్ నుంచి 15 అక్టోబర్ 2022 వరకు న్యూఢిల్లీలోని దిల్లీ హాట్‌లో స్ఫూర్తి మేళాను (SFURTI) నిర్వహిస్తోంది. స్ఫూర్తి సమూహం నుంచి ఉత్పత్తి అయిన సంప్రదాయ ఉత్పత్తలతో జాతీయ స్థాయి ప్రదర్శనను తొలిసారి నిర్వహించడమే కాక ఆజాదీ కా అమృత మహోత్సవ్ స్మారకంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
స్ఫూర్తి కింద సంప్రదాయ చేతివృత్తి పనివారి ఆదాయాన్ని పెంచేందుకు విలువ జోడించిన సంప్రదాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేసేందుకు బృందాలుగా, సమూహాలుగా (క్లస్టర్లు) ఏర్పాటు చేశారు. చేనేత, హస్తకళలు, ఖాదీ, నార, వ్యవసాయ ఉత్పత్తుల వంటి సంప్రదాయ రంగాలను ఈ క్లస్టర్లు ఆవరించి ఉంటాయి. భారత ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామర్ధ్య నిర్మాణం, మార్కెటింగ్, నమూనా ప్రోత్సాహం తదితర అంశాలలో తోడ్పాటును అందిస్తుంది. నేటివరకూ, స్ఫూర్తి కింద దేశవ్యాప్తంగా 3 లక్షల మంది చేతివృత్తి పనివారికి ప్రత్యక్షంగా లబ్ధిని చేకూరుస్తూ 498 క్లస్టర్లకు తోడ్పాటును అందించారు.
స్పూర్తి మేళా సందర్భంగా, 28 రాష్ట్రాలవ్యాప్తంగా 50 స్ఫూర్తి క్లస్టర్లకు చెందిన 100మంది చేతివృత్తి పనివారు చేనేత, హస్తకళలు, ఖాదీ, నార ఉత్పత్తులు, వ్యవసాయ ప్రాసెసింగ్ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఇందులో జమ్ము కాశ్మీర్‌కు చెందిన సోజ్ని ఎంబ్రాయిడరీ క్లస్టర్, మేఘాలయకు చెందిన కేన్ అండ్ బాంబూ (పేము, వెదురుబొంగు) క్లస్టరు, కర్ణాటకకు చెందిన చెన్నపట్న బొమ్మల క్లస్టర్, రాజస్థాన్‌కు చెందిన నాచురల్ డై క్లస్టర్, బీహార్ నుంచి మధుబని పెయింటింగ్ క్లస్టర్, మహారాష్ట్ర నుంచి కొల్హాపురి సంప్రదాయ ఆభరణాల క్లస్టర్, కేరళ నుంచి కాయిర్ (కొబ్బరి నార) క్లస్టర్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కార్పెట్ అండ్ దుర్రీ క్లస్టర్, ఒడిషాకు చెందిన చిరుధాన్యాల క్లస్టర్, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఎరి సిల్క్ ఖాదీ క్లస్టర్ సహా అనేక ఇతర క్లస్టర్లు పాలుపంచుకుంటున్నాయి.
పండుగల సమయంలో దేశం నలుమూలల్లో తయారు అయ్యే సంప్రదాయ ఉత్పత్తులను పౌరులకు తెలిసేలా ప్రచారం చేయడం స్ఫూర్తి మేలా లక్ష్యం. అంతేకాకుండా, ఈ క్లస్టర్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి, అమ్ముకునేందుకు చేతివృత్తిపనివారికి నూతన అవకాశాలను ఈ మేళా తెరుస్తుంది.
మేళా థీమ్ పెవిలియన్ (ఇతివృత్త )లో సంప్రదాయ ఉత్పత్తుల తయారీ ప్రక్రియల ప్రత్యక్ష ప్రదర్శనను కూడా నిర్వహించనున్నారు.
***
(Release ID: 1864198)
Visitor Counter : 120