శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సిఎస్ఐఆర్ 81వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించిన CSIR-NIScPR

Posted On: 29 SEP 2022 4:03PM by PIB Hyderabad

26 సెప్టెంబర్ 1942న స్థాపించిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఈ ఏడాది 81వ స్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారతదేశంలోని అతిపెద్ద పరిశోధనాభివృద్ధి సంస్థలలో ఇది ఒకటి. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 37 ప్రయోగశాలలు ఈ ప్రత్యేకమైన రోజును ఘనంగా నిర్వహించకుంటున్నాయి. దిల్లీలోని సీఎస్ఐఆర్ లేబొరేటరీ- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ పాలసీ రీసెర్చ్ (NIScPR) ఈ 81వ వ్యవస్థాపక దినోత్సవాన్ని 27 సెప్టెంబర్ 2022న నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ (NASC), తోడాపూర్ దిల్లీలో జరుపుకుంది.

వ్యవస్థాపక దినోత్సవ ప్రధాన కార్యక్రమానికి ముందు, CSIR-NIScPR 27 సెప్టెంబర్ 2022న ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దిల్లీలోని NIScPR, పూసా క్యాంపస్‌లోని వివేకానంద హాల్‌లో ఓపెన్ డే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా 130 మంది పాఠశాల విద్యార్థులు సంస్థను సందర్శించారు. సంస్థ  డైరెక్టర్ప్రొఫెసర్ రంజన అగర్వాల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వారి ఉజ్వల భవిష్యత్తు కోసం పలు సూచనలు చేశారు. ఓపెన్ డే స్టూడెంట్-సైంటిస్ట్ కనెక్ట్ సెషన్ సందర్భంగా, CSIR-NIScPR చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ జి. మహేష్ కీలకోపన్యాసం చేశారు. CSIR-NIScPR చీఫ్ సైంటిస్ట్ డాక్టర్. ఎమ్రైస్, వ్యవస్థాపక దినోత్సవ చీఫ్ కోఆర్డినేటర్, JIGYASA, NIScPR యొక్క సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు కోఆర్డినేటర్ శ్రీ C.B. సింగ్ కూడా విద్యార్థులతో ప్రసంగించి వారి ఆలోచనలను పంచుకున్నారు.

ఓపెన్ డే సందర్భంగా, NIScPR ప్రచురణల ప్రదర్శనఆయుర్ వాటిక మరియు ఆర్‌హెచ్ఎండీ సందర్శనను విద్యార్థులకు కల్పించారు. సైన్స్ ప్రాచుర్యంలో నిమగ్నమైన భారతీయ సంస్థలపై దృష్టి సారించిన NIScPR యొక్క నెలవారీ ప్రముఖ సైన్స్ హిందీ మ్యాగజైన్ విజ్ఞాన్ ప్రగతి ప్రత్యేక సంచిక కూడా విద్యార్థులకు పంపిణీ చేశారు.

27 సెప్టెంబర్ 2022, CSIR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ సీఎస్ఐఆర్ 81వ వ్యవస్థాపక దినోత్సవాన్ని దిల్లీలోని ఎన్ఏఎస్‌సీలో నిర్వహించారు. ప్రొఫెసర్ వీరేంద్ర కె. విజయ్ఐఆర్ఈడీఎ చైర్ ప్రొఫెసర్సీఆర్‌డీటీఐఐటీ దిల్లీ,  నేషనల్ కోఆర్డినేటర్ఉన్నత్ భారత్ అభియాన్ (యుబీఎమరియు CSIR-NISTADS మాజీ డైరెక్టర్ డాక్టర్ అశోక్ జైన్ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగాసైన్స్ కమ్యూనికేషన్ లిటరేచర్ ఫార్మాట్‌లపై దృష్టి సారించిన CSIR-NIScPR పుస్తకం కూడా విడుదల చేశారు. ఈ పుస్తకం భారతదేశంలోని ప్రాంతీయ భాషలలో సైన్స్ కమ్యూనికేషన్‌ను లక్ష్యంగా చేసుకుని CSIR-NIScPR స్టడీస్ ఇన్ సైన్స్ కమ్యూనికేషన్ విభాగం నిర్వహించిన వర్క్‌షాప్ ఫలితంగా రాయబడింది. పుస్తక రచయితలు సైన్స్ ఫిక్షన్కవిత్వంతోలుబొమ్మసైన్స్ బ్లాగ్ మొదలైన ప్రముఖ వివిధ ఫార్మాట్‌లను చర్చించారు. దిల్లీకి చెందిన నలుగురు రచయితలు డా. మధు పంత్ (మాజీ డైరెక్టర్నేషనల్ బాల్ భవన్)శ్రీ రఘువర్ దత్ రిఖారీ (మాజీ ఎడిటర్-ఇన్వెన్షన్ ఇంటెలిజెన్స్ ఆవిష్కార్ )డాక్టర్ మనీష్ మోహన్ గోర్ (సైంటిస్ట్, CSIR-NIScPR & ఎడిటర్విజ్ఞాన్ ప్రగతి) మరియు శ్రీమతి శుభదా కపిల్ (అసిస్టెంట్ ఎడిటర్విజ్ఞాన్ ప్రగతి) ఈ పుస్తకావిష్కరణకు హాజరయ్యారు.

వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగావిశిష్ట అతిథులు పదవీ విరమణ పొందిన వారికి, 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసినవారికి NIScPR సిబ్బంది యొక్క 10వ & 12వ తరగతుల్లోని నిష్ణాతులైన ఉద్యోగులకు అవార్డులు ప్రధానం చేశారు. ఎన్‌ఐఎస్‌సిపిఆర్‌ సిబ్బంది వివిధ అంశాలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. CSIR-NIScPR ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహమ్మద్ రైస్ వందన సమర్పణ తెలిపారు.

CSIR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ పాలసీ రీసెర్చ్ (NIScPR), దిల్లీలో హిందీ మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని28 సెప్టెంబర్ 2022న నిర్వహించింది. CSIR జాయింట్ సెక్రటరీశ్రీ మహేంద్ర కుమార్ గుప్తా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ గుప్తా NIScPR యొక్క హెర్బేరియంపాపులర్ సైన్స్ విభాగంఐటీ విభాగం, ప్రిటింగ్ యూనిట్‌ను సందర్శించి సంబంధిత విభాగాల శాస్త్రవేత్తలతో సంభాషించారు.

హిందీ మాసోత్సవ వేడుకలోప్రొఫెసర్ రంజనా అగర్వాల్, శ్రీ గుప్తాకు అధికారికంగా ఒక మొక్కజ్ఞాపిక ఇన్‌స్టిట్యూట్ ప్రచురణల సెట్‌తో స్వాగతం పలికారు. ఆమె స్వాగత ప్రసంగంలో,  హిందీ భాష ద్వారా సైన్స్ మరియు సొసైటీ అనుసంధానతకు తమ సంస్థ అపారమైన సహకారం అందించిందని అన్నారు. విజ్ఞాన్ ప్రగతి మ్యాగజైన్ ఇటీవలే అధికార భాషా శాఖహోం మంత్రిత్వ శాఖప్రభుత్వ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు కీర్తి పురస్కారం’ పొందినట్లు ఆమె తెలిపారు. ఒరిజినల్ హిందీ రీసెర్చ్ జర్నల్ భారతీయ వైజ్ఞానిక్ ఏవం ఆడియోజిక్ అనుసంధాన్ పత్రిక’ ను 1993 నుండి NIScPR  ప్రచురిస్తోందని తెలిపారు. స్వస్థిక్ అనే ప్రధాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  దీని ద్వారా శాస్త్రీయంగా ధృవీకరించబడిన సాంప్రదాయ జ్ఞానం హిందీ మరియు దేశంలోని ఇతర ప్రాంతీయ భాషలలో భాగస్వామ్యం చేయబడుతుందని ఆమె తెలిపారు. CSIR-NIScPR హిందీలో సైన్స్ కమ్యూనికేషన్ మరియు పాలసీ స్టడీస్ పరిశోధన అన్ని తప్పనిసరి కార్యకలాపాలను కొనసాగిస్తుందని ఆమె జాయింట్ సెక్రెటరీకి హామీ ఇచ్చారు.

 ఈ సందర్భంగా సీఎస్‌ఐఆర్‌ జాయింట్‌ సెక్రటరీ శ్రీ మహేంద్ర కుమార్‌ గుప్తా మాట్లాడుతూ, తాను చిన్నతనంలో విజ్ఞాన్‌ ప్రగతిని బాగా చదివేవాడినని.. ఆ పత్రికలో ప్రచురితమైన శాస్త్రీయ అంశాలపై తోటి విద్యార్థులతో చర్చించేవాడినని తెలిపారు. NIScPR యొక్క సైన్స్ మ్యాగజైన్ 'విజ్ఞాన్ ప్రగతితన సైన్స్ అధ్యయనంపై ఆసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని కూడా ఆయన వెల్లడించారు. CSIR-NIScPR సైన్స్ పాలసీ మరియు సైన్స్ కమ్యూనికేషన్ యొక్క ప్రధాన రంగాలలో గొప్ప పని చేస్తోందని శ్రీ గుప్తా తెలిపారు. CSIR-NIScPR  నిర్వహించిన వివిధ హిందీ మాసోత్సవాల పోటీలలో విజేతలందరికీ బహుమతులు పంపిణీ చేశారు.

 

 <><><><>



(Release ID: 1863579) Visitor Counter : 118


Read this release in: English , Urdu , Hindi