వ్యవసాయ మంత్రిత్వ శాఖ

మొరేనాలో ఎన్ ఎస్ సి సేంద్రియ విత్తన వ్యవసాయ క్షేత్రానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శంకుస్థాపన


చంబల్ జాతీయ వన్యప్రాణి అభయారణ్యంలో 207 హెక్టార్ల భూమిని డీ నోటిఫై చేయనున్న ప్రభుత్వం - శ్రీ తోమర్

అభయారణ్య ప్రాంతం రెవెన్యూ భూమి కావడం వల్ల స్థానిక స్థాయిలో ఇసుక లభ్యత, ఉపాధి పెరుగుదల

రైతులకు విత్తన క్షేత్రం నుండి అధిక దిగుబడి విత్తనాల లభ్యత; సామాజిక-ఆర్థిక స్థాయి మెరుగుదల

Posted On: 25 SEP 2022 7:55PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ,  రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు మొరేనా లో జాతీయ విత్తన సంస్థ (ఎన్ ఎస్ సి) సేంద్రియ విత్తన క్షేత్రానికి శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయిన తరువాత, నూనెగింజల కొత్త సేంద్రియ విత్తనాలు మధ్యప్రదేశ్ రైతులకు లభ్యం అవుతాయి. ఈ క్షేత్రం ద్వారా రైతులకు ఆధునిక పద్ధతులను పరిచయం చేస్తారు, వారు అధిక దిగుబడినిచ్చే విత్తనాలను పొందుతారు. వారి సామాజిక-ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

 

చంబల్ లోని జాతీయ వన్యప్రాణి అభయారణ్యంలో 207 హెక్టార్ల భూమిని డీ-నోటిఫికేషన్ కు సిఫారసు చేస్తూ పర్యావరణ, అటవీ , వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక ముఖ్య నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా శ్రీ తోమర్ ప్రకటించారు. ఈ అభయారణ్య  ప్రాంతం రెవెన్యూ భూమి కావడం వల్ల ఇసుక లభ్యత స్థానిక స్థాయిలో ఉంటుంది, ఇది ఉపాధిని కూడా పెంచుతుంది.

 

కఠినమైన ప్రాంతంలో భూమిని మెరుగుపరచడం ద్వారా సేంద్రియ విత్తనాల ఉత్పత్తి కోసం మొరేనా (మధ్యప్రదేశ్)లో ఈవ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు శ్రీ తోమర్ తెలిపారు. దీనికోసం మొరేనాలోని నాలుగు గ్రామాల (గడోరా, జఖౌనా, రితోరా ఖుర్ద్ , గోరాఖా) లో 885.34 హెక్టార్ల భూమిని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది.

 

ఈ భూమి చంబల్ లో లోయల కారణంగా వ్యవసాయం సాధ్యం  కాని కఠినమైన భూమి. అయితే, రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడానికి ఎన్ ఎస్ సి కట్టుబడి ఉన్నందున సేంద్రియ విత్తనాల ఉత్పత్తి కోసం వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఎన్ ఎస్ సికి అప్పగించింది. ఎన్ ఎస్ సి 15 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచుతోంది,

మొరెనా లోయలలో విత్తనాల ఉత్పత్తి భూమిని మెరుగుపరుస్తుంది .భూమి సారవంతమైనదిగా మారుతుంది. భూసంస్కరణల స్ఫూర్తితో స్థానిక రైతులు తమ పొలాల్లోని భూమిని మెరుగుపరచి, అత్యాధునిక శాస్త్రీయ పద్ధతితో విత్తనాలను ఉత్పత్తి చేసి, తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయడం ద్వారా అధిక ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. రైతులు ఇక్కడ విత్తనోత్పత్తి తాజా పద్ధతులను నేర్చుకుంటారు. స్థానిక ,రాష్ట్ర రైతులకు ఎన్ ఎస్ సి నిపుణులు శిక్షణ ద్వారా తాజా విత్తనోత్పత్తి మెళకువలు బోధిస్తారు. మొరేనాలోని స్థానిక కార్మికులకు భూసంస్కరణలు, పొలంలో విత్తనోత్పత్తి ద్వారా ఉపాధి లభిస్తుంది. మొరెనా క్షేత్రం నుంచి తాజా , జన్యుపరంగా , భౌతికంగా స్వచ్ఛమైన సేంద్రియ నూనెగింజల విత్తనాలను పొందడం ద్వారా రైతులు మంచి ఉత్పత్తిని పొందుతారు, ఇది రాష్ట్రంలోని రైతుల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా, రైతులకు పోషకాహార భద్రతను కూడా అందిస్తుంది.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాయకత్వంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న సర్వతోముఖ కృషి ప్రపంచవ్యాప్తంగా మన దేశం ప్రతిష్టను ఇనుమడింప చేస్తోందని శ్రీ తోమర్ అన్నారు.

వసుధైక కుటుంబం స్ఫూర్తితో మన దేశం పనిచేస్తోందని, 'జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసధాన్' అనే నినాదంతో మొరేనా విత్తన క్షేత్రం రైతుల పురోగతి కోసం సైన్స్, పరిశోధనలను పూర్తిస్థాయిలో వినియోగించుకోనుందని ఆయన తెలిపారు.

విత్తనం అనేది వ్యవసాయానికి ప్రధాన మూలాధారం. ఆధారం. వ్యవసాయానికి మంచి విత్తనాల లభ్యత వ్యవసాయ పర్యావరణ వ్యవస్థకు, మొత్తం ఆర్థిక వ్యవస్థ కు ప్రయోజనం కల్పించడంతో పాటు ఉత్ప త్తి, ఉత్పాదకత ను పెంచడంతో పాటు రైతులకు అధిక ఆదాయం వస్తుందని శ్రీ తోమర్ అన్నారు.

 

రాష్ట్రాలకు విత్తన లభ్యతను నిర్ధారించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా విత్తనాల పంపిణీకి సహాయ పడుతుంది. నాణ్యమైన విత్తనోత్పత్తి , పంటల పెంపు కోసం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2014-15 నుంచి సీడ్స్ అండ్ ప్లాంటింగ్ మెటీరియల్ సబ్ మిషన్ ను అమలు చేసింది, తద్వారా రైతులు తగినంత పరిమాణంలో మెరుగైన విత్తనాలను పొందుతున్నారు. విత్తన నాణ్యత నియంత్రణను వివిధ విత్తన సంబంధిత కార్యకలాపాల ద్వారా రాష్ట్ర , ప్రభుత్వ రంగ విత్తన సంస్థలు బలోపేతం చేస్తున్నాయి. గడచిన 8 సంవత్సరాలలో వాణిజ్య సాగు కోసం 304 రకాలను నోటిఫై చేశారు.

 

చంబల్ జాతీయ వన్యప్రాణి అభయారణ్యం  భాగం లోని భాగం డీ-నోటిఫికేషన్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది:

 

కేంద్ర మంత్రి , స్థానిక ఎంపి శ్రీ తోమర్ కృషితో డీ-నోటిఫికేషన్ కారణంగా, ఈ ప్రాంతం అభయారణ్య ప్రాంతానికి వెలుపల ఉంటుంది, దీని వల్ల ఇక్కడి నుండి ఇసుక స్థానిక స్థాయిలో నిర్మాణ / అభివృద్ధి పనుల కోసం చౌక ధరలకు లభిస్తుంది ఇది కొత్త ఉపాధి అవకాశాలకు కూడా దారితీస్తుంది.

డీ-నోటిఫికేషన్ కు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ ను శ్రీ తోమర్ కోరారు. ఈ ప్రతిపాదనను మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ 69వ సమావేశంలో చర్చించారు. అభయారణ్యం లోని 207.05 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఈ క్రింది విధంగా డీ-నోటిఫై చేయాలని కమిటీ సిఫారసు చేసింది. ఇందులో బరోడియా బిండి (జిల్లాలోని సబల్ గఢ్ శ్రేణిలో 9.49 హెక్టార్లు. షియోపూర్), బర్వాసిన్ (రేంజ్-దేవరి, జిల్లా మొరెనా) లో 118.66 హెక్టార్లు. రాజ్ ఘాట్ (పిప్రాయి) లో 78.90 హెక్టార్లు (రేంజ్- దేవరి, జౌరా, డిస్ట్రిక్ట్-మొరెనా) ఉన్నాయి. ఈ డీ-నోటిఫికేషన్ తో అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టనున్నారు. 4 లక్షలకు పైగా జనాభా నేరుగా సంరక్షిత ప్రాంతంలోని వివిధ ఉత్పత్తులపై ఆధారపడి ఉంటుంది. స్థానిక స్థాయిలో ఇసుక తవ్వకాల కారణంగా ఉపాధి పెరుగుతుంది.

 

విత్తన వ్యవసాయ క్షేత్రానికి పునాది రాయి వేసిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ఉద్యాన, ఆహార శుద్ధి శాఖ మంత్రి శ్రీ భరత్ సింగ్ కుష్వాహ శ్రీ ఆండాళ్ సింగ్ కన్సానా, శ్రీ రఘురాజ్ కన్సానా, శ్రీ గిరిరాజ్ దండోటియా, శ్రీ సుబేదార్ సింగ్ సికార్వార్ తో పాటు  ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు ,రైతులు , కార్మికులు పాల్గొన్నారు. ప్రారంభంలో, ఎన్ ఎస్ సి ఎండి , వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అశ్విని కుమార్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా శ్రీ తోమర్ రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.

 

****



(Release ID: 1862166) Visitor Counter : 147


Read this release in: English , Urdu