వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ముగిసిన ఐటిపిజిఆర్ఎఫ్ఎ పాలకమండలి తొమ్మిదవ సమావేశం
Posted On:
24 SEP 2022 3:47PM by PIB Hyderabad
ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐటిపిజిఆర్ఎఫ్ఎ) పాలకమండలి (జిబి9) తొమ్మిదవ సమావేశం (జిబి9) ఈ రోజు న్యూఢిల్లీలో ముగిసింది.
ఐటిపిజిఆర్ఎఫ్ఎ ఆరు రోజుల జిబి9 సెషన్ ను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ 2022 సెప్టెంబర్ 19 న న్యూఢిల్లీలో ప్రారంభించారు.
150 సభ్య దేశాలకు చెందిన 400 మందికి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, రిసోర్స్ పర్సన్లు
9వ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.
భారతదేశం నుంచి బెనిఫిట్ షేరింగ్ ఫండ్ ఆఫ్ ట్రీటీ కోసంమొదటి విరాళం
9వ సర్వసభ్య (జిబి-9) సమావేశాల సందర్భంగా, ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్ ఎస్ ఐ ఐ) బెనిఫిట్ షేరింగ్ ఫండ్ (బిఎస్ఎఫ్) కు తొలిసారిగా రూ .20 లక్షలు (~25,000 డాలర్లు) విరాళంగా అందించింది. బి.ఎస్.ఎఫ్ అనేది ఒప్పందం కాంట్రాక్టింగ్ పార్టీల మధ్య సామర్థ్య పెంపుదల, పరిరక్షణ ,సుస్థిర వినియోగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించే ట్రీటీ (ఒప్పందం) కి సంబంధించిన ఫండింగ్ మెకానిజం.
ఎం ఎల్ ఎస్ పెంపుదల పై అధ్యయన బృందం (వర్కింగ్ గ్రూప్) కో-ఛైర్ పర్సన్ గా భారతదేశం నియమించబడింది. ఐసీఏఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, ఇండియాకు చెందిన డాక్టర్ సునీల్ అర్చక్, ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా లోని వ్యవసాయ శాఖ కు చెందిన డాక్టర్ మైఖేల్ ర్యాన్ తో కలిసి 'బహుళపక్ష వ్యవస్థ (ఎంఎల్ఎస్)ను మెరుగుపరచడం' అనే అంశంపై వర్కింగ్ గ్రూప్ కు కో-ఛైర్మెన్ గా నియమితులయ్యారు. ఐటిపిజిఆర్ఎఫ్ఎ విజయానికి పూర్తి నిర్వహణ పరమైన సులభ, స్నేహ పూర్వక ఉపయోగకారిగా ఎం ఎల్ ఎస్ కీలకం. ప్రయోజనాల పంపిణీ వ్యవస్థ పెంపు, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ, సాంకేతిక, విధానపరమైన మార్పులను పరిగణనలోకి తీసుకుంటూ, పంటల విస్తరణ , ప్రవేశాల లభ్యత పెంచడానికి చర్యలు ఎం ఎల్ ఎస్ పెంపుదల పరిధి లో ఉంటాయి.
రైతుల హక్కులపై అడ్ హాక్ టెక్నికల్ ఎక్స్ పర్ట్ గ్రూప్ (ఏ హెచ్ టి ఇ జి ) గత ఐదు సంవత్సరాల్లో జరిగిన సమావేశాల ఆధారంగా సర్వసభ్య సమావేశం విస్తృతమైన చర్చల తరువాత రైతుల హక్కుల అమలుపై ఏకాభిప్రాయానికి వచ్చింది
డాక్టర్ ఆర్.సి. అగర్వాల్ (ఇండియా) ,శ్రీమతి స్వాన్ హిల్డ్ ఇసాబెల్లె బటా టోర్హీమ్ (నార్వే) సహ-అధ్యక్షత వహించారు జి బి 9 సమావేశంలో జరిగిన వర్కింగ్ గ్రూప్/ప్లీనరీ చర్చల లో సమతౌల్యం, న్యాయం ఆధారంగా ఆర్టికల్ 9 ప్రకారం రైతుల హక్కుల అమలుపై చివరికి ఒక తీర్మానాన్ని ఆమోదించారు.
జిబి 9 నిపుణులు, భాగస్వాములు, ప్రతినిధులు కష్టమైనప్పటికీ, సాధ్యమైన ఈ తీర్మానానికి రావడానికి చేసిన కృషిని సహ-అధ్యక్షులు ప్రశంసించారు. జాతీయ చట్టం ప్రకారం రైతుల హక్కుల జాతీయ అమలు కోసం జాతీయ చర్యలు, ఉత్తమ విధానాలు మరియు నేర్చుకున్న పాఠాల జాబితాను నవీకరించాలని జిబి కాంట్రాక్టింగ్ పార్టీలకు పిలుపునిచ్చింది.
జాతీయ చట్టాల ప్రకారం, ఒప్పందం కింద ప్రైతుల హక్కుల జాతీయ అమలు కోసం జాతీయ చర్యలు, ఉత్తమ పద్ధతులు ,నేర్చుకున్న పాఠాల జాబితాను నవీకరించాలని సమావేశం కాంట్రాక్టు పార్టీలకు పిలుపునిచ్చింది. ఇంకా, ఆప్షన్ కేటగిరీ 10 (రైతుల హక్కుల అమలు కోసం చట్టపరమైన చర్యలు) తో సహా రైతుల హక్కుల సాకారానికి ఎంపికలను ప్రచురించాలని ట్రీటీ సెక్రటేరియట్ ను కోరారు. దీనిని కో-చైర్స్ ప్రతిపాదనగా గుర్తించారు. ఇది మొక్కల రకాల రక్షణ , రైతుల హక్కుల (పిపివి అండ్ఎఫ్ఆర్) చట్టం, 2001 కింద భారతదేశ అనుభవం ఆధారంగా, ప్లాంట్ బ్రీడర్స్ హక్కులతో ఎఫ్ఆర్ల ను సమతుల్యంగా ఉన్న తీర్మానంలో కో-ఛైర్లు గా చేర్చబడ్డాయి. రైతుల హక్కులపై డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ (డిఎస్ ఐ) సంభావ్య ప్రభావం కోసం ట్రీటీ సెక్రటేరియట్ తన బహుళ-సంవత్సరాల పని కార్యక్రమం (మైపిఒడబ్ల్యు) లో చేర్చాలని జిబి 9 ట్రీటీ సెక్రటేరియట్ కు పిలుపునిచ్చింది.
రైతుల హక్కులపై అనుభవాలను పంచుకోవడానికి , రైతుల హక్కులపై భవిష్యత్తు పనిని చర్చించడానికి ,ఒప్పంద పార్టీలుగా ఉన్న వివిధ దేశాలలో ఒప్పందం ఆర్టికల్ 9 ప్రకారం రైతుల హక్కుల అమలు మదింపు కోసం ఒక ప్రపంచ గోష్ఠిని నిర్వహించడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను జిబి 9 స్వాగతించింది.
జీన్‌బ్యాంక్ నిధులకు సంబంధించిన ప్రస్తావించిన భారతదేశం
కాంట్రాక్టింగ్ పార్టీలు భారతదేశం చేసిన జోక్యాన్ని అంగీకరించడం , ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా సి ఐ ఎఫ్ ఓ ఆర్- ఐ సి ఆర్ ఏ ఎఫ్ , ఇక్రిశాట్ జీన్‌బ్యాంక్‌ల నిధులపై సి జి ఎ ఐ ఆర్ వ్యవస్థ పరిధిలో సంస్థాగత సంస్కరణ వల్ల కలిగే ప్రభావానికి సంబంధించి అనేక ఆఫ్రికా దేశాల మద్దతు ఐటిపిజిఆర్ఎఫ్ఎ జిబి 9 లో ఒక ప్రధాన పురోగతి. ఆర్టికల్ 15 ఐఎఆర్ సి జన్యుబ్యాంక్‌ల దీర్ఘకాలిక భద్రత , సిజిఐఎఆర్ కేంద్రాలు , ఇతర ఆర్టికల్ 15 జన్యుబ్యాంక్‌ల ద్వారా 'విశ్వాసంతో' ఉంచబడిన జెర్మ్‌ప్లాజం పంపిణీని నిర్ధారించాల్సిన అవసరాన్ని, ఒప్పందం , పంట విశ్వసనీయ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలిక పరిష్కారాల అవసరాన్ని జి బి నొక్కిచెప్పింది.
*****
(Release ID: 1862009)
Visitor Counter : 165