వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ఆహారం మరియు వ్యవసాయం కోసం మొక్కల జన్యు వనరులపై అంతర్జాతీయ ఒప్పందం యొక్క పాలకమండలి సమావేశంలో రెండవ రోజు చర్చలకు నాయకత్వం వహించిన - భారతదేశం

Posted On: 21 SEP 2022 2:53PM by PIB Hyderabad

I. రైతుల హక్కుల (ఎఫ్.ఆర్) అమలు కోసం ఎంపికను రూపొందించడంలో భారతదేశం ముందుంది

జి.బి-9 యొక్క రెండవ రోజు ప్లాంట్ ట్రీటీ లోని రెండు ముఖ్యమైన సమస్యల పై చర్చించడం జరిగింది. భారతదేశం చేసిన ఎడతెగని ప్రయత్నాల కారణంగా, 2017 లో ఎఫ్‌.ఆర్‌. పై నిపుణుల బృందం ఏర్పడింది. ఆ బృందానికి ఉపాధ్యక్ష హోదాలో భారతదేశం నాయకత్వం వహించింది. మహమ్మారి సమయంలో కూడా ఈ బృందంలో చర్చలు జరిగే విధంగా భారతదేశం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేసింది. ఏ దేశంలోనైనా ఎఫ్.ఆర్. ని అమలు చేయడానికి అవసరమైన ఎంపికలతో పాటు, భవిష్యత్తు ప్రక్రియలను కూడా భారతదేశం సిద్ధం చేసింది. 

II. బహుపాక్షిక వ్యవస్థ పునరుద్ధరణలో కూడా భారతదేశం ముందుంది

2019 నుండి, అన్ని అధికారిక సమావేశాలు నిలిపివేయడం జరిగింది. స్విట్జర్లాండ్‌ తో కలిసి భారతదేశం యు.ఎన్-జెనీవా లో ఒక అనధికారిక సమావేశాన్ని నిర్వహించి, జి.బి-9 లో చర్చిండం కోసం ఒక ఆధార పత్రాన్ని సిద్ధం చేసింది. ఫలితంగా, భవిష్యత్ ప్రక్రియను నిర్ణయించడానికి భారతదేశం ఉపాధ్యక్ష హోదాలో ఒక సంప్రదింపుల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.  

III. న్యూఢిల్లీ లోని పుసా క్యాంపస్‌ లోని నేషనల్-బ్యూరో-ఆఫ్-ప్లాంట్-జెనెటిక్-రిసోర్సెస్ (ఎన్.బి.పి.జి.ఆర్) లో ఉన్న భారతదేశ జాతీయ జీన్‌-బ్యాంక్‌ ను 60 మందికి పైగా ప్రతినిధులు సందర్శించారు

ఎన్.బి.పి.జి.ఆర్. డైరెక్టర్ తో నార్వే, సెర్బియా, జింబాబ్వే ప్రతినిధులు సంభాషించారు. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద జీన్‌-బ్యాంక్‌ ను చూసిన తర్వాత తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

IV. గ్లోబల్-ఇన్ఫర్మేషన్-సిస్టమ్ (జి.ఎల్.ఐ.ఎస్) ని ఉపయోగించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని భారతదేశం పిలుపునిచ్చింది

పి.జి.ఆర్.ఎఫ్.ఏ. పై జి.ఎల్.ఐ.ఎస్. పురోగతి గురించి, ఆహారం, వ్యవసాయం కోసం మొక్కల జన్యు వనరులపై అంతర్జాతీయ ఒప్పందం (ఐ.టి.పి.జి.ఆర్.ఎఫ్.ఏ) యొక్క పాలకమండలి సమావేశం (జి.బి-9) తొమ్మిదవ సదస్సు, రెండవ రోజు సాయంత్రం నిర్వహించిన సమావేశంలో చర్చించడం జరిగింది. జి.ఎల్.ఐ.ఎస్. వినియోగానికి, కాంట్రాక్టు పార్టీల మధ్య సామర్థ్య పెంపుదల అవసరమని, శాస్త్రీయ సలహా మండలి లో సభ్యదేశంగా, భారతదేశం ప్రతిపాదించింది. 

V. పి.జి.ఆర్.ఎఫ్.ఏ. పరిరక్షణ, సుస్థిర వినియోగం దిశగా నిరంతర ప్రయత్నాలకు భారతదేశం పిలుపునిచ్చింది

కొత్త టూల్-బాక్సులు, నేపధ్య అధ్యయనాలను జి.బి-9 ప్రశంసించింది. ఈ ఎజెండా ను నెరవేర్చడానికి అంతర్జాతీయ సంస్థలతో పాటు, ప్రాంతీయ సంస్థలతో ఉమ్మడి కార్యక్రమాలను రూపొందించి, అమలుచేయాలని, పరిరక్షణ, సుస్థిర వినియోగంపై ఏర్పాటైన కమిటీలో సభ్యదేశంగా, భారతదేశం ప్రతిపాదించింది.

 

 

*****



(Release ID: 1861410) Visitor Counter : 92


Read this release in: English , Urdu , Hindi