గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్‌సిఆర్‌లో ప్రయాణికుల రవాణాకు సింగిల్ పాయింట్ టాక్సేషన్ అమలు


రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడంపై ఎన్‌సిఆర్‌ దృష్టి

ఎన్‌సిఆర్ ప్రాంతీయ రహదారి కనెక్టివిటీ సమస్యల పరిష్కారం

Posted On: 21 SEP 2022 1:50PM by PIB Hyderabad

హర్యానా,ఎన్‌సిటీ-ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల మధ్య  కంబైన్డ్ రెసిప్రొకల్ కామన్ ట్రాన్స్‌పోర్ట్ అగ్రిమెంట్ (కాంట్రాక్ట్ క్యారేజ్ మరియు స్టేజ్ క్యారేజ్) [సిఆర్‌సిటిఏ] పై ఒప్పందం కుదిరింది. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర రహదారి/లింకేజీల అనుసంధానం, రహదారి ఎన్‌సిఆర్‌లో సిఎన్‌జి/ఎలక్ట్రిక్ బస్సులు తిరిగే భద్రతపై అవకాశాలను అన్వేషించడం సిఓటిఎస్‌ (కమీషనర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీలు/కమీషనర్లు ఎన్‌సిఆర్) ఈ సమావేశంలో చర్చించబడిన కీలక అంశాలలో ఒకటి.

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డ్ (ఎన్‌సిఆర్‌పిబి) మెంబర్ సెక్రటరీ శ్రీమతి అర్చన అగర్వాల్ అధ్యక్షతన 19 సెప్టెంబర్ 2022న సిఓటిఎస్‌ (కమీషనర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీలు/కమీషనర్లు ఆఫ్ ఎన్‌సిఆర్‌) సమావేశం ఢిల్లీలో జరిగింది. హర్యానా రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ,రవాణా స్పెషల్‌ కమీషనర్, జీఎన్‌సిటీ ఆఫ్ ఢిల్లీ, స్పెషల్ సెక్రటరీ, అర్బన్ డెవలప్‌మెంట్, ఢిల్లీ జిఎన్‌సిటీ మరియు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్, ఎన్‌హెచ్‌ఏఐ, ఎంఓఆర్‌టీహెచ్‌, పిడబ్ల్యూడి, ఢిల్లీ మరియు హర్యానా, పిఎన్‌జిఆర్‌బి, ఎంపిఎన్‌అండ్‌జీ,ఐజీఎల్‌,డిడిఏ,జిఎండీఏ,యుటీటీఐపీఈసీ రవాణా శాఖల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

భాగస్వామ్య రాష్ట్రాల అద్భుతమైన ప్రయత్నాలను చైర్‌పర్సన్ ఈ సందర్భంగా అభినందించారు. అలాగే సిఆర్‌సిటీఏ ఒప్పందాన్ని ఖరారు చేయడంలో చురుకైన విధానానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యంగా ఎన్‌సిఆర్‌ రాష్ట్రాల కార్యదర్శులు/రవాణా కమిషనర్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

ఎన్‌సిఆర్‌  రాష్ట్రాలకు చెందిన మోటారు క్యాబ్‌లు/టాక్సీలు/ఆటో రిక్షాలు, విద్యా సంస్థల వాహనాలు మరియు స్టేజ్ క్యారేజ్ బస్సులు (సిటీ బస్ సర్వీసులుకూడా) ఎన్‌సిఆర్ భాగస్వామ్య రాష్ట్రాల్లో ఒకసారి రుసుము/పన్ను లేదా ఏదైనా ఇతర పేరుతో పిలవబడే అటువంటి పన్నును ఒకసారి ఎన్‌సిఆర్‌లో చెల్లించిన తర్వాత మిగతాచోట్ల చెల్లించాల్సిన అవసరం లేకుండా వాహనాలను నడపడానికి వీలుగా అవసరమైన నోటిఫికేషన్ జారీ చేయడానికి ఎన్‌సిఆర్ రాష్ట్రాలు అవసరమైన చర్య తీసుకుంటాయి.

వీటితో పాటు సిఆర్‌సిటీఏ కింద అటువంటి అన్ని వాహనాలలో ఆపరేషనల్ వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు మరియు స్పీడ్ గవర్నర్‌లను అమర్చడం మరియు భారత ప్రభుత్వ ఎంఓఆర్‌టిహెచ్‌  మోటారు వెహికల్ అగ్రిగేటర్స్ మార్గదర్శకాలు-2020 స్ఫూర్తితో ఎన్‌సిఆర్‌కు మోటారు వాహనాల అగ్రిగేటర్‌ల నియమాలను రూపొందించడం మరియు సమన్వయం చేయడంపై వేగంగా పని చేయడానికి సమావేశంలో చర్చించారు.

ఢిల్లీకి సిఎన్‌జి లేదా పర్యావరణ అనుకూల ఇంధనంతో నడిచే బస్సులను మాత్రమే అనుమతించాలనే జిఎన్‌సిటి ఢిల్లీ చేసిన ప్రతిపాదనపై కూడా సవివరంగా చర్చజరిగింది. తమ డీజిల్ బస్సులను సిఎన్‌జికి లేదా ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చే అవకాశాలను అన్వేషించాలని ఎన్‌సిఆర్ రాష్ట్రాలు కోరాయి.

ఎన్‌సిఆర్‌కు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంబంధిత ఏజెన్సీలు/డిపార్ట్‌మెంట్‌లతో నిరంతరం కొనసాగే ఈ కింది అంతర్ రాష్ట్ర కనెక్టివిటీ రోడ్‌లు/లింకేజీల సమస్యలు ఈ సమావేశంలో చర్చించబడ్డాయి మరియు సమీక్షించబడ్డాయి:

 

  • ఢిల్లీలోని ఆశ్రమ్ చౌక్ నుండి ఫరీదాబాద్ వరకూ ఉన్న కాళింది బై-పాస్ రోడ్డు.
  • నోయిడాలోని షాహదారా డ్రెయిన్-అలైన్‌మెంట్ ఫారమ్ చిల్లా రెగ్యులేటర్ (మయూర్ విహార్ దగ్గర), సెక్టార్-14A నుండి ఎంపీ-3 రోడ్డు (మహామయ ఫ్లైఓవర్) వెంట ఎలివేటెడ్ రోడ్డు.
  • గుర్గావ్‌ను కలుపుతూ జోనల్ ప్లాన్ కే-IIలో 80 మీ ద్వారకా లింక్ (ఎన్‌పిఆర్‌ ద్వారా 150మీ వెడల్పుతో 30 మీటర్ల వెడల్పు గల గ్రీన్ బెల్ట్‌తో ఉంటుంది).
  • గుర్గావ్ ప్రాంతాన్ని నజాఫ్‌గఢ్ రహదారితో కలిపే 75 మీటర్ల వెడల్పు గల రోడ్డు లింక్.
  • సెక్టార్ 168 & 167-ఏ, నోయిడాను లాల్‌పూర్ గ్రామం, ఫరీదాబాద్‌తో కలిపే వంతెన.
  • సెక్టార్ 149-ఏ & 150, నోయిడాను తిలోరి విలేజ్, ఫరీదాబాద్‌తో కలిపే వంతెన.
  • ఛప్రౌలీ, హత్వాలా మధ్య యమునా వంతెన ( పానిపట్ విలేజ్, హర్యానా).
  • యుఈఆర్-I, ఢిల్లీ నుండి ఖేక్రా సిటీ వరకు ఎన్‌హెచ్‌-57 మరియు యూఈఆర్-II, ఢిల్లీ నుండి ట్రోనికా సిటీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని ఎన్‌హెచ్‌-57 వరకు.
  • మెహ్రౌలీ-గుర్గావ్ రోడ్డు ఎన్‌హెచ్‌-236గా అభివృద్ధి చేయబడుతుంది.
  • రింగ్ రోడ్ (ఇందర్ లోక్ మెట్రో స్టేషన్) మురియు ఇప్పటికే ఉన్న యమునా కెనాల్ లింక్ రోడ్డు నుండి హర్యానా బోర్డర్ వరకు రహదారి.
  • ఢిల్లీ రిడ్జ్‌ మీదుగా నెల్సన్ మండేలా టి-పాయింట్ (వసంత్ కుంజ్ ఫ్లైఓవర్ దగ్గర)ని కలిపే ప్రస్తుత జిజీఎన్-మోహ్‌రౌలి రహదారి.
  • ఢిల్లీలోని అంధేరియా మోర్ వరకు గ్వాల్ పహారీ మండి గడైపూర్-జాన్‌పూర్ రహదారిని అప్‌గ్రేడ్ చేయడం.


రోడ్డు భద్రత సమస్యలపై ఈ సమావేశం దృష్టి సారించింది. ఎన్‌సిఆర్‌లోని పిటిజెడ్ కెమెరాలు, ఎమర్జెన్సీ ట్రామా కేర్ సెంటర్‌లు, నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు మరియు ఎన్‌సిఆర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వేలతో పాటు బ్లాక్ స్పాట్‌లపై డేటాను కంపైల్ చేయాలని ఎన్‌సిఆర్ రాష్ట్రాలను అభ్యర్థించారు.

***


(Release ID: 1861156) Visitor Counter : 139