ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆపరేషన్ 'గేర్ బాక్స్'లో 39.5 కిలోల అనుమానిత మాదక ద్రవ్యం- హెరాయిన్ 72 ప్యాకెట్లను కనుగొన్న డీఆర్ఐ

Posted On: 09 SEP 2022 6:16PM by PIB Hyderabad

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)  గుజరాత్ లోని  ఏ టీ ఎస్ టి తో కలిసి దుబాయ్ నుంచి వచ్చిన కంటైనర్ లో

హెరాయిన్ గా అనుమానిస్తున్న 72 ప్యాకెట్లను కనుగొంది. ఈ ప్యాకెట్ల లో మొత్తం 39.5 కిలోల మాదక ద్రవ్యం పౌడర్ ఉంది.

డీఆర్ఐ, ఏటీఎస్ గుజరాత్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆపరేషన్ 'గేర్ బాక్స్'ను ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా పోర్టులో

గుజరాత్ ఏటీఎస్ అధికారుల సమక్షంలో డీఆర్ఐ ఒక కంటైనర్ ను తనిఖీ చేసింది. 9,300 కిలోల స్థూల బరువు కలిగిన దుబాయ్ లోని జెబెల్ అలీకి చెందిన కంటైనర్ లో భారీ మెల్టింగ్ స్క్రాప్ ఉన్నట్లు ప్రకటించారు. ఈ కంటైనర్ కోసం బిల్ ఆఫ్ ఎంట్రీ దాఖలు కాలేదు. గూడ్స్ మెటాలిక్ స్క్రాప్ గేర్ బాక్స్ లు వంటి మెషిన్ పార్టులుగా ఉన్నట్లు గుర్తించారు. 

సమగ్ర తనిఖీ, అంటే, గేర్ బాక్సులు ఇతర లోహపు స్క్రాప్లను విడదీసిన సందర్భంగా మొత్తం 39.5 కిలోల పౌడర్ ఉన్న 72 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫీల్డ్ టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షించినప్పుడు నార్కోటిక్ పదార్థం హెరాయిన్ ఉనికిని ధృవీకరించింది. తదుపరి దర్యాప్తు ను కొనసాగిస్తున్నారు.

డ్రగ్ సిండికేట్ హెరాయిన్‌ను దాచిపెట్టడానికి తెలివిగా ఈ ప్రత్యేకమైన కార్యనిర్వహణ పద్ధతిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. పాత మరియు ఉపయోగించిన గేర్‌బాక్స్‌ల నుండి గేర్‌లను తెరిచిన తర్వాత వాటిని తొలగించి మత్తు పదార్థాలతో కూడిన ప్లాస్టిక్ ప్యాకెట్‌లను అడుగు భాగం లో పెట్టి

వాటిని గుర్తించబడకుండా ఉండటానికి గేర్‌బాక్స్‌లను మళ్లీ యధావిధిగా అమర్చారు.

ఈ ప్యాకెట్ల ను  ఇతర లోహపు స్క్రాప్ లతో పాటు మెటల్ స్క్రాప్ లోపల దాచి రవాణా చేశారు. తద్వారా ఇది అధికారులు  గుర్తించ కుండా జాగ్రత్త పడ్డారు. ఎన్ డిపిఎస్ చట్టం, 1985 నిబంధనల కింద డిఆర్ ఐ ద్వారా పరీక్షలు , సీజ్ ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి.

మాదకద్రవ్యాల సిండికేట్ ప్రతిసారీ ఇలాంటి వినూత్నమైన కిటుకులతో తన చట్ట విరుద్ధ కార్యకలాపాలు  కొనసాగిస్తోంది. 75 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్న ఒక కేసులో, 395 కిలోల బరువున్న దారాలను మాదక ద్రవ్యాలను కలిగి ఉన్న ద్రావణంలో నానబెట్టినట్లు కనుగొనబడింది - హెరాయిన్ ను ఎండబెట్టి, బేల్స్ గా తయారు చేసి, బ్యాగులలో ప్యాక్ చేశారు.

ప్రస్తుత కేసులో తదుపరి సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

 

****



(Release ID: 1858235) Visitor Counter : 132


Read this release in: English , Urdu , Hindi