నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్‌’లో పాల్గొన్న శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


విద్యావేత్తలు, పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధిలో సహకారాన్ని బలోపేతం చేయాలని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపు

Posted On: 08 SEP 2022 4:46PM by PIB Hyderabad

అమెరికా -భారత్  బిజినెస్ కౌన్సిల్ , అమెరికా  ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, సౌత్ ఆసియా నిర్వహించిన 'ఇండియా ఐడియాస్ సమ్మిట్‌'లో కేంద్ర విద్యనైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు పాల్గొన్నారు. "అమెరికా  - భారతదేశ తదుపరి 75 సంవత్సరాల శ్రేయస్సును పెంచడం"- ఈ కార్యక్రమ ఇతివృత్తం. ఈ కార్యక్రమంలో అమెరికా కంపెనీల ముఖ్య కార్య నిర్వాహణాధికారులు, ఉన్నత స్థాయి యాజమాన్య ప్రతినిధులు  పాల్గొన్నారు.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001U20L.jpg

భారతదేశం-అమెరికా సంబంధాల గురించి శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ, భారతదేశం,అమెరికా సంయుక్త రాష్ట్రాలు  ఒకే విధమైన సమాజాలను కలిగి ఉన్నాయని, విలువలను పంచుకున్నాయని అన్నారు. విద్య,నైపుణ్యాభివృద్ధి భారత్-అమెరికా సంబంధాలకు ముఖ్యమైన మూల స్తంభాలు అని ఆయన అన్నారు. ట్విన్నింగ్, జాయింట్ డిగ్రీలు, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందించడానికి రెండు దేశాల్లో ఉన్నత విద్యా సంస్థల మధ్య గొప్ప విద్యాపరమైన సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు

 

పరిశ్రమల అధిపతులతో సంభాషిస్తున్నప్పుడు, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగంలో భారతదేశ దృష్టిని శ్రీ ప్రధాన్ వివరించారు. జాతీయ విద్యా విధానం 2020 గురించి మాట్లాడుతూ, 21వ శతాబ్దపు అభ్యాసకులను శక్తివంతం చేయడంలో శక్తివంతమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని నిర్మించడంలో దాని పాత్రను ఆయన వివరించారు.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002Y45B.jpg

 

విద్య అంతర్జాతీయీకరణ పై జాతీయ విద్యా విధానం -NEP దృష్టి గురించి మంత్రి ప్రధాన్ మాట్లాడుతూ, విద్య, నైపుణ్యం స్థూల రూపాన్ని   వేగంగా మార్చడంలో భారతదేశంతో భాగస్వామ్యం కావాలని అమెరికన్ సంస్థలు, కంపెనీలకు మంత్రి ప్రధాన్ పిలుపునిచ్చారు. పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఆకాంక్షాత్మక జనాభా, విజ్ఞాన ఆధారిత సమాజం, విధాన సంస్కరణలు, భారతదేశంలో అపూర్వమైన అవకాశాలను సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు.

 

నైపుణ్యం గురించి మంత్రి మాట్లాడుతూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం తన యువతలో నైపుణ్యం, పునః నైపుణ్యాలను పెంచడంలో గొప్ప ప్రయత్నాలు చేస్తోందన్నారు. భారతదేశం అధికంగా  విద్యావంతులైన యువ  జనాభాను కలిగి ఉంది, వారికి  పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కేంద్రీకృత శిక్షణ సామర్థ్యాన్ని పెంపొందించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఏ పరిశ్రమకైనా గొప్ప ఆస్తిగా నిలుస్తారని ఆయన అన్నారు. ప్రధానంగా దాని జనాభాపరంగా ప్రయోజనం, వివిధ నైపుణ్య కార్యక్రమాలఅమలు కారణంగా భారతదేశం అనుకూలంగా ఉందని కూడా ఆయన అన్నారు.

 

****



(Release ID: 1857928) Visitor Counter : 117