కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఐఈపీఎఫ్ఏ 6వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సెమినార్ నిర్వహించిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్)
Posted On:
07 SEP 2022 5:15PM by PIB Hyderabad
ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నేడు ఐఈపీఎఫ్ఏ 6వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పెట్టుబడిదారులలో ఆర్థిక అక్షరాస్యత, పెట్టుబడిదారుల అవగాహన మరియు రక్షణను పెంపొందించడానికి సెమినార్‌ను నిర్వహించాయి.
శ్రీమతి అనితా షా అకెల్లా, సీఈఓ, ఐఈపీఎఫ్ఏ, సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్‌లో ప్రసంగించారు. పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, వాటాదారులందరికీ వారి సరైన షేర్లు, డివిడెండ్‌లు మరియు డిబెంచర్‌లకు హామీ ఉండేలా చూసుకోవడం వంటి అంశాల ఆవశ్యకతను ఆమె తెలిపారు.
శ్రీమతి అకెల్లా అనితా షా మాట్లాడుతూ, "ఐపీఈఎఫ్ఏ 2016లో ప్రారంభమైనప్పటి నుండి పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడంలో, ఆర్థిక అక్షరాస్యతను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. యువతలో, ముఖ్యంగా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులలో ఆర్థిక అక్షరాస్యతను వ్యాప్తి చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాం. తద్వారా వారు ఆరోగ్యకరమైన ఆర్థిక ప్రవర్తనను స్వీకరించడానికి వీలు కలుగుతుంది. యుక్తవయస్సులో ఆర్థిక పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని ఆమె యువతకు సూచించారు. ఐఈపీఎఫ్ఏ ఒక ప్రత్యేకమైన సంస్థ, పెట్టుబడిదారుల అవసరాలకు చాలా అనుకూలంగా ఉంటామని తెలిపారు. అదే సమయంలో వివిధ ఆర్థిక మోసాల నుండి వారిని రక్షిస్తామని తెలిపారు.. శ్రామిక జనాభా, విద్యార్థులు, గ్రామీణ నివాసులు, స్వయం సహాయక బృందాలు మరియు కూరగాయలు అమ్మేవారు, మత్స్యకారులు వంటి అట్టడుగు వర్గాలతో సహా సమాజంలోని అన్ని వర్గాల నుండి అనేక రకాల వ్యక్తులను తాము కలిగి ఉన్నట్లు తెలిపారు.
ఎన్‌సీఏఈఆర్ లో ఐఈపీఎఫ్ చైర్ ప్రొఫెసర్ మరియు ఆర్బఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మృదుల్ సాగర్, పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం ఐఈపీఎఫ్ఏ ద్వారా అమలు చేయడానికి ఉద్దేశించిన భవిష్యత్ విధానాలు మరియు పద్ధతుల ప్రాముఖ్యతను వెల్లడించారు.
డాక్టర్ మృదుల్ సాగర్ పెట్టుబడిదారుల రక్షణ, కార్పొరేట్ పరిపాలన సమస్యలు, డిజిటల్ ఆస్తులు మరియు ఈఎస్‌జీ పెట్టుబడి వంటి వివిధ కోణాలపై మాట్లాడారు. పొదుపు రేటు గరిష్టంగా 9.6 పీపీటీ తగ్గడం, ఆర్థిక వ్యవస్థలో గరిష్టంగా 12.5 పీపీటీ నుండి పెట్టుబడి రేటు తగ్గడం, దాని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించడం గురించి ఆయన మాట్లాడారు. "పొదుపు మరియు పెట్టుబడి రేటును వెనక్కి తీసుకురావడానికి మరియు అది వేగంగా వృద్ధి చెందడానికి, ఆర్థిక మార్కెట్లను లోతుగా మరియు విస్తరించడానికి మరియు పెట్టుబడిదారుల రక్షణ మరియు ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం." అని ఆయన తెలిపారు.
సెమినార్ లో పాల్గొన్న ప్యానెలిస్ట్‌లు ఆకర్షణీయమైన, ప్రత్యక్ష ఉదాహరణలను ఉపయోగించి ప్రేక్షకులకు సాధ్యమయ్యే మోసాల గురించి మరియు బ్యాంకింగ్ లావాదేవీలు చేయడంలో శ్రద్ధ వహించడానికి, ముఖ్యంగా పెరుగుతున్న డిజిటలైజేషన్ సందర్భంలో ప్రత్యక్ష ఉదారహణలు చూపించారు. సెమినార్ కు ప్రేక్షకులు చురుకుగా పాల్గొనడం, ప్యానెలిస్ట్‌లు మరియు ప్రేక్షకుల మధ్య అర్థవంతమైన చర్చ జరిగింది.
ఈ సెమినార్‌కు పెట్టుబడిదారుల సంఘం, ఎన్‌సీఏఈఆర్ ఫ్యాకల్టీ, ఐఈపీఎఫ్ఏ సిబ్బంది మరియు వివిధ కళాశాలల నుండి ఆర్థిక శాస్త్రం మరియు వ్యాపార విభాగాలకు చెందిన విద్యార్థులు, పెద్ద ఎత్తున హాజరయ్యారు.
భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఐఈపీఎఫ్ఏ మద్దతుతో ఎన్‌సీఏఈఆర్ లో ఐఈపీఎఫ్ స్థాపించబడింది. డాక్టర్ సాగర్ పెట్టుబడిదారుల అవగాహన, రక్షణ మరియు ఆర్థిక రంగ సంస్కరణల గురించి ఆందోళనలతో సహా నియంత్రణ మరియు పరిశోధన, పబ్లిక్ పాలసీల విధాన వ్యాప్తిపై దృష్టి సారించే సెమినార్ గ్రూపునకు నాయకత్వం వహించారు.
ఆర్థిక లావాదేవీల డిజిటలైజేషన్ పెరుగుతున్న వాతావరణంలో పెట్టుబడిదారులను రక్షించాల్సిన ఆవశ్యకతపై కూడా సెమినారులో దృష్టి సారించారు. “డిజిటల్ ప్రపంచంలో పెట్టుబడిదారుల రక్షణ” పై నిర్వహించిన ప్యానెల్ చర్చతో సెమినార్ ముగిసింది. ఈ ప్యానెల్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఈపీఎఫ్ఏ మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మరియు ఢిల్లీ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం నుండి ప్రముఖ నిపుణులు పాల్గొన్నారు. వీరిలో ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయంత్ కుమార్ దాస్, సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిర్రాజ్ ప్రసాద్ గార్గ్ మరియు శ్రీ కె.పి.ఎస్. మల్హోత్రా, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO), ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ పాల్గొన్నారు.
సైబర్ మోసాల అంశంపై సెమినార్ ప్యానలిస్టులు సుదీర్ఘంగా చర్చించారు. భారతదేశం జీ20 అధ్యక్షత సమావేశాలకు వివిధ డిజిటల్ ఎకానమీ సమస్యలపై అంతర్జాతీయ సమన్వయాన్ని చేపట్టాలని డాక్టర్ మృదుల్ సాగర్ సూచించారు.
IEPFA గురించి
ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ సెప్టెంబర్ 7, 2016న, భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. మెచ్యూర్డ్ డిపాజిట్లు/డిబెంచర్లు, ఇతర విషయాలతోపాటు, పెట్టుబడిదారులకు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్‌ను షేర్లు, క్లెయిమ్ చేయని డివిడెండ్‌ల వాపసు చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది..
NCAER గురించి
ఎన్‌సీఏఈఆర్ భారతదేశంలోని పురాతన మరియు అతిపెద్ద స్వతంత్ర ఎకనామిక్ థింక్ ట్యాంక్, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు సంబంధించిన విధాన ఎంపికలను తెలియజేయడానికి 1956లో ఏర్పాటు చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని స్వతంత్ర థింక్ ట్యాంక్‌లలో ఇది ఒకటి. ఇది ముఖ్యంగా పెద్ద-స్థాయి గృహ సర్వేల కోసం కఠినమైన ఆర్థిక విశ్లేషణ మరియు పాలసీ ప్రచారాలను లోతైన డేటా సేకరణ సామర్థ్యాలతో మిళితం చేస్తుంది. ఎన్‌సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్, మొదటి మహిళా అధిపతి డాక్టర్ పూనమ్ గుప్తా, 1 జూలై 2021న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇది ప్రస్తుతం శ్రీ నందన్ నీలేకని అధ్యక్షతన స్వతంత్ర పాలకమండలిచే నిర్వహించబడుతోంది.
****
(Release ID: 1857753)
Visitor Counter : 115