హోం మంత్రిత్వ శాఖ
విపత్తు నిర్వహణ రంగం లో సహకారం అంశం పై భారత గణతంత్రం యొక్క నేశనల్డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆథారటీ కి మరియు మాల్దీవుల గణతంత్రం యొక్క నేశనల్డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆథారటీ కి మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) కుఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
07 SEP 2022 4:05PM by PIB Hyderabad
విపత్తు నిర్వహణ రంగం లో సహకారం అంశం పై భారత గణతంత్రం యొక్క నేశనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆథారటీ కి మరియు మాల్దీవుల గణతంత్రం యొక్క నేశనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆథారటీ కి మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) కు మాన్య ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలియజేసింది.
ప్రయోజనాలు:
ఈ ఎమ్ఒయు ఇటు భారతదేశం, అటు మాల్దీవులు పరస్పరం విపత్తు నిర్వహణ సంబంధి యంత్రాంగాల నుండి లబ్ధి ని పొందేటటువంటి ఒక వ్యవస్థ ను ఏర్పాటు చేసేందుకు పాటుపడుతుంది. అలాగే ఇది విపత్తు నిర్వహణ రంగం లో సన్నద్ధత, ప్రతిక్రియ, మరియు సామర్థ్యం పెంపుదల తో ముడిపడిన కార్యక్రమాల ను బలపరచడం లో సాయపడుతుంది.
ఎమ్ఒయు తాలూకు ముఖ్యాంశాలు:
- పెద్ద స్థాయి విపత్తు సంభవించినప్పుడు అత్యవసర సహాయం, ప్రతిక్రియ, మానవీయ సాయం సంబంధి రంగాల లో ఒక పక్షం అభ్యర్థించిన మీదట రెండో పక్షాని కి పరస్పరం సహకారాన్ని అందజేస్తుంది.
- ఉభయ పక్షాలు విపత్తు వేళ లో తీసుకోవలసిన ఉత్తమ చర్య లు, ప్రతిక్రియ, నష్టాన్ని తగ్గించడం, ప్రణాళిక రచన మరియు సన్నద్ధతల తో ముడిపడ్డ అనుభవాన్ని, కార్యప్రణాళికల ను వెల్లడించుకొంటాయి.
iii. ఇరు పక్షాలు విపత్తు వేళ లో తలెత్తే నష్ట ప్రభావాన్ని నివారించడం కోసం విపత్తు ను నిరోధించడం కోసం విపత్తు యొక్క నష్టభయాన్ని అంచనా వేసే సమాచారిన్ని ఆదానం ప్రదానం చేసుకోవడం సహా శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ డేటా ను మరియు అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం ఆధారిత సేవ ల తాలూకు నైపుణ్యాన్ని పరస్పరం అందజేసుకొంటాయి.
iv. ఉభయ పక్షాలు ఆధునిక సమాచార సాంకేతిక విజ్ఞానం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లు, రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ కమ్యూనికేశన్ ఎండ్ నేవిగేశన్ సర్వీసుల రంగం లో పరస్పరం సహకారాన్ని అందజేసుకొంటాయి.
- విపత్తు సంబంధిత నష్టభయాన్ని తగ్గించడం లో వివిధ రంగాల ను ప్రధాన స్రవంతి లోకి తీసుకు వచ్చి శిక్షణ ను మరియు సామర్థ్యం పెంపుదల కార్యక్రమాల ను నిర్వహించడాన్ని గురించి ఇరు పక్షాలు పరిశీలన జరుపుతాయి. ఉభయ పక్షాలు సీనియర్ అధికారుల కు మరియు అత్యవసర నిర్వహణ సేవలలో పాలుపంచుకొనే సహాయక సిబ్బంది కి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక శిక్షణ ను పొందేందుకు అవకాశాల ను ఏర్పరుస్తాయి.
vi. ఉభయ పక్షాలు దేశీయం గా, అంతర్జాతీయ స్థాయి లో ఏర్పాటయ్యే ప్రదర్శనల ను గురించిన సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకొంటాయి. పరిశోధన, జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, ఫేకల్టీ సపోర్ట్ ప్రోగ్రాము, విపత్తు తాలూకు నష్ట భయాన్ని తగ్గించడానికి సంబంధించిన కార్యకలాపాలపై రూపొందించిన పత్రాలు, విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రతచర్య లు, చేపట్టవలసిన కార్యక్రమాలు, క్లయిమేట్ ఛేంజ్ ఎడాప్టేశన్ కు సంబంధించిన అకాడమిక్ ప్రోగ్రాముల వంటి రంగాల లో సైతం రెండు పక్షాలు పరస్పరం సహకరించుకొంటాయి.
vii. ఉభయ పక్షాలు విపత్తు నిర్వహణ కు సంబంధించిన ఇతర కార్యకలాపాల లో ఏ మేరకు మరింత గా సహకరించుకోవాలో అనేది నిర్ధారిస్తాయి.
viii. ఉభయ పక్షాలు సునామీ సంబంధి సూచన లు, తుఫాను తాలూకు అపాయాలు, పెద్ద అలల కు సంబంధించిన హెచ్చరిక లు, వివిధ రకాలైన అపాయాలతో తలత్తే నాజూకు స్థితి కి సంబంధించిన సమాచారాలను మరియు వాటి కోస్తా తీరప్రాంతాల లో సముద్ర సంబంధి విపత్తు ల కారణం గా ఎదురయ్యే విబిన్న తరహా అపాయాల అంచనా లను గురించి ఒక దానికి దృష్టి కి మరొకటి తీసుకు రాగలుగుతాయి.
ix. ఇరు పక్షాలు న్యూమరికల్ వెథర్ ప్రిడిక్శన్ (ఎన్ డబ్ల్యుపి) ఉత్పాదనల మరియు ఎక్స్ టెండెడ్ రేంజ్ ఫోర్ కాస్ట్ (ఇఆర్ఎఫ్) కు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం వెల్లడించుకొనేందుకు కూడా ఆస్కారం ఉంది.
x. ఇరు పక్షాలు భారతదేశ వాతావరణ ఉపగ్రహ డేటా చిత్రణ కోసం రియల్ టైమ్ అనాలిసిస్ ఆఫ్ ప్రోడక్ట్ స్ ఎండ్ ఇన్ఫర్మేశన్ డిసెమినేశన్ (ఆర్ఎపిఐడి) వరకు భారతదేశ పక్షం యొక్క చేరిక తాలూకు ఏర్పాటు చేయడం తో పాటే భారతదేశం యొక్క వాతావరణ అధ్యయన విభాగం (ఐఎమ్ డి) ద్వారా ఎన్ డబ్ల్యుపి మరియు ఉపగ్రహ వాతావరణ విజ్ఞానం విషయం లో శిక్షణ ను ఇవ్వడానికి సంబంధించిన సూచనల ను ఆదాన ప్రదానం చేసుకొనేందుకు కూడా ఆస్కారం ఉంది.
xi. ఉభయ పక్షాలు సంవత్సరానికి ఒకసారి విపత్తు నిర్వహణ అభ్యాసాన్ని రెండు దేశాల లో వేరు వేరు భౌగోళిక ప్రదేశాల లో ఏర్పాటు చేస్తాయి.
***
(Release ID: 1857577)
Visitor Counter : 270