సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ప్రెస్ టూర్’లో పంజాబ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జర్నలిస్టుల బృందం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ (ఇబిఎస్‌బి) కింద ఆంధ్రప్రదేశ్‌ లో తమ వారం రోజుల పర్యటనను విజయవంతంగా పూర్తి చేసింది.


నాడు పోస్టు చేయడమైనది: 07 SEP 2022 2:58PM by PIB Hyderabad

బృందం శ్రీ సిటీ సందర్శనతో తమ పర్యటనను ముగించింది, అక్కడ అసిస్టెంట్ జనరల్ మేనేజర్  (మార్కెటింగ్) శ్రీ హరి, ప్రజాసంబంధాల అధికారి  శ్రీ రవీంద్రనాథ్‌లతో సంభాషించారు, అక్కడ షామీ సంస్థ  ద్వారా మొబైల్ ఫోన్‌ల తయారీ,  బెల్జియం కంపెనీ వేర్మైరాన్  ద్వారా చక్రాల కుర్చీల తయారీ గురించి వివరించారు. వారి ఉత్పత్తులలో 95%  ఎగుమతి చేస్తున్నారు. తయారీ యూనిట్లన్నీ మేక్ ఇన్ ఇండియాకార్యక్రమం కింద పనిచేస్తున్నాయి.

విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు చెందిన వివిధ రాష్ట్రాల ప్రజల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడానికి   పంజాబ్‌కు చెందిన జర్నలిస్టుల బృందం  ప్రెస్ టూర్పేరున ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు . ప్రతి రాష్ట్రం EBSB కింద మరొక రాష్ట్రంతో జత ఐన నేపధ్యంలో  ఆంధ్రప్రదేశ్ పంజాబ్‌ను ఆంధ్రప్రదేశ్ తో  జత చేశారు.

జర్నలిస్టుల వారం రోజుల పర్యటన సెప్టెంబర్ 1వ తేదీన నేవల్ డాక్‌యార్డ్‌  సందర్శించడంతో ప్రారంభమైంది, అక్కడ వారికి డాక్‌యార్డ్ సాధించిన విజయాల గురించి అడ్మిరల్ (సూపరిడెంట్.) సంజయ్ సాధు వివరించారు.

తర్వాత రోజు విశాఖపట్నం నగర మేయర్ శ్రీమతి GHV కుమారి తో బృందం సమావేశమైంది. మునిసిపల్ కమీషనర్ శ్రీ జి. లక్ష్మీషా స్వచ్ఛ భారత్ మిషన్ కింద కార్పొరేషన్ సాధించిన విజయాలను వివరించారు. ప్రజల సహకారంతో మునిసిపల్ కార్పొరేషన్ విజయవంతంగా సముద్ర తీరాలను, పరిశుభ్రంగా  చెత్త రహితంగా ఉంచడంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర వస్తువులను విజయవంతంగా నిలిపివేసిందని కమిషనర్ తెలిపారు.

 కార్పొరేషన్ ద్వారా శుద్ధి చేసిన తర్వాత మురుగునీటిని పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేయడం ద్వారా నెలకు రూ.4.07 కోట్ల ఆదాయం సమకూరుతుందని కమిషనర్ తెలిపారు.

పాడేరులో ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ గోపాల కృష్ణ రోణంకి తో జర్నలిస్టుల బృందం మాట్లాడింది, గిరిజనులకు వారి స్వంత నివాస ప్రాంతాలలో మెరుగైన జీవనం అందించడానికి నిర్వహిస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి వివరించారు. వారికి జీవనోపాధి కల్పించడంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

మూడో రోజున, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) చేపట్టిన కొత్త ప్రాజెక్టుల గురించి కూడా జర్నలిస్టులకు వివరించారు. అసిస్టెంట్ డైరెక్టర్, కెపాసిటీ బిల్డింగ్, డా. లజ్వంతి నాయుడు, డిప్యూటీ సీఈఓ శ్రీ వి. రాముడు మరియు జనరల్ మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ & మార్కెటింగ్ శ్రీ భవానీ ప్రసాద్‌తో కలిసి బ్లూ ఎకానమీ ప్రాజెక్ట్‌   గురించి వివరించారు, దీని కింద APTDC పర్యాటకులను ఆకర్షించడానికి హోటల్‌లు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. వారు భారత ప్రభుత్వ బ్లూ ఎకానమీ ప్రాజెక్ట్, స్వదేశ్ దర్శన్ ప్రాజెక్టుల గురించి పాత్రికేయులకు వివరించారు.

ఈ బృందం కొండపల్లి గ్రామాన్ని సందర్శించి రాష్ట్ర అవార్డు గ్రహీత కళాకారుడు శ్రీ కె. వెంకటాచారి కుటుంబాన్ని కలిసి కొండపల్లి బొమ్మల మూలాన్ని తెలుసుకుంది. వారు కొండపల్లి కోటను సందర్శించారు, అక్కడ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు పాత్రికేయులకు ప్రత్యేకంగా కొండపల్లి యాప్‌ను ప్రారంభించడంలో ఏఎస్‌ఐ చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.

శ్రీకాళహస్తిలో కొద్దిసేపు ఆగిన తర్వాత బృందం మంగళవారం పంజాబ్‌కు బయలుదేరింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, చండీగఢ్ నిర్వహించిన పంజాబ్ నుంచి జర్నలిస్టుల సందర్శనను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి కార్పోరేషన్ కార్యక్రమాన్ని, పర్యటనను  సమన్వయం చేసింది.


***


(రిలీజ్ ఐడి: 1857397) సందర్శకుల సూచీ సంఖ్య : : 100
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English