జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌ షహర్‌ లో 400 మందికి పైగా రైతుల కోసం సహజ వ్యవసాయం పై వర్క్ షాప్ నిర్వహించిన - ఎన్.ఎం.సి.జి. & సహకార భారతి


'అర్త్ గంగా' కింద సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి గంగా బేసిన్‌ లో 75 గంగా సహకార గ్రామాలను ఏర్పాటు చేయనున్న - ఎన్.ఎం.సి.జి. & సహకార భారతి


సుస్థిర వ్యవసాయం యొక్క లక్ష్యాన్ని అందించడంలో గంగా సహకర గ్రామాల భావన భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది: డి.జి., ఎన్.ఎం.సి.జి

నాడు పోస్టు చేయడమైనది: 05 SEP 2022 6:53PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌ లోని బులంద్‌ షహర్ జిల్లా, ముబారిక్‌ పూర్ బంగర్ గ్రామంలో 400 మందికి పైగా రైతుల కోసం, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్.ఎం.సి.జి)  మరియు సహకార భారతి సంస్థలు ఈ రోజు 'విశాల్ కిసాన్ సమ్మేళన్' వర్క్‌-షాప్‌ ను నిర్వహించాయి.   అర్థ్ గంగా కింద సహజ వ్యవసాయంతో పాటు ఇతర కార్యకలాపాలను ప్రోత్సహించడానికి గంగా పరీవాహక ప్రాంతంలో కనీసం 75 గంగా సహకార గ్రామాలను ఏర్పాటు చేయడానికి ఎన్.ఎం.సి.జి. మరియు సహకార భారతి సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యు) లో భాగంగా ఈ వర్క్‌-షాప్ జరిగింది.  జలజ్, సహజ వ్యవసాయం, ఘాట్-పే-హాత్, బురద నుండి ఎరువులు, వ్యవసాయ / ఉద్యానవన ఉత్పత్తుల మార్కెటింగ్, పర్యాటకం మొదలైన వాటి అనుసంధానతను నిర్ధారించడానికి అన్ని  అర్థ్ గంగ సంబంధిత కార్యక్రమాలను ఒకచోట చేర్చడం ఈ వర్క్‌-షాప్ / సమావేశం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ నుంచి 400 మందికి పైగా రైతులతో పాటు, జిల్లా స్థాయి అధికారులు, 'స్టేట్-మిషన్-ఫర్-క్లీన్-గంగా', ఉత్తరప్రదేశ్, వైల్డ్‌-లైఫ్- ఇనిస్టిట్యూట్-ఆఫ్-ఇండియా, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, 'గంగా-విచార్-మంచ్' పలు ఇతర సంస్థల కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.  ఉపేంద్ర నగర్ లోని పొలాలకు క్షేత్ర పర్యటన కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సహజ వ్యవసాయానికి సంబంధించిన సాంకేతికతలను పర్యటనలో పాల్గొన్న రైతులకు, అధికారులకు వివరించడం జరిగింది.  ఇటీవల, మహారాష్ట్రలోని షిర్డీలో 2022 ఆగస్టు 18వ తేదీ నుంచి, 22వ తేదీ వరకు నిర్వహించిన సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ (ఎస్.పి.ఎన్.ఎఫ్) ట్రైనింగ్-కమ్-వర్క్‌షాప్ శిబిరాన్ని సందర్శించడానికి, గంగా బేసిన్ నుంచి సుమారు 30 మంది రైతులకు ఎన్.ఎం.సి.జి. అవకాశం కల్పించింది. 

 

డైరెక్టర్ జనరల్, శ్రీ జి. అశోక్ కుమార్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఎన్.ఎం.సి.జి. మరియు సహకార భారతి సంస్థల మధ్య అనుబంధం సుస్థిర వ్యవసాయం మరియు జీరో బడ్జెట్ సహజ వ్యవసాయ రంగంలో సానుకూల వాతావరణాన్ని కల్పిస్తోందని పేర్కొన్నారు.   ఈ భాగస్వామ్యం గంగా పరీవాహక ప్రాంతాల్లో గంగా సహకార గ్రామాలను ఏర్పాటు చేసే వినూత్న చొరవపై దృష్టి సారిస్తుంది.  దీనిని విజయవంతమైన నమూనా కార్యక్రమంగా మార్చడానికి, ఇతర గ్రామాలలో పునరావృతం చేయడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు, ఆయన చెప్పారు.  " చొరవ సహజ వ్యవసాయం ద్వారా ఉపాధి కల్పనపై దృష్టి పెడుతుందిస్థిరమైన వ్యవసాయ అభివృద్ధితో పాటువాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడం అనే జంట లక్ష్యాలను నెరవేర్చడానికి విశేషంగా కృషి చేయడం జరుగుతోంది." అని శ్రీ అశోక్ తెలియజేశారు. అదేవిధంగా, "ఎన్.ఎం.సి.జిద్వారా సమీప భవిష్యత్తులో  విధమైన వర్క్‌-షాప్‌ లు / సమావేశాలు మరెన్నో జరుగుతాయి." అని కూడా ఆయన చెప్పారు. 

 

అర్థ్ గంగా భావన గురించి, అర్థ్ గంగా ప్రచారం కింద చేపడుతున్న కార్యక్రమాల గురించి కూడా శ్రీ జి. అశోక్ కుమార్ వివరించారు.   'జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌' తో సహా  "ప్రతి బిందువుతో ఎక్కువ నికర ఆదాయాన్ని" ఉత్పత్తి చేయడం;  రైతుల కోసం 'గోబర్-ధన్';   బురద, మురుగునీటిని శుద్ధి చేసి, తిరిగి వినియోగించడం;  జలజ్, 'ఘాట్-మే-హాత్' వంటి జీవనోపాధి అవకాశాలను కల్పించడం;  స్థానిక ఉత్పత్తులు, ఆయుర్వేద, ఔషధ మొక్కలకు ప్రచారం కల్పించడం;  గంగా ప్రహరీల వంటి స్వచ్చంద కార్యకర్తల సామర్థ్యం పెంచడం;  వాటాదారుల మధ్య పెరిగిన సామరస్యాన్ని నిర్ధారించడానికి ప్రజల భాగస్వామ్యం మొదలైన అర్థ్ గంగా  లోని పలు ముఖ్యమైన భాగాల గురించి ఆయన ఈ సందర్భంగా  ప్రస్తావించారు.  కమ్యూనిటీ జెట్టీల ద్వారా బోట్ టూరిజం, యోగా ప్రచారం; సాహస పర్యాటనలు మొదలైన వాటి ద్వారా సాంస్కృతిక వారసత్వం, పర్యాటకం గురించి కూడా ఆయన మాట్లాడారు. 

సహకార భారతి జాతీయ అధ్యక్షుడు, శ్రీ డి.ఎన్. ఠాకూర్, ప్రారంభోపన్యాసం చేస్తూ,    "సహకార గంగా గ్రామాలు"  అనేది రైతుల కోసం వారి పొలాలను సిద్ధం చేయడంతో పాటు, వారి పంటల వైవిధ్యీకరణ,  పంటలను సురక్షితంగా ఉంచడం, సరైన మార్కెటింగ్, సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించడం, రైతుల జీవనోపాధి ప్రమాణాలను మెరుగుపరచడం వంటి వివిధ అంశాల్లో శిక్షణనిచ్చే ఒక సమగ్ర కార్యక్రమమని పేర్కొన్నారు. 

 

'యమునా-పర్-ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్' సందర్భంగా 2022 ఆగస్టు, 16వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో ఎన్.ఎం.సి.జి. మరియు సహకార భారతి సంస్థల మధ్య ఈ అవగాహన ఒప్పందం కుదిరింది.  ప్రజల భాగస్వామ్యం మరియు స్థానిక సహకార సంఘాలను సృష్టించడం, బలోపేతం చేయడం ద్వారా స్థిరమైన, ఆచరణీయమైన ఆర్థిక అభివృద్ధి యొక్క దృక్పథాన్ని సాధించడానికి ఈ ఎం.ఓ.యు. ఉద్దేశించబడింది, అర్థ్ గంగ యొక్క ఆదేశాన్ని నెరవేర్చడానికి వారి సహకారాన్ని నిర్దేశిస్తుంది.  ఎమ్.ఓ.యు. లో -    ఐదు రాష్ట్రాల్లో 75 సహకార గంగా గ్రామాల ఏర్పాటు;  రైతుల్లో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం;  గంగానది వెంబడి ఉన్న రాష్ట్రాల్లో ఎఫ్.పి.ఓ. మరియు సహకార సంస్థల ఏర్పాటు;  'ప్రతి నీటి బిందువు నుంచి ఎక్కువ నికర ఆదాయం' ఉత్పత్తి;  మార్కెట్ అనుసంధానతలను సృష్టించడం ద్వారా గంగ బ్రాండ్ క్రింద సహజ వ్యవసాయం / సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగును సులభతరం చేయడం,  ఆర్థిక అనుసంధానత మొదలైన వాటి ద్వారా ప్రజలు, నదుల మధ్య అనుసంధానత ప్రోత్సహించడం వంటి కొన్ని ప్రధాన లక్ష్యాలను పొందుపరచడం జరిగింది.

 

 

 

*****


(రిలీజ్ ఐడి: 1857032) సందర్శకుల సూచీ సంఖ్య : : 193
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी