భారత పోటీ ప్రోత్సాహక సంఘం

సిడిపిక్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఆసియా II ద్వారా అప్రావ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటా కొనుగోలుకు ఆమోదించిన సీసీఐ

Posted On: 05 SEP 2022 7:18PM by PIB Hyderabad

సిడిపిక్యూ   ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఆసియా II లిమిటెడ్  ద్వారా అప్రవ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (టార్గెట్)లో వాటాను  కాంపిటీషన్ యాక్ట్, 2002లోని సెక్షన్ 31(1) ప్రకారం కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. 

ప్రతిపాదిత కలయిక సీపీఎల్ జిపిఈసి (మారిషస్) హోల్డింగ్ లిమిటెడ్ నుండి టార్గెట్‌లో అదనంగా 10% వాటాను పొందేందుకు సంబంధించినది. అక్వైరర్ ప్రస్తుతం టార్గెట్‌లో 40% వాటాను కలిగి ఉన్నారు.

అక్వైరర్ సింగపూర్‌లో విలీనం అయింది. ఇది కైస్ డి డెపొట్ ఎట్ ప్లేసెమెంట్ క్యూబెక్ కి సంబంధించిన ప్రత్యక్ష, పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ, ఇది ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెట్టబడిన సుమారు సిఏడి 420 బిలియన్ల నికర ఆస్తులతో దీర్ఘకాలిక సంస్థాగత పెట్టుబడిదారు, ఇది ప్రధానంగా పబ్లిక్, పారా-పబ్లిక్ పెన్షన్లు, బీమా పథకాలు  కోసం నిధులను నిర్వహిస్తుంది. . ది టార్గెట్ అనేది పునరుత్పాదక శక్తి (గాలి, సౌరశక్తితో సహా), ట్రాన్స్‌మిషన్, సూపర్‌క్రిటికల్ బొగ్గు, గ్యాస్ ఆధారిత ఉత్పత్తిలో విస్తరించిన పెట్టుబడితో భారతీయ విద్యుత్ రంగంలో విదేశీ పెట్టుబడి. టార్గెట్ 2002లో దేశంలోకి ప్రవేశించింది.  అప్పటి నుండి దాని నిర్వహణ సంప్రదాయ,  పునరుత్పాదక ఆస్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించింది.

 

****



(Release ID: 1857028) Visitor Counter : 100


Read this release in: English , Urdu , Hindi