ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఎన్ ఈ జి డి (NeGD) ప్రగతిశీల డిజిటల్ నాయకుల కోసం 2వ క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణను నిర్వహిస్తుంది.
Posted On:
05 SEP 2022 7:19PM by PIB Hyderabad
డిజిటల్ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ప్రధాన సాంకేతికత అయిన క్లౌడ్ కంప్యూటింగ్‌పై నిర్వహిస్తున్న శిక్షణ శ్రేణి కి కొనసాగింపుగా, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలోని నేషనల్ ఇ-గవర్నెన్స్ విభాగం (NeGD) రెండవ బ్యాచ్ సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ లైన్ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర/యుటి డిపార్ట్‌మెంట్లు, మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌లు, ఇ-గవర్నెన్స్ ప్రాజెక్ట్ హెడ్‌లు మరియు రాష్ట్ర ఇ-మిషన్ బృందాల ప్రభుత్వ అధికారులకు క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఆగస్టు 25-26, 2022 తేదీలలో సామర్థ్య నిర్మాణ శిక్షణ జరిగింది.
మైసూరులోని అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ATI)లో రెండు రోజుల రెసిడెన్షియల్ శిక్షణ జరిగింది. ప్రారంభోత్సవం రోజున, ఏ టీ ఐ (ATI) మైసూరు ప్రొఫెసర్ ఇ-గవర్నెన్స్ శ్రీ చేతన్ పాల్గొన్న 24 మందిని స్వాగతించారు. షిలోహు రావు, జి ఎం (GM, NeGD) మరియు సత్యజిత్ రావు వాగ్వాలా, (SGM, NISG), లు కార్యక్రమం యొక్క ఉద్దేశ్యాన్ని తెల్పుతూ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ప్రవీణుడు కావడం యొక్క ప్రాముఖ్యతను మరియు సమర్థవంతమైన పాలన కోసం దాని యొక్క అవసరాన్ని వివిధ విశిష్ట అంశాలను వివరించారు; ఎదైనా ప్రకృతి వైపరీత్యం, విద్యుత్ వైఫల్యం లేదా ఇతర ప్రమాదాలను సంక్షోభాన్ని ఎదుర్కొన్నా, క్లౌడ్‌లో డేటా నిల్వ చేయబడితే అది బ్యాకప్ చేయబడిందని మరియు భద్రంగా మరియు సురక్షితమైన ప్రదేశంలో రక్షించబడిందని నిర్ధారిస్తుంది. ఆ డేటాను మళ్లీ శీఘ్రంగా తిరిగి పొందగలగడం వల్ల ఎవరైనా యధావిధిగా తమ కార్యకలాపాలను నిర్వహించగలుగుతారు, అలాగే వృదాసమయం మరియు ఉత్పాదకత నష్టాన్ని తగ్గించవచ్చు.
పరిశ్రమ, విద్యారంగ మరియు ప్రభుత్వ విషయ నిపుణులందరినీ ని ఈ వర్క్‌షాప్ ఒకచోట చేర్చింది.
క్లౌడ్ ఆర్కిటెక్చర్, క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలు, క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ సేవలందించే సంస్థల ఎంపిక, నమోదు క్లౌడ్ కోసం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) యొక్క మార్గదర్శకాలు, క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్‌లను అమలు చేస్తున్నప్పుడు పరి గణించాల్సిన అంశాలు, భద్రత మరియు నియంత్రణ కోల్పోవడం, విధానం మరియు అనుసరణ, ఆచరణ, సృజనాత్మక విధ్వంసం, ఫీచర్ మార్పులు, ఫోరెన్సిక్స్ మరియు వలస మరియు క్లౌడ్ యొక్క భవిష్యత్తు వంటి వాటితో సహా పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు క్లౌడ్ కంప్యూటింగ్ అవసరాలను ఎలా లెక్కించవచ్చో ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా చూపించారు. భారతదేశంలోని పౌరులకు సాంకేతికత ఎలా అత్యంత ప్రభావవంతంగా ఉపయోగపడుతుందో వివరించే ప్రసిద్ధ సందర్భ పరిశీలనలైన (కేస్-స్టడీస్) హు కోవిన్, పోషన్ ట్రాకర్ మరియు డిజిలాకర్ గురించి వివరించారు.
ఈ వర్క్‌షాప్ ప్రభుత్వ అధికారుల కోసం నిర్వహించిన క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణల శ్రేణిలో రెండవది. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, మణిపూర్, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వ లైన్ మంత్రిత్వ శాఖల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఇదే అంశంపై మూడవ వర్క్‌షాప్ 2022 సెప్టెంబర్ 15-16 తేదీలలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతుంది.
***
(Release ID: 1857027)
Visitor Counter : 148