కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సి-డాట్ మరియు ఎన్‌డిఎంఏలు విపత్తుల ప్రభావాలను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు శిక్షణ ఇవ్వడానికి సిఏపి ఆధారిత ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్-సాచెట్‌పై ఆల్‌ ఇండియా వర్క్‌షాప్‌ను నిర్వహించాయి.

Posted On: 31 AUG 2022 6:25PM by PIB Hyderabad

 

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డాట్) టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (డిఓటి), భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ మరియు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఏ) ప్రధాన ఆర్&డి కేంద్రం సంయుక్తంగా ఈరోజు  కామన్ అలర్ట్ ప్రోటోకాల్ (సిఏపి) ఆధారిత ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్‌పై ఆల్ ఇండియా వర్క్‌షాప్ నిర్వహించాయి.

image.png

 

భారతదేశం అంతటా అలర్ట్ జనరేటింగ్ ఏజెన్సీలు, అలర్ట్ ఆథరైజింగ్ ఏజెన్సీలు మరియు అలర్ట్ డిసెమినేటింగ్ ఏజెన్సీలతో పాటు  సంబంధిత వాటాదారులకు వారి సమస్యలు మరియు సవాళ్లను చర్చించడానికి మరియు తెలివైన చర్చల ద్వారా వాటిని సమర్థవంతంగా పరిష్కరించడానికి అలాగే నిపుణులు మరియు సాంకేతిక నిపుణుల గెలాక్సీ ద్వారా సాంకేతికత ఆధారిత పరిష్కారాలను రూపొందించడానికి ఒక వేదికను అందించడం ఈ వర్క్‌షాప్ లక్ష్యం.

ప్రారంభ సెషన్‌కు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డిసిసి) చైర్మన్ మరియు కార్యదర్శి (టెలికాం), డిఓటి శ్రీ కె రాజారామన్ అధ్యక్షత వహించారు. అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాల సహకారం ఉపయోగించుకోవడంతో పాటు ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్‌ను అమలు చేయడంలో సి-డాట్ మరియు ఎన్‌డిఎంఏ స్వదేశీ కార్యక్రమాలను ప్రశంసించారు. ప్రాణాలను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని ఆ దిశగా దేశం ఎంతో ముందుకు సాగిందని తెలిపారు. టెలికాం రంగంలో ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన పెట్టుబడి పెట్టబడింది మరియు అన్ని మూలలు ఇప్పుడు అనుసంధానించబడి ఉన్నాయి. కాబట్టి హెచ్చరిక యంత్రాంగం లేకుండా ఏ మారుమూల ప్రాంతం ఉండకూడదు. ప్రస్తుత నెట్‌వర్క్‌లో సెల్ బ్రాడ్‌కాస్ట్ ఆవశ్యకతను అలాగే రాబోయే 5జి ఎన్‌ఎస్‌ఏ సొల్యూషన్‌లను ఆయన నొక్కి చెప్పారు.

శ్రీమతి బి.వి. ఉమాదేవి, భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) అదనపు కార్యదర్శి (డిఎం) మాట్లాడుతూ.. ప్రయత్నాల సమన్వయాన్ని తీసుకురావడంలో వాటాదారులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం చాలా ముఖ్యమైనదని అన్నారు.కాప్ ప్రాజెక్ట్  మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసినందుకు సి-డాట్‌ని ఆమె అభినందించారు.

ఐటియూ ప్రమాణాల ప్రకారం కాప్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్ అమలు చేయబడిందని ఇది మన  గౌరవనీయ  ప్రధానమంత్రి 10-పాయింట్ ఎజెండాతో సమకాలీకరించబడిందని సి-డాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ చెప్పారు. డాక్టర్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ..అమలుతో దేశవ్యాప్తంగా హెచ్చరిక వ్యవస్థను కలిగి ఉన్న 6వ దేశంగా భారతదేశం అవతరించిందని తెలిపారు. సంబంధిత వాటాదారుల మధ్య సినర్జీ ద్వారా నడిచే స్వదేశీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌  అసంఖ్యాక సామర్థ్యాలను నొక్కి చెప్పారు. అలాగే భవిష్యత్ రోడ్‌మ్యాప్‌ను చర్చించారు.

ఎన్‌డిఎంఏ  మెంబర్ సెక్రటరీ శ్రీ కమల్ కిషోర్ మాట్లాడుతూ.. విపత్తులు ఎటువంటి  సమయం ఇవ్వవు అలాగే సంఘటనలు చాలా స్థానికంగా ఉంటాయి కాబట్టి హెచ్చరిక అనేది ప్రదేశ నిర్ధిష్టంగా, సమయానుకూలంగా, సమర్ధవంతంగా, చర్య తీసుకోదగినదిగా మరియు వ్యక్తుల-కేంద్రీకృతమై ఉండాలి అని తెలిపారు.

ఏపీ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు కాప్‌ని మెచ్చుకున్నాయి మరియు సంక్షోభ సమయంలో హెచ్చరికలను వ్యాప్తి చేయడానికి వారు దీనిని ఉపయోగిస్తున్నారని మరియు ఇది ప్రాణాలను కాపాడటానికి మరియు సకాలంలో చర్య తీసుకోవడానికి తమకు సహాయపడిందని చెప్పారు.

ఎన్‌డిఎంఏ,డాట్, ఇండియన్ రైల్వేస్, ఇండియన్ మెట్రాలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండి), సెంట్రల్ వాటర్ కమీషన్ (సిడబ్ల్యూసి), ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్)డిఫెన్స్ జియోఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డిజిఆర్ఈ) సహా వివిధ ప్రభుత్వ శాఖల నుండి  ప్రముఖులు మరియు వక్తలు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మరియు 36 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు (ఎస్‌డిఎంలు) ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. విపత్తు నిర్వహణ మరియు సంసిద్ధతకు సంబంధించిన వివిధ సమకాలీన సమస్యలపై చర్చించారు.

ఎన్‌డిఎంఏకు చెందిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ అలర్ట్ సిస్టమ్‌ను సి-డాట్‌ అభివృద్ది చేసింది.ఎస్‌ఎంఎస్‌, సెల్ బ్రాడ్‌కాస్ట్, రేడియో, టీవీ,సైరన్, సోషల్ మీడియా, వెబ్ పోర్టల్స్ మరియు మొబైల్ అప్లికేషన్స్ సహా అందుబాటులో ఉన్న అన్ని కమ్యూనికేషన్ మీడియాల ద్వారా స్థానిక భాషలలో విపత్తు సంభవించే ప్రాంతాలలో నివసించే ప్రజలకు లక్ష్య హెచ్చరికలు మరియు సలహాల వ్యాప్తి కోసం ఒక కన్వర్జ్డ్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది.  ఈ వన్-స్టాప్ సొల్యూషన్ విపత్తు రిస్క్ తగ్గింపు కోసం గౌరవనీయులైన ప్రధాన మంత్రి సూచించిన 10 పాయింట్ల ఎజెండాను సాకారం చేసే దిశగా ఒక నిర్దిష్ట దశ.

ఈ వ్యవస్థ ఇప్పటికే 34 రాష్ట్రాలు మరియు యూటీలలో అమలవుతోంది. తుఫానులు (అసాని, యాస్, నివార్, అంఫాన్), వరదలు (అస్సాం, గుజరాత్), పిడుగులు (బీహార్) మొదలైన వివిధ విపత్తుల్లో ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటికే 75 కోట్లకు పైగా ఎస్‌ఎంఎస్‌లు పంపబడ్డాయి. అమర్‌నాథ్ యాత్రికుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి కూడా ఈ వ్యవస్థ ఉపయోగించబడింది.


 

*****(Release ID: 1855847) Visitor Counter : 160


Read this release in: English , Urdu , Hindi