ఆయుష్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, నరేలాను సందర్శించిన ఆయుష్ మంత్రి
ఎన్ఐహెచ్, నరేలా ఆధునిక ఔషధాలతో ఆయుష్ ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో, సమగ్రపరచడంలో సహాయం చేస్తుంది: శ్రీ సర్బానంద సోనోవాల్
Posted On:
26 AUG 2022 4:13PM by PIB Hyderabad
కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ నేడు దిల్లీలోని నరేలాలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిని సందర్శించారు. ఎన్ఐహెచ్, నరేలా, కోల్‌కతాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతికి చెందిన శాటిలైట్ ఇన్‌స్టిట్యూట్, ఉత్తర భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి సంస్థ.
ఈ కార్యక్రమంలో ఆయుష్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్ కాలుభాయ్, పార్లమెంటు సభ్యుడు శ్రీ హన్సరాజ్ హన్స్, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ఎన్ఐహెచ్ ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతీయ ఆరోగ్య విధానం, ఆరోగ్య సంరక్షణలో ఆయుష్ యొక్క అంతర్-ప్రధాన స్రవంతిని మరియు ఆరోగ్య సంరక్షణ డెలివరీ యొక్క అన్ని స్థాయిలలో విద్య మరియు పరిశోధనలలో ఈ వ్యవస్థలను ఏకీకృతం చేయాలని కూడా సంకల్పించిందని సమావేశాన్ని ఉద్దేశించి శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిశోధనాభివృద్ధి, ఇన్నోవేషన్‌లను ప్రోత్సహించడానికి, హోమియోపతిలో విద్య మరియు పరిశోధన కోసం ఉన్నత స్థాయి సంస్థలను అభివృద్ధి చేయడానికి వివిధ చర్యలను చేపట్టిందని ఆయన అన్నారు. ఈ హోమియోపతి ఇన్‌స్టిట్యూట్ ఆయుష్ వ్యవస్థను ప్రాచుర్యంలోకి తెస్తుందని.. దేశంలోని ఉత్తర ప్రాంత అవసరాలను తీరుస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
దిల్లీలోని నరేలాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతికి 16 అక్టోబర్, 2018న శంకుస్థాపన చేశారు. ఈ సంస్థ హోమియోపతిలోని వివిధ విభాగాలలో గొప్ప నిపుణులను పరిచయం చేస్తుంది. ఈ సంస్థ 7 విభాగాలను కలిగి ఉంటుంది. హోమియోపతి వైద్యంలో వివిధ విభాగాలలో పీజీ & డాక్టోరల్ కోర్సులను అందిస్తుంది. ఔషధాల అభివృద్ధి, నాణ్యత నియంత్రణ, భద్రతా మూల్యాంకనం మరియు హోమియోపతి అభ్యాసాల యొక్క శాస్త్రీయ ధృవీకరణ యొక్క ప్రాథమిక అంశాలపై కూడా సంస్థ దృష్టి సారిస్తుంది. ఈ సంస్థ విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు పరిశోధనలలో ఉన్నతస్థాయి ప్రమాణాలను ఏర్పాటు చేస్తుంది.
ఎన్ఐహెచ్, నరేలా రూ. 287 కోట్లతో నిర్మిస్తున్నారు. హోమియోపతి వ్యవస్థలో ప్రపంచ భాగస్వామ్యం, పరిశోధన కోసం అంతర్జాతీయ సహకార కేంద్రంగా కూడా పని చేస్తుంది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన విశ్వవిద్యాలయాలు/పరిశోధన సంస్థలతో ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని ఏర్పరచడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది.
*****
(Release ID: 1854793)
Visitor Counter : 143