వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022-2023 సంవత్సరంలో బాస్మతి బియ్యం పంట విస్తీర్ణాన్ని, ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి బాస్మతి పంట సర్వేను ప్రారంభించిన ప్రభుత్వం


రెండేళ్ల విరామం తర్వాత పంటల సర్వే నిర్వహణ

ఏప్రిల్-జూన్ 2022-23లో 25.54% పెరిగి 1.15 బిలియన్ డాలర్లకు చేరుకున్న బాస్మతి బియ్యం ఎగుమతులు.

Posted On: 12 AUG 2022 5:33PM by PIB Hyderabad

వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA), వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2022-2023 ఖరీఫ్ సీజన్‌లో వాతావరణ ఆధారిత పంటల విస్తీర్ణాన్ని, వాటి ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి మరియు సుగంధ మరియు దీర్ఘ ధాన్యం వరిని అంచనా వేయడానికి బాస్మతి పంట సర్వేను ప్రారంభించింది. ఇందుకోసం దిగుబడిని ఆధారంగా చేసుకోనుంది.

కోవిడ్-19 పరిమితుల వల్ల 2020, 2021లో నిర్వహించలేని కారణంగా రెండేళ్ల విరామం తర్వాత బాస్మతి పంట సర్వే నిర్వహిస్తున్నారు. బాస్మతి బియ్యం అనేది రిజిస్టర్డ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ చేయబడిన వ్యవసాయ ఉత్పత్తి మరియు ప్రపంచ మార్కెట్‌లో దీనికి చక్కని డిమాండ్ కూడా ఉంటుంది.

APEDA యొక్క విభాగమైన బాస్మతి ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (BEDF) క్రింద ఈ సర్వేని అమలు చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తుది సర్వే నివేదికను ఖరారు చేయాల్సి ఉంది.

సర్వే నమూనా ప్రకారం, జమ్మూ & కాశ్మీర్‌లో మూడు జిల్లాలు, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ వంటి ఏడు రాష్ట్రాలలో జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన రైతుల నమూనా సమూహం ఆధారంగా బాస్మతి ఉత్పత్తి క్షేత్ర ఆధారిత మరియు ఉపగ్రహ చిత్రాల సర్వే జరుగుతోంది.

ఖచ్చితత్వ స్థాయిలను నిర్ధారించడానికి, GPS పాయింట్లు నమోదు అయి ఉండాలి. అలాగే ప్రతి రైతుని సర్వేలో పాల్గొనే సమయంలో ఫోటోగ్రాఫ్ తీస్తారు.

గత ఆర్థిక సంవత్సరం సంబంధిత నెలలలో USD 922 మిలియన్లతో పోలిస్తే; బాస్మతి బియ్యం ఎగుమతులు ఏప్రిల్-జూన్ 2022-23లో 25.54 శాతం పెరిగి USD 1.15 బిలియన్లకు చేరాయి.

BEDF ద్వారా APEDA బాస్మతి వరి సాగును ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేస్తోంది. APEDA మరియు BEDF ద్వారా నిర్వహితమవుతోన్న వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా, రైతులకు ధృవీకరణ పొందిన విత్తనాల వినియోగం, మంచి వ్యవసాయ పద్ధతులు మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్రిమిసంహారక మందుల యొక్క న్యాయమైన వినియోగం గురించి తెలియజేస్తున్నారు.

బాస్మతి బియ్యం సాగు భారతీయ సంప్రదాయం మరియు ప్రపంచ మార్కెట్‌లో బాస్మతి బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉన్నందున ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం సమిష్టి బాధ్యత అవుతుంది.

రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా basmati.netలో నమోదు చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలి.

ఈ కార్యక్రమాలలో భాగంగా, BEDF ఏడు రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని బియ్యం ఎగుమతిదారుల సంఘాలతో పాటు సంబంధిత రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖల సహకారంతో, అధిక నాణ్యత గల బాస్మతి వరిని పండించే రైతులను ప్రోత్సహించడానికి 75 అవగాహన మరియు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. BEDF వివిధ FPOలు, ఎగుమతిదారుల సంఘాలు మొదలైనవాటికి సాంకేతిక భాగస్వామిగా కూడా పాల్గొంటుంది.

భారతదేశం గత మూడేళ్లలో దాదాపు 12 బిలియన్ డాలర్ల మేరకు బాస్మతిని ఎగుమతి చేసింది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యెమెన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కువైట్, యునైటెడ్ కింగ్‌డమ్, ఖతార్ మరియు ఒమన్‌లు 2021-22లో భారతదేశం నుండి వచ్చే సుగంధ పొడవైన ధాన్యపు బియ్యం మొత్తం షిప్‌మెంట్‌లలో 80 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

బాస్మతి బియ్యం భారతదేశం నుండి ఎగుమతి అవుతున్న అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తి. 2020-21లో భారతదేశం USD 4.02 బిలియన్ల విలువతో 4.63 మిలియన్ MT బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. 2009-10లో బాస్మతి బియ్యం ఎగుమతి 2.17 మిలియన్ మెట్రిక్ టన్నులతో పోలిస్తే గత 10 సంవత్సరాల్లో బాస్మతి బియ్యం ఎగుమతులు రెండింతలు పెరిగాయి.

 

 

****(Release ID: 1852307) Visitor Counter : 50


Read this release in: English , Urdu , Hindi