ఉక్కు మంత్రిత్వ శాఖ

ఇండియన్ మినరల్స్ & మెటల్ ఇండస్ట్రీపై కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ఎన్‌ఎండిసీ &ఎఫ్‌ఐసీసీఐ

Posted On: 13 AUG 2022 11:46AM by PIB Hyderabad

నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎండిసి), ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సిపిఎస్‌ఈ  మరియు ఫిక్కి భారతీయ ఖనిజాలు మరియు లోహాల పరిశ్రమపై  'ట్రాన్సిషన్ టువర్డ్స్ 2030 & విజన్ 2047' అనే అంశంపై న్యూఢిల్లీలో ఆగస్టు 23, 24 తేదీల్లో  సదస్సును నిర్వహించనుంది.

 75  ఏళ్ల భారత స్వాతంత్ర్య జ్ఞాపకార్థం మరియు కేంద్ర ఉక్కు మరియు గనుల మంత్రిత్వ శాఖల సహకారంతో కొనసాగుతున్న “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” సందర్భంగా ఈ రెండు రోజుల కార్యక్రమం నిర్వహించబడుతోంది. 'విజన్ 2047' సాధించడానికి ఖనిజాలు & లోహాల రంగానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై చర్చలు జరపడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం.

ఈ కార్యక్రమానికి పరిశ్రమ, విధాన మరియు విద్యాసంస్థల నుండి వక్తలు హాజరవుతారు. ప్రపంచ మరియు దేశీయ ఉత్పత్తిదారులు, ఖనిజ సంస్థలు, విధాన రూపకర్తలు, గని పరికరాల తయారీదారులు, గ్లోబల్ కార్పొరేట్ సంస్థల దేశాధినేతలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ సదస్సుకు హాజరై ప్రసంగిస్తారు.

 

image.png

కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఫిక్కీ మైనింగ్ కమిటీ చైర్, ఎన్‌ఎండిసి లిమిటెడ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సుమిత్ దేబ్ మాట్లాడుతూ "దేశంలో విస్తారమైన ఖనిజ వనరుల ఆధారం మరియు వ్యాపార మరియు నియంత్రణ వాతావరణంలో అంతర్జాతీయ దిగ్గజాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోని గనులు మరియు ఖనిజ పరిశ్రమలపై దేశీయ సంస్థలతో పాటు అంతర్జాతీ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.

"పరిశ్రమతో పాటు కేంద్ర మరియు రాష్ట్రాలతో సహా  సంబంధిత వాటాదారుల మధ్య సహకారం కీలకం. రాబోయే సమావేశం సహకారాన్ని బలోపేతం చేయడానికి మరియు ముందుకు సాగే ప్రణాళికను రూపొందించడానికి ఒక వేదికగా పని చేస్తుంది.

సవాళ్లు మరియు అడ్డంకులను పరిష్కరించడం మరియు వాటికి పరిష్కారాలను కనుగొనడం పురోగతికి కీలకం మరియు ఈ సమావేశం దానికి సరైన వేదికను అందిస్తుందని మిస్టర్ దేబ్ అన్నారు.

“వ్యాపార పర్యావరణ వ్యవస్థను సులభతరం చేయడానికి మరియు దేశాన్ని స్వావలంబనగా మార్చడానికి భారతదేశంలోని మైనింగ్ రంగం సంస్కరణలతో ఒక నమూనా మార్పు ద్వారా వెళుతోంది.

రాబోయే సమావేశంలో కొత్త యుగం ఖనిజాలు, డిజిటలైజేషన్ & ఆటోమేషన్ మరియు ఇతర సాంకేతిక ఆవిష్కరణలపై కూడా చర్చలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఖనిజాలు మరియు లోహాల భవిష్యత్తుపై కంట్రీ ప్యానెల్ చర్చ కూడా ఉంటుంది.

ఖనిజాలు మరియు లోహాల కోసం ప్రపంచ కమోడిటీస్ మార్కెట్‌ను అర్థం చేసుకోవడం, ఖనిజాల అభివృద్ధి మరియు ఆర్థిక వృద్ధి మధ్య పరస్పర సంబంధాన్ని హైలైట్ చేయడం, భారతీయ ఖనిజాలు మరియు లోహాల పరిశ్రమపై ప్రభావం చూపగల అంతర్జాతీయ మార్కెట్లలో పరిణామాలు మరియు భారతీయ ఖనిజాలు మరియు లోహాలలో అవకాశాలను గుర్తించడం వంటి అంశాలను ఈ సదస్సు ద్వారా తెలియజేస్తుంది.

భారతదేశం చాలా ఖనిజాలను కలిగి ఉంది. ఇంధనం, అణు, లోహ,లేహేతర మరియు మైనర్ ఖనిజాలతో సహా 95 ఖనిజాలను ఉత్పత్తి చేస్తుంది. అన్వేషించబడని కారణంగా వాటిని వెలికితీసేందుకు మైనింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి.


 

*******



(Release ID: 1851743) Visitor Counter : 130


Read this release in: English , Urdu , Hindi